Pheromone Maxxing : డేటింగ్‌లోకి ఫెరోమోన్ వింత ట్రెండ్.. జెన్ జీ అబ్బాయిలకు ఇదేం పిచ్చి?
Pheromone Maxxing : మనుషులు, జంతువుల బాడీ నుంచి వచ్చే నేచురల్ చెమట స్మెల్లోనే ఎదుటివారిని ఆకర్షించే ఫెరోమోన్లు అనే కెమికల్స్ రిలీజ్ అవుతాయి.
Pheromone Maxxing
జనరల్‌గా ఎవరైనా ఒక అబ్బాయి.. అమ్మాయితో ఫస్ట్ డేటింగ్‌కి వెళ్తున్నారు అంటే .. పర్ఫెక్ట్ హెయిర్‌స్టైల్‌తో బ్రాండెడ్ డ్రెస్ వేసుకుని, మత్తెక్కే పర్ఫ్యూమ్ కొట్టుకుని నీట్‌గా వెళ్తారు. కానీ కొద్ది రోజులుగా అమెరికాలో కొంతమంది జెన్-జీ (Gen-Z) అబ్బాయిలు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా బిహేవ్ చేస్తున్నారు.
ఎంతగా అంటే వింటేనే ఒళ్లు జలదరించేంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. డేట్‌కు వెళ్లేముందు.. సబ్బుతో స్నానం చేస్తే శరీరంలోని నేచురల్ ఆకర్షణ చచ్చిపోతుందని 2, 3 రోజులు స్నానం చేయకుండా, ఉతకని మురికి బట్టలు వేసుకుని తమ పార్ట్నర్ను కలవడానికి వెళుతున్నారు.
ఇంతవరకూ చదువుతుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అటువంటిది ఆ రెండు రోజులు కూడా తమ యూరిన్ తాము తాగుతూ తర్వాత డేటింగ్‌కి వెళ్తున్నారట. దీంతో సోషల్ మీడియాలో సైకో లెవెల్లో వైరల్ అవుతున్న ఈ ఫెరోమోన్ మాక్సింగ్ (Pheromone-maxxing) గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
నిజానికి మనుషులు, జంతువుల బాడీ నుంచి వచ్చే నేచురల్ చెమట స్మెల్లోనే ఎదుటివారిని ఆకర్షించే ఫెరోమోన్లు అనే కెమికల్స్ రిలీజ్ అవుతాయట. జంతువులలో మేట్‌కు ముందు జరిగేది కూడా ఇదే. అందుకే యానిమల్స్ ఫార్ములానే తమ లైఫ్‌లోనూ వాడుకుంటాం అంటున్నారు జెన్ జీ అబ్బాయిలు.
ఫెరోమోన్లను సబ్బులు, షాంపూలతో కడిగినా, పర్ఫ్యూమ్లు కొట్టినా ఆ నేచురల్ ఆకర్షణ మొత్తం పోతుందని ఈ కుర్రాళ్లు నమ్ముతున్నారు. అందుకే డేట్‌కి వెళ్లే రెండు రోజుల ముందు నుంచే స్నానం చేయడాన్ని ఆపేస్తున్నారు. తమ బాడీలో నుంచి వచ్చే నేచురల్ అండ్ ఘాటైన వాసనతోనే అమ్మాయిలను ఇంప్రెస్ చేయొచ్చని అనుకుంటున్నారు. ఇక్కడితో ఆగితే పర్వాలేదు, తమ బాడీలో ఈ ఫెరోమోన్ల ఉత్పత్తిని ఇంకా పెంచుకోవడానికి తమ మూత్రాన్ని తామే తాగే వింత పనులు చేస్తున్నారు.
ఈ ట్రెండ్‌పై డాక్టర్లు, సైంటిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జంతువుల విషయానికి వస్తే ఫెరోమోన్స్ పని చేస్తాయేమో కానీ, మనుషుల్లో మాత్రం స్నానం చేయకుండా ఉంటే వచ్చే దారుణమైన చెమట స్మెల్ వల్ల ఎదుటివారు అట్రాక్ట్ అవుతారనడం నాన్సెన్స్ అని.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతున్నారు.

పైగా రోజుల తరబడి స్నానం చేయకపోవడం వల్ల చర్మ వ్యాధులు అలాగే యూరిన్ తాగడం వల్ల కిడ్నీలు, జీర్ణవ్యవస్థ దెబ్బతిని హాస్పిటల్ పాలవుతారని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం క్రియేటర్లు పెట్టే ప్రతీ పిచ్చి పోస్టును కూడా సైంటిఫిక్ ఫ్యాక్ట్ అనుకుని గుడ్డిగా ఫాలో అవ్వొద్దని అంటున్నారు.
మరోవైపు యూఎస్‌లోని అమ్మాయిలు కూడా ఈ పిచ్చి పనిపై ఫైర్ అవుతున్నారు. స్నానం చేయకుండా దుర్వాసనతో వస్తే రోత పుడుతుంది తప్ప డేటింగ్ వరకూ అసలు వెళ్లమని తెగేసి చెబుతున్నారు.
Shopping Bill : షాపింగ్ బిల్లులు కొన్ని రోజులకే మాయమవుతున్నాయా? మరి గ్యారంటీ, వారంటీ మాటేంటి?





