Just SpiritualJust TechnologyLatest News

Vedas : అణు సిద్ధాంతం నుంచి అంతరిక్షం వరకు మన వేదాల్లోనే ..భారతీయ విజ్ఞాన ఘనత ఇదే..

Vedas : మన భారతీయ వేదాలు, పురాణాలు కేవలం ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినవి మాత్రమే కాదని.. అవి అంతుచిక్కని విజ్ఞానానికి నిలయాలు అన్న విషయం ఇప్పుడు ప్రపంచ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తుంది

Vedas

మన భారతీయ వేదాలు, పురాణాలు(Vedas) కేవలం ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినవి మాత్రమే కాదని.. అవి అంతుచిక్కని విజ్ఞానానికి నిలయాలు అన్న విషయం ఇప్పుడు ప్రపంచ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తుంది. ప్రపంచం గర్విస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ, సైన్స్ థియరీలకు మన ఋషులు పునాదులు వేల ఏళ్ల క్రితమే వేశారు. వారు కేవలం మత బోధకులు, ఆచార్యులు మాత్రమే కాదు, అద్భుతమైన పరిశోధనలు చేసిన మహా సైంటిస్టులు . టెలిస్కోప్‌లు, లాబొరేటరీలు లేని కాలంలోనే విశ్వ రహస్యాలను మెడిటేషన్‌తో ఆవిష్కరించిన వారి మేధస్సు.. అసాధారణం అని ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది.

ఆధునిక విజ్ఞాన శాస్త్ర చరిత్ర(History of modern science)లో న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం ఒక మైలురాయి అని చెప్పొచ్చు. కానీ, దానికి వందల ఏళ్లకు ముందే భాస్కరాచార్యులు తన సిద్ధాంత శిరోమణిలో భూమికి ఉండే ఆకర్షణ శక్తి గురించి వివరించారు. అలాగే ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌కు ప్రాణాధారమైన సున్నా, దశాంశ వ్యవస్థ (Decimal System) వేదాల నుంచే పుట్టాయి.

ఇక అణువు (Atom) గురించి ఇప్పటి సైన్స్ మాట్లాడుతుంటే, మహర్షి కానడ్ తన వైశేషిక సూత్రంలో వేల ఏళ్ల క్రితమే అణు సిద్ధాంతానికి పునాది వేశారు. పురాణాల్లో(Vedas) మనం చదివే అతి శక్తివంతమైన బ్రహ్మాస్త్రం, ఇప్పటి అణు బాంబులకు ప్రాచీన రూపమని కొంతమంది సైంటిస్టులు విశ్లేషిస్తున్నారు…

ఆస్ట్రానమీ విషయానికి వస్తే.. భూమి తన అక్షంపై తాను తిరుగుతుందని చంద్రునికి సొంత ప్రకాశం లేదంటూ ఆర్యభట్టుడు శతాబ్దాల క్రితమే నిరూపించారు.అలాగే పౌర్ణమి సమయంలో సముద్రపు ఆటుపోట్లకు చంద్రుడి ఆకర్షణే కారణమని మన పురాణాలు ముందే చెప్పాయి.

మరోవైపు చంద్రుని గమనం మనిషి మనసుపై కూడా ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తోంది. మానవ శరీరంలో అధిక శాతం నీరు ఉండటం వల్ల, పౌర్ణమి సమయంలో చంద్రుని ప్రభావంతో మానసిక స్థితిలో మార్పులు వస్తాయని, ఆ సమయంలో నేరాలు పెరగడానికి కూడా ఇదే కారణమని విశ్లేషకులు చెబుతుంటారు.

Vedas
Vedas

మన ఋషులు ఆకాశాన్ని 27 నక్షత్రాలుగా విభజించడంతో పాటు, సూర్య చంద్రుల గమనాలను కచ్చితంగా లెక్కించడం తెలిసిందే. వారు రూపొందించిన పంచాంగం ఇప్పటికీ కచ్చితమైన ఫలితాలను ఇస్తుండటంపై ప్రపంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సైన్స్ థియరీలు మన ప్రాచీన గ్రంథాల నుంచి ప్రేరణ పొందినవే. మొత్తంగా ఋషులు అందించిన ఈ విజ్ఞాన సంపదపై ఇప్పటికీ ..ఇంటర్నేషనల్ స్థాయిలో పరిశోధనలు జరుగుతూనే ఉండటం మనందరికీ గర్వకారణంగానే చెప్పొచ్చు.

Mitchell Marsh : శతక్కొట్టిన మిఛెల్ మార్ష్..ఆర్సీబీకి లక్నో షాక్

Related Articles

Back to top button