Just SpiritualLatest News

Somvati Amavasya : సోమవతి అమావాస్య ఎప్పుడు? ఆ రోజు ఇవి అస్సలు కొనకండి..

Somvati Amavasya : ఈ సోమవతి అమావాస్య రోజు ముఖ్యంగా శివారాధనకు ప్రాధాన్యత ఇస్తారు

Somvati Amavasya

హిందూ క్యాలెండర్ ప్రకారం 2026 జూన్ 15, సోమవారం రోజు వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అని పిలుస్తారు. సోమవారం రోజు అమావాస్య తిథి రావడం అనేది ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనది అలాగే అరుదైనది. సోమవారం పరమశివునికి ఎంతో ఇష్టమైన రోజు కావడం వల్ల, ఆ రోజు శివపార్వతులను భక్తితో పూజిస్తే జాతకంలో ఉన్న చంద్ర దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.

అమావాస్య తిథి ఈ నెల 14న ఆదివారం మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రారంభమయ్యి.. జూన్ 15 వ తేదీ సోమవారం ఉదయం 8:24 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం, జూన్ 15న సోమవారం రోజు ఈ సోమవతి అమావాస్య(Somvati Amavasya) జరుపుకోనున్నారు. ఈ ఏడాది ఇది అధికమాసంలో రావడం వల్ల ..ఈ సోమ అమావాస్య(Somvati Amavasya) ప్రాముఖ్యత చాలా రెట్లు పెరుగుతుంది.

ఈ సోమవతి అమావాస్య(Somvati Amavasya) రోజు ముఖ్యంగా శివారాధనకు ప్రాధాన్యత ఇస్తారు. సోమవారం పరమశివునికి ప్రీతిపాత్రమైన రోజు కావడం,అలాగే దానికి అమావాస్య తిథి తోడవడంతో ఆ రోజు శివపార్వతులను పూజిస్తే జాతకంలో ఉన్న చంద్ర దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అలాగే ఆ రోజు చేసే జపాలు, దాన ధర్మాలకు వంద రెట్లు ఎక్కువ ఫలితం దక్కుతుందని చెప్తారు.

ముఖ్యంగా ఆ రోజు మహిళలు తమ భర్త ఆయురారోగ్యాల కోసం, కుటుంబ సౌభాగ్యం కోసం సోమవతి వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతంలో భాగంగా రావి చెట్టుకు పూజలు చేసి, దాని చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. ఎందుకంటే రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారని..ఇలా ప్రదక్షిణలు చేస్తే ఆ మహిళలకు దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని పెద్దలు చెబుతారు.

దీంతో పాటు ఈ అమావాస్య పితృ దేవతల ఆరాధనకు కూడా ఎంతో అనుకూలమైన రోజుగా చెబుతారు . ఆ రోజు నదీ స్నానం చేసి, పితృ తర్పణాలు వదలడం , అన్నదానం చేయడం వల్ల పితృ దోషాలు తొలగిపోయి, పెద్దల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అలాగే మెడిటేషన్ లేదా ఆధ్యాత్మిక సాధన చేసే వారికి ఆ రోజు చాలా త్వరగా మనశ్శాంతిని, ఏకాగ్రతను ఇస్తుంది.

Somvati Amavasya
Somvati Amavasya

అయితే ఈ పవిత్రమైన రోజు కొన్ని వస్తువులను అస్సలు కొనకూడదని.. కొన్ని వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. సాధారణంగా అమావాస్య రోజు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు, అందుకే కొన్ని పనులకు దూరంగా ఉండటం మంచిది.

ఆ రోజు కొత్త బట్టలు, కొత్త వాహనాలే కాదు అసలు ఎలాంటి కొత్త వస్తువులను కొనకూడదు. ముఖ్యంగా ఇనుము వస్తువులు, నూనె, ఉప్పు వంటివి ఇంటికి తీసుకురాకూడదు.

Hyderabad : డేంజర్‌ జోన్‌లో హైదరాబాద్‌..ప్రపంచంలోని హాటెస్ట్ నగరాల జాబితాలో చోటు

Related Articles

Back to top button