Just SpiritualJust LifestyleLatest News

Soul transfer:ఆత్మ మరో శరీరంలోకి వెళ్లడం సాధ్యమా? పరకాయ ప్రవేశం గురించి యోగ శాస్త్రం ఏం చెబుతుంది?

Soul transfer: మనసును , ప్రాణాన్ని శరీరంపై పట్టు కోల్పోయేలా చేసే బంధాలను వదులుకునే యోగులకు మాత్రమే ఇది సాధ్యమని యోగ శాస్త్రంలో వివరంగా ఉంది.

Soul transfer

భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో అలాగే యోగ శాస్త్ర నిగూఢ రహస్యాలలో కూడా పరకాయ ప్రవేశం అనే మాట ఒక అంతుచిక్కని అద్భుతంగా కనిపిస్తుంది. వినడానికే చాలా వింతగా, అంతకు మించి ఆశ్చర్యంగా అనిపించే ఈ ప్రక్రియ గురించి సామాన్యుల నుంచి సైంటిస్టుల వరకు అందరిలో కూడా ఏదోక మూల జిజ్ఞాస ఉంటూనే ఉంటుంది.

అసలు ఒక మనిషి తన ప్రాణాన్ని లేదా స్పృహను తన శరీరం నుంచి వేరు చేసి, మరొకరి శరీరంలోకి ప్రవేశపెట్టడం సాధ్యమా? ఈ విద్య వెనుక ఉన్న అసలు మర్మమేంటి? పురాణాలు ఏం చెబుతున్నాయి? వంటి ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతాయి.

దీని గురించి సింపుల్‌గా చెప్పాలంటే పరకాయ ప్రవేశం(Soul transfer) అంటే ఒక వ్యక్తి.. తన భౌతిక కాయాన్ని తాత్కాలికంగా వదిలిపెట్టి, మరొక జీవి లేక వేరొక మనిషి శరీరంలోకి ప్రవేశించి, ఆ బాడీని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడమే. ఇక్కడ పర అంటే అన్యుల, కాయ అంటే శరీరం అని అర్థం. ఇది ఏదో ఇంద్రజాలం లేదా మ్యాజిక్ లాంటిది కాదు.

పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో పరకాయ ప్రవేశాన్ని అష్ట సిద్ధులలో ఒకటైన ఉన్నతమైన శక్తిగా అభివర్ణించారు. మనసును , ప్రాణాన్ని శరీరంపై పట్టు కోల్పోయేలా చేసే బంధాలను వదులుకునే యోగులకు మాత్రమే ఇది సాధ్యమని యోగ శాస్త్రంలో వివరంగా ఉంది. అలాగే తీవ్రమైన తపస్సు, ప్రాణాయామం, కుండలినీ శక్తిని జాగృతం చేసిన సిద్ధులు తమ సూక్ష్మ శరీరాన్ని.. స్థూల శరీరం నుంచి వేరు చేయగలరని ఆధ్యాత్మిక గ్రంథాలు ఉదాహరణలతో వివరిస్తున్నాయి.

నిజానికి ఈ విద్య కేవలం వినోదం కోసం పుట్టినది అస్సలు కాదు. దీని వెనుక కొన్ని గొప్ప ఉద్దేశాలు ఉండేవని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా జ్ఞాన సముపార్జన కోసమే ఈ పరకాయ ప్రవేశాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. ఒక యోగి తన బ్రహ్మచర్యం లేక సన్యాస నియమాల వల్ల పొందే వీలుకాలేని ప్రాపంచిక అనుభవాలను స్వయంగా తెలుసుకోవడానికి,అలాగే విశ్వంలోని రహస్యాలను ఛేదించడానికి పరకాయ ప్రవేశాన్ని ఎంచుకునేవారు.

కొన్ని సందర్భాల్లో లోక కళ్యాణం కోసం, గొప్ప వ్యక్తులు అకాల మరణం చెందితే .. వారు మొదలుపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేయడానికి సిద్ధులు వారి శరీరంలోకి ప్రవేశించి కార్యాచరణను పూర్తి చేసేవారని పురాణ గాథలు చెబుతున్నాయి.

Soul transfer
Soul transfer

పరకాయ ప్రవేశం(Soul transfer) అనగానే అందరికీ మొదటిగా ఆది శంకరాచార్యుల జీవితంలోని అద్భుత ఘట్టమే గుర్తొస్తుంది. మండన మిశ్రుడి భార్య ఉభయ భారతితో సంభాషిస్తున్న సమయంలో, ఆమె శృంగార శాస్త్రానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు, బ్రహ్మచారి అయిన శంకరులు.. శృంగార శాస్త్రానికి సంబంధించిన అనుభవాలను తెలుసుకోవడానికి అమరుక మహారాజు శరీరంలోకి ప్రవేశించారని అందులో చెబుతారు.

అలాగే తమిళ సిద్ధుడు అయిన తిరుమూలర్ ఒక గొర్రెల కాపరి శరీరంలోకి వెళ్లి..తనుకున్న గొప్ప జ్ఞానాన్ని అతనికి అందించారని పురాణ గాథలు ఉన్నాయి. నేటి మోడర్న్ సైన్స్.. స్పృహ (Consciousness) అనేది కేవలం మెదడుకు పరిమితమైనదా లేక అది విశ్వవ్యాప్తమైనదా అనే కోణంలో పరిశోధనలు చేస్తోంది. సైన్స్ పరంగా ఇది ఇంకా ఒక రహస్యమే అయినా సరే, భారతీయ యోగ విజ్ఞానానికి మాత్రం ఇది ఒక తిరుగులేని నిదర్శనంగా నిలిచిపోయింది.

Dunning Kruger Effect:డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ .. సబ్జెక్ట్ లేకపోయినా బిల్డప్ ఇచ్చే వారు మీ ముందే ఉంటారు

Related Articles

Back to top button