Devdutt Padikkal : సెంచరీతో చెలరేగిన పడిక్కల్ ..తొలి రోజు భారత్ జోరు
Devdutt Padikkal : ఇండిపెండెన్స్ రోజు సెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా పడిక్కల్ నిలిచాడు. 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ బ్యాటర్ కూడా ఇలాంటి ఘనత సాధించలేదు.
Devdutt Padikkal
శ్రీలంకతో తొలి టెస్టును భారత్ ఫుల్ జోష్‌తో ప్రారంభించింది. వార్మప్ మ్యాచ్ ఇచ్చిన విజయమో మరో కారణమో తెలీదు కానీ తొలి టెస్ట్ మొదటి రోజు పూర్తి ఆధిపత్యం కనబరిచింది. భారత్‌కు ఇది 600వ చారిత్రక టెస్ట్ కావడం విశేషం. ఈ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి పటిష్ఠ స్థితికి చేరుకుంది. బ్యాటింగ్‌లో పడిక్కల్ సెంచరీతో మెరిస్తే, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ సాధించాడు.
ఓపెనర్లు జైస్వాల్ , రాహుల్ భారత్‌కు మంచి ఆరంభమే ఇచ్చారు. తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడుతున్న జైస్వాల్ విచిత్రమైన రీతిలో రనౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో కేఎల్ రాహుల్ ఆడిన షాట్‌ను ఆపే ప్రయత్నంలో శ్రీలంక బౌలర్ కేషార నువాన్త.. జైస్వాల్‌ను ఢీకొట్టడంతో అతను కిందపడిపోయాడు.
ఈ గందరగోళం వల్ల జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇద్దరూ నాన్-స్ట్రైకర్ ఎండ్ చేరుకున్నారు. లంక ఆటగాళ్లు వికెట్లను పడగొట్టడంతో రీప్లేలను పరిశీలించి రాహుల్ క్రీజులో ముందుగా బ్యాట్ ఉంచినట్లు తేలడంతో జైస్వాల్ 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరగాల్సి వచ్చింది. ఈ దశలో పడిక్కల్ , రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దరూ లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ రెండో వికెట్‌కు 150 పరుగులు పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
అయితే 77 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర రాహుల్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. తర్వాత కెప్టెన్ గిల్ (16) నిరాశ పరిచినా, పడిక్కల్ సెంచరీతో చెలరేగాడు. మధ్యలో వర్షం కారణంగా ఆటకు కొద్దిసేపు అంతరాయం కలిగినా, అద్భుతమైన షాట్లతో అలరించిన పడిక్కల్, 147 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

కాగా భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజు సెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ బ్యాటర్ కూడా ఇలాంటి ఘనత సాధించలేదు. అంతేకాకుండా 21వ శతాబ్దంలో మూడో స్థానంలో సెంచరీ బాదిన రెండో భారత లెఫ్టాండర్‌గా కూడా పడిక్కల్ రికార్డ్ సాధించాడు.
దీంతో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 288 పరుగులు చేసింది. పడిక్కల్ 131 (12 ఫోర్లు, 1 సిక్సర్ ) , పంత్ 27 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా తొలి రోజు 73 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమయింది.
Lac Bangles : చార్మినార్ చుట్టూ మెరిసే లక్క గాజుల సీక్రెట్..రాయల్ బ్యాంగిల్స్ హిస్టరీ తెలుసా?





