Just SportsLatest News

IND vs NZ : ఆఖరి పోరు కివీస్ సొంతం.. టీ20 సిరీస్ మాత్రం టీమిండియాదే..

IND vs NZ : హామిల్టన్ వేదికగా జరిగిన చివరి టీ20లో న్యూజిలాండ్ విజయాన్ని సాధించింది.ఆఖరి మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా కూడా భారత్ 3-2 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.

IND vs NZ

హామిల్టన్ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్(IND vs NZ) మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో కివీస్ జట్టు ఘన విజయాన్ని సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్..స్టార్టింగ్‌లోనే ఇబ్బంది పడింది. కేవలం 19 రన్స్‌కే ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆ స్టేజిలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (61), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (50) అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు ఏకంగా 93 రన్స్ కీలక భాగస్వామ్యాన్ని జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఇక చివర్లో వచ్చిన నమన్ ధిర్ (33), ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (29) మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాక.. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 రన్స్ భారీ స్కోరును సాధించింది.

అయితే, 192 రన్స్ భారీ టార్గెట్‌తో క్రీజ్‌లోకి వచ్చిన న్యూజిలాండ్ బ్యాటర్లు స్టార్టింగ్‌ నుంచే విరుచుకుపడ్డారు. ఓపెనర్ టిమ్ సీఫర్ట్ కేవలం తృటిలో సెంచరీని కోల్పోయి 93 రన్స్‌తో అజేయంగా నిలవగా, మరో బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ (65) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగిపోయారు.

డారిల్ మిచెల్ కూడా తన వంతుగా 29 రన్స్ జోడించడంతో కివీస్ జట్టు కేవలం 18 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను చాలా ఈజీగా ఛేదించింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీసినా కూడా కివీస్ జోరును ఆపలేకపోయారు.

అయితే చివరి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్‌కు ఓటమి ఎదురైనా కూడా, ఐదు మ్యాచ్‌ల ఈ(IND vs NZ) టీ20 సిరీస్‌ను అద్భుతంగా ఆడిన టీమిండియా 3-2 తేడాతో కైవసం చేసుకుని సిరీస్ విజేతగా నిలిచింది.

RC17 Movie : చిరు క్లాప్‌తో లాంఛనంగా పట్టాలెక్కిన #RC17..చెర్రీ,సుక్కూ కాంబోపై పెరిగిన బజ్..

Related Articles

Back to top button