Kolkata Knight Riders : కోల్ కథ ఇంకా ఉంది..ముంబై ఇండియన్స్ పై విజయం
Kolkata Knight Riders : కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తన ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవం చేసుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన చావో రేవో మ్యాచ్‌లో కేకేఆర్ విజయం సాధించింది
Kolkata Knight Riders
ఐపీఎల్ 19వ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి. కీలక మ్యాచ్ లో ఆ జట్టు ముంబై ఇండియన్స్ ను ఓడించింది. బౌలింగ్ లో సమిష్టిగా రాణిస్తే.. బ్యాటింగ్ లో మనీశ్ పాండే, పావెల్ మెరుపులు మెరిపించారు.ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన కేకేఆర్ ఈ విజయంతో ప్లే ఆఫ్ రేసులో నిలిచింది.
హార్దిక్ పాండ్యా రీఎంట్రీతో ముంబై రాత మారుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రికెల్టన్ త్వరగానే ఔటయ్యారు. నమన్ ధీర్ కూడా నిరాశ పరిచాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా తన పేలవ ఫామ్ ను కంటిన్యూ చేయడంతో ముంబై 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ నిలిచిపోయింది. మళ్లీ తిరిగి ప్రారంభమైన తర్వాత ముంబైని కెప్టెన్ హార్దిక్ పాండ్యా , తిలక్ వర్మ ఆదుకునే ప్రయత్నం చేశారు.
వీరిద్దరూ ఐదో వికెట్‌కు 49 బంతుల్లో 43 పరుగులు జోడించారు. తిలక్ వర్మ ఒక సిక్సర్ తో 20 పరుగులకే ఔటయ్యాడు. తిలక్ అవుటైన కాసేపటికే హార్దిక్ పాండ్యా (26)కూడా వెనుదిరగడంతో ముంబై 95 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. కనీసం 120 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానాలు వచ్చాయి. చివరి రెండు ఓవర్లలో కార్బిన్ బాష్, దీపక్ చాహర్ ధాటిగా ఆడడంతో ముంబై ఇండియన్స్ 147 పరుగులు చేయగలిగింది.
కార్బిన్ బాష్ 18 బంతుల్లో 32(3 ఫోర్లు, 2 సిక్సర్లు) దీపక్ చాహర్ 7 బంతుల్లో 10 పరుగులు చేయడంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. కోల్‌కతా(Kolkata Knight Riders) బౌలర్లలో సౌరభ్ దూబే, కామెరూన్ గ్రీన్, కార్తీక్ త్యాగీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సునీల్ నరైన్ ఒక వికెట్ తీసుకున్నాడు.

ఛేజింగ్ లో కోల్ కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) కూడా తడబడింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (8) పరుగులకే ఔటయ్యాడు. తర్వాత రహానే, మనీశ్ పాండే ఇన్నింగ్స్ కొనసాగించారు. వీరిద్దరూ 38 పరుగులు జోడించారు. రహానే (21) ఔటైన కాసేపటికే కామెరూన్ గ్రీన్ (4) కూడా నిరాశ పరిచాడు. ఈ దశలో పాండేకు, హిట్టర్ పావెల్ జత కలిసాడు.
వీరిద్దరూ నాలుగో వికెట్ కు 64 పరుగులు జోడించారు. మధ్య మధ్యలో పావెల్ భారీ షాట్ల కొట్టడంతో సాధించాల్సిన రన్ రేట్ పెరగకుండా జాగ్రత్త పడింది. అయితే చివర్లో మనీశ్ పాండే 33 బంతుల్లో 45 (6 ఫోర్లు), పావెల్ 30 బంతుల్లో 40 (4 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులకే వెంటవెంటనే ఔటవడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ దశలో రింకూ సింగ్ 9 నాటౌట్, అంకుల్ రాయ్ 4 నాటౌట్ మ్యాచ్ ను ముగించారు. కోల్ కతా మరో 7 బంతులు మిగిలుండగా లక్ష్యాన్ని అందుకుంది.
H1B Visa : 60 రోజుల్లో కొత్త జాబ్ రావాల్సిందే..హెచ్1బీ వీసాదారుల కష్టాలు





