Just SportsLatest News

Mumbai Indians : శతక్కొట్టిన తిలక్ వర్మ..ముంబై పరాజయాలకు బ్రేక్

Mumbai Indians : అహ్మదాబాద్ లో తెలుగోడి బ్యాట్ గర్జించింది. ఫామ్ లో లేక విమర్శలు ఎదుర్కొంటున్న హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ సెంచరీతో చెలరేగిపోయాడు

Mumbai Indians

అహ్మదాబాద్ లో తెలుగోడి బ్యాట్ గర్జించింది. ఫామ్ లో లేక విమర్శలు ఎదుర్కొంటున్న హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ సెంచరీతో చెలరేగిపోయాడు. 22 బంతుల్లో 19 పరుగులే చేసిన తిలక్ తర్వాత 83 రన్స్ ను కేవలం 22 బంతుల్లోనే బాదేశాడు. ఈ విధ్వంసంతో ఐపీఎల్ లో తొలి శతకాన్ని అందుకున్న తిలక్ ముంబైకి భారీస్కోరు అందించాడు. తర్వాత బౌలర్లు చెలరేగడంతో ముంబై(Mumbai Indians) పరాజయాలకు బ్రేక్ పడింది.

అసలు ఈ మ్యాచ్ లో ముంబై ఇన్నింగ్స్ ఆరంభం చూసిన తర్వాత ఎవ్వరూ భారీస్కోరు చేస్తుందని అనుకోలేదు. కేవలం 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. డికాక్ (13), మలేవర్ (2), సూర్యకుమార్ యాదవ్ (15) పరుగులకే వెనుదిరిగారు. ఈ దశలో తెలుగుతేజం తిలక్ వర్మ, నమన్ ధీర్ తో కలిసి జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 52 పరుగులు జోడించారు.

నమన్ ధీర్ 32 బంతుల్లో 45 (6 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులకు ఔటైన తర్వాత తిలక్ వర్మ రెచ్చిపోయాడు. భారీ సిక్సర్లతో గుజరాత్ బౌలింగ్ ను ఉతికారేశాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తిలక్ తర్వాత మరింతగా చెలరేగిపోయాడు. నిజానికి మొదటి 22 బంతుల్లో తిలక్ చేసింది 19 పరుగులే. కానీ ఆ తర్వాత పూనకం వచ్చినట్టుగా రెచ్చిపోయిన తిలక్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 22 బంతుల్లోనే మరో 83 పరుగులు బాదేయడం ద్వారా సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

హార్థిక్ పాండ్యాతో కలిసి 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తిలక్ వర్మ సెంచరీ ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 7 సిక్సర్లున్నాయి. అసలు తిలక్ సెంచరీ అవుతుందని కూడా ఎవ్వరూ ఊహించలేదు. అయితే పాండ్యా ఎక్కువసార్లు స్ట్రైకింగ్ ఇవ్వడం, చివర్లో రూథర్ ఫర్డ్ కూడా సపోర్ట్ చేయడంతో తిలక్ శతక్కొట్టాడు.

దీంతో ముంబై ఇండియన్స్(Mumbai Indians) 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసింది. తిలక్ వర్మ 45 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు. తిలక్ వర్మకు ఇదే తొలి శతకం. అలాగే ముంబై తరపున అత్యంత వేగంగా ఐపీఎల్ సెంచరీ సాధించిన జయసూర్య రికార్డును తిలక్ సమం చేశాడు.తర్వాత ఛేజింగ్ లో గుజరాత్ టైటాన్స్ గట్టిపోటీ ఇస్తుందనుకుంటే చేతులెత్తేసింది.

Mumbai Indians
Mumbai Indians

ఆరంభంలోనే ఆ జట్టు స్టార్ బ్యాటర్లందరూ ఇంటిదారి పట్టారు. బుమ్రా ఎట్టకేలకు తొలి వికెట్ సాధించాడు. సాయి సుదర్శన్ ను డకౌట్ గా పెవిలియన్ కు పంపాడు. బట్లర్(5), శుభమన్ గిల్(14), గ్లెన్ ఫిలిప్స్(6), తెవాటియా(8) అట్టర్ ఫ్లాప్ అయ్యారు. వాషింగ్టన్ సుందర్(26), షారూఖ్ ఖాన్(17) కాసేపు ధాటిగా ఆడినా పరుగుల అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగారు.

వీరిద్దరూ ఔటైన తర్వాత గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. చివరికి గుజరాత్ 15.5 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌటైంది. ముంబై(Mumbai Indians) బౌలర్లలో అశ్విని కుమార్ 4 వికెట్లు తీశాడు. ఈ సీజన్ లో ముంబైకి ఇది రెండో విజయం. అటు గుజరాత్ కు హ్యాట్రిక్ విజయాల తర్వాత ఇదే తొలి ఓటమి.

Airport : ఏపీలో ఎయిర్‌పోర్టుల జోరు.. ఏ జిల్లాలో ఏయే ఎయిర్‌పోర్టులు ఉన్నాయో తెలుసా?

Related Articles

Back to top button