Just SportsLatest News

Team India : అడుగుదూరంలో కప్పు..అందుకుంటుందా ఇండియా ?

Team India : క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు ఇంకా కొద్ది గంటలే మిగిలింది. భారత ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టే రాణిస్తూ టైటిల్ పోరుకు దూసుకొచ్చిన టీమిండియా

Team India

క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు ఇంకా కొద్ది గంటలే మిగిలింది. భారత ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టే రాణిస్తూ టైటిల్ పోరుకు దూసుకొచ్చిన టీమిండియా(Team India) వరుసగా రెండోసారి, ఓవరాల్ గా మూడోసారి ప్రపంచకప్ గెలుస్తుందా…చరిత్ర సృష్టిస్తుందా..

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఏ జట్టు కూడా వరుసగా రెండుసార్లు టైటిల్ గెలవలేదు. అలాగే మూడుసార్లు ప్రపంచకప్ గెలవలేదు. అదే సమయంలో సొంతగడ్డపై ఏ జట్టు కూడా వరల్డ్ కప్ గెలుచుకోలేకపోయింది. ఒకవేళ భారత్ గెలిస్తే ఈ మూడు అరుదైన రికార్డులు సొంతం చేసుకుంటుంది.

ఇదిలా ఉంటే భారత జట్టు(Team India) ఈ మెగాటోర్నీలో ఫైనల్ కు చేరినా కొన్ని బలహీనతలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. అభిషేక్ శర్మ వైఫల్యం దీనిలో మొదటిది. సంజూ శాంసన్ ఆడుతుండడంతో అభిషేక్ వైఫల్యాల పరంపరను పట్టించుకోవడం లేదు. కానీ ఫైనల్లో మాత్రం అభిషేక్ షేక్ ఆడించాల్సిందేనని అభిమానులు కోరుతున్నారు.

అలాగే కెప్టెన్ సూర్యకుమార్ వ్యక్తిగత ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. మునుపటి సూర్యకుమార్ బ్యాటింగ్ ఈ టోర్నీలో కనిపించలేదు. సో ఫైనల్లో సూర్యకుమార్ కూడా దుమ్మురేపాల్సిందే. ఇక అన్నింటికంటే ముఖ్యంగా భారత్ ను టెన్షన్ పెడుతోంది బౌలింగ్ విభాగం. బుమ్రా తప్పిస్తే మిగిలిన బౌలర్లంతా అట్టర్ ఫ్లాప్ అయ్యారు.

Team India 
Team India

భారీగా పరుగులిచేస్తున్నారు. టీ20 ఫార్మాట్ లో అత్యుత్తమ ఎకానమీ బౌలర్ గా రికార్డున్న అర్షదీప్ సింగ్ ఈ మెగాటోర్నీలో ఘోరంగా విఫలమయ్యాడు. ప్రతీ మ్యాచ్ లో ఓవర్ కు 9 నుంచి 10కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లాండ్ తో సెమీఫైనల్లో భారత్ 253 పరుగులు చేసినా కూడా కేవలం 7 పరుగుల తేడాతో గెలిచిందంటే మన బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 16, 18 ఓవర్లను బుమ్రా కట్టుదిట్టంగా వేయకుంటే పరిస్థితి మరోలా ఉండేది.

ఈ నేపథ్యంలో అర్షదీప్ ఖచ్చితంగా లైన్ అండ్ లెంగ్త్ అందుకోవాల్సిందే. అటు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. మిస్టరీ స్పిన్నర్ గా పేరున్న వరుణ్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. అతని బౌలింగ్ ను ప్రత్యర్థి బ్యాటర్లు అలవోకగా ఆడేస్తున్నారు. తన బౌలింగ్ శైలిని కూడా వరుణ్ మార్చుకుంటేనే తర్వాత జట్టులో ప్లేస్ ఉంటుంది. ఈ ఫైనల్లో కూడా వరుణ్ ను తప్పిస్తారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరి వరుసగా రెండోసారి వరల్డ్ కప్ అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్న భారత జట్టు బౌలింగ్ లో మెరుగవ్వకుంటే మాత్రం నిరాశే మిగులుతుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button