Just NationalJust PoliticalLatest News

Narendra Modi : 76వ ఏట అడుగుపెట్టిన ప్రధాని మోదీ.. ప్రజా సేవలోనూ పాతికేళ్ల మైలురాయి..

Narendra Modi : సుమారు 12 ఏళ్లకు పైగా గుజరాత్ ముఖ్యమంత్రిగా,12 ఏళ్లుగా భారత ప్రధానమంత్రిగా మొత్తంగా 9104 రోజులకు పైగా పాలనాధిపతిగా ఉంటూ మోదీ రికార్డు క్రియేట్ చేశారు.

Narendra Modi

నేడు అంటే సెప్టెంబర్ 17వ తేదీన భారత ప్రధాని నరేంద్ర దామోదరదాస్ మోదీ 76వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అంతేకాదు గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ఒక ప్రభుత్వాధినాయకుడిగా పాతికేళ్ల సుదీర్ఘ ప్రజా సేవను కంప్లీట్ చేసుకుంటున్న అరుదైన సందర్భం కూడా ఇది. అందుకే దేశమంతటా ఈ రోజును ‘సేవా దివస్’ పేరుతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు.

ఒక సాధారణ టీ అమ్మే యువకుడిగా జీవితాన్ని ప్రారంభించి..ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రాభవం ఉన్న నేతగా ఎదిగి, వరుసగా మూడుసార్లు భారతదేశానికి ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించడం అంటే అది మామూలు విషయం కాదు.

గుజరాత్‌ వాద్‌నగర్‌లో అతి సాధారణమైన కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోదీ(Narendra Modi), పట్టుదలతో ఆరెస్సెస్‌లో చేరి 1971 నుంచి పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేశారు. 1985లో బీజేపీ బాధ్యతలు చేపట్టిన ఆయన, 2001లో తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు.

సుమారు 12 ఏళ్లకు పైగా గుజరాత్ ముఖ్యమంత్రిగా, 12 ఏళ్లుగా భారత ప్రధానమంత్రిగా మొత్తంగా 9104 రోజులకు పైగా పాలనాధిపతిగా ఉంటూ రికార్డు క్రియేట్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 7 నాటికి ఆయన సుదీర్ఘ 25 ఏళ్ల పరిపాలనా మైలురాయిని అఫీషియల్‌గా అధిగమించనున్నారు.

ఈ ఏడు పదుల వయసులో కూడా రోజుకు 16 నుంచి 18 గంటలు నాన్‌స్టాప్‌గా పని చేయడం మోదీ ప్రత్యేకత. 12 ఏళ్ల ప్రధాని హయాంలో ఆయన ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోకపోవడం విశేషం. ఎంత బిజీగా ఉన్నా రోజూ రెగ్యులర్‌గా యోగా, మెడిటేషన్ చేయడం వల్లే మోదీ ఫిజికల్‌గా, మెంటల్‌గా కూడా అంత ఫిట్‌గా ఉండగలుగుతున్నారు.

మన్ కీ బాత్ ద్వారా కోట్లాది మంది ప్రజలకు దగ్గరవుతూ, దేశంలో గుర్తింపునకు నోచుకోని ఎంతోమంది రియల్ హీరోలను వెలుగులోకి తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోదీదే.

దేశ ప్రయోజనాల కోసం నరేంద్ర మోదీ(Narendra Modi) తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు భారత్ ఇమేజ్‌ను వరల్డ్ వైడ్‌గా పెంచాయి. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ మాత్రమే కాకుండా 2047 నాటికల్లా భారత్‌ను డెవలప్ చెందిన దేశంగా మార్చే మాస్టర్ ప్లాన్‌తో పనిచేస్తున్నారు.

పేదల కోసం ఆయుష్మాన్ భారత్, జన్‌ధన్ అకౌంట్లు, పీఎం ఆవాస్, ఉజ్వల యోజన వంటి స్కీమ్స్ మోదీ అందించారు. అంతేకాకుండా యూపీఐ డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్‌ను గ్లోబల్ దేశాలు ఆశ్చర్యపోయేలా ప్రవేశపెట్టారు.

కరోనా కష్టకాలంలో దేశాన్ని ఏకతాటిపైకి తేవడమే కాకుండా వ్యాక్సిన్ మైత్రి ద్వారా ప్రపంచ దేశాలకు అండగా నిలిచారు. ఇంటర్నేషనల్ ఆయిల్ సంక్షోభం వచ్చినా, దౌత్యనీతితో 145 కోట్ల మంది ఇండియన్స్‌కు ఇంధన కొరత రాకుండా చూశారు.

డిఫెన్స్ సెక్టార్‌లో మోదీ మార్క్ విధానాలు శత్రుదేశాలకు వణుకును పుట్టించాయి. 2016 సర్జికల్ స్ట్రయిక్స్, 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, 2025 ఆపరేషన్ సింధూర్ ద్వారా సరిహద్దు దాటి శత్రువుపై దెబ్బకొట్టే స్వేచ్ఛను డిఫెన్స్ ఫోర్స్‌కు ఇచ్చారు.

మోదీ ఆలోచనా విధానంతోనే ఫారిన్ ఇంపోర్ట్స్ తగ్గించి స్వదేశీ ఆయుధ తయారీకి ప్రాధాన్యమిచ్చారు. అలాగే ఆధ్యాత్మికంగా కాశీ విశ్వనాథ్ కారిడార్, కేదార్‌నాథ్ పునర్నిర్మాణంతో పాటు, కోట్లాది మంది కల అయిన అయోధ్య రామమందిర నిర్మాణాన్ని సాకారం చేసి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చారు .

అమెరికా, రష్యాతో పాటు సుమారు 34 దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్న ఏకైక గ్లోబల్ లీడర్ నరేంద్ర మోదీనే. సోషల్ మీడియాలోనూ మోదీ హవా బాగానే నడుస్తోంది. ఎక్స్‌లో 107.1 మిలియన్ల ఫాలోవర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 106 మిలియన్ల ఫాలోవర్లతో ట్రంప్‌ను కూడా మించిపోయి వరల్డ్‌లోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న దేశాధినేతగా నిలిచారు.

Narendra Modi
Narendra Modi

ఈ 76వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా రాత్రి 7 గంటలకు ప్రతీ ఇంట్లో ఆశీర్వాద దీపం వెలిగించాలని బీజేపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. అలాగే వారణాసిలో ఎన్డీయే ముఖ్యమంత్రుల భేటీతో పాటు బీజేపీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 17 వ తేదీ వరకు నెల రోజుల పాటు సేవా సే సంకల్ప్ అభియాన్ పేరుతో భారీ సంక్షేమ కార్యక్రమాలను జరపబోతున్నారు.

లీడర్ అంటే కేవలం పవర్‌లో ఉండటం కాదని.. కోట్లాది మందికి అభివృద్ధిని చూపించి దేశాన్ని ముందుండి నడిపించడమేనని నరేంద్ర మోదీ(Narendra Modi) తన 25 ఏళ్ల పాలనా ప్రస్థానంతో ప్రూవ్ చేశారు.

Ego In Relationship : బంధంలో ఈగో అడ్డుగోడ వేస్తోందా? స్పందన లేని భాగస్వామితో ముందడుగు వేయొచ్చా?

Related Articles

Back to top button