Bigg BossJust EntertainmentLatest News

Bigg Boss Captain Task : పీక్స్‌కి చేరిన కెప్టెన్సీ టాస్క్.. బిగ్ బాస్ హౌస్‌లో కొట్టుకునే వరకూ వెళ్లిన కంటెస్టెంట్లు..

Bigg Boss Captain Task : ఒక్కో టీమ్‌ నుంచి ఒకరు స్క్రీన్‌పై కనిపించే యానిమల్ బొమ్మలను చూసి యాక్టింగ్ చేస్తే, రెండో వారు ఆ యానిమల్ ఏంటో తెలుసుకుని కరెక్ట్ బాక్సులను సెట్ చేయాలి.

Bigg Boss Captain Task

బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ కిరీటం ఎవరికి వెళుతుందో కానీ దాని కోసం కంటెస్టెంట్లు పడే పాట్లు, ఆడే మైండ్ గేమ్‌లు ఆడియన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచుతున్నాయి. ముందురోజు టాస్క్‌లో గెలిచిన నలుగురు విజేతలను ఈరోజు ఇద్దరిద్దరి చొప్పున 2 టీమ్‌లుగా విడగొట్టాడు బిగ్ బాస్.

ఒక్కో టీమ్‌ నుంచి ఒకరు స్క్రీన్‌పై కనిపించే యానిమల్ బొమ్మలను చూసి యాక్టింగ్ చేస్తే, రెండో వారు ఆ యానిమల్ ఏంటో తెలుసుకుని కరెక్ట్ బాక్సులను సెట్ చేయాలి(Bigg Boss Captain Task). ఈ ఫన్నీ అండ్ టాస్క్ గేమ్‌లో ఝాన్సీ , ముకేశ్ ఒక టీమ్, అమన్ ,షాలిని మరో టీమ్‌గా తలపడ్డారు.

చివరికి ముకేశ్, ఝాన్సీ టీమ్ గెలిచారు. ఓడిపోయిన అమన్, షాలినిలో ఒకరిని రేస్ నుంచి తప్పించే పవర్ బిగ్ బాస్ ముకేశ్ టీమ్‌కు ఇచ్చాడు. దీంతో యాక్టింగ్ సరిగ్గా చేయలేదనే కారణం చెప్పి అమన్‌ను ముకేశ్, ఝాన్సీ ఎలిమినేట్ చేశారు. కానీ అమన్ మాత్రం తాను బాగానే చేశా, షాలినికే హైట్ లేదు, సరిగ్గా అర్థం చేసుకోలేదంటూ బ్లేమ్ చేయడంతో షాలిని గట్టిగా గొడవకు దిగింది. చివరకు ముకేశ్, ఝాన్సీ, షాలిని నెక్స్ట్ లెవల్‌కి ప్రమోట్ అయ్యారు.

ఇంతలో చిన్న విరామం దొరకడమే ఆలస్యం.. హౌస్‌లో ఫుడ్ గొడవలు కలకలం రేపాయి. ఒక పక్క తిండి విషయంలో వంశీ , వర్షిణి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరగగా, మరో పక్క త్రిగుణ్, ముకేశ్ కూడా ఫుడ్ విషయంలోనే ఒకరిపై ఒకరు ఫైర్ అయ్యారు.

తర్వాత అసలైన డ్రామా నెక్స్ట్ టాస్క్‌లో స్టార్టయింది.ముందురోజు బెలూన్ గేమ్‌లో ఓడిపోయిన రోహిత్, త్రిగుణ్, రామ్ ప్రసాద్, దేబ్జానీకి బిగ్ బాస్ మరో అవకాశం ఇచ్చాడు. ఇందులో రామ్ ప్రసాద్, త్రిగుణ్ ఒక టీమ్, దేబ్జానీ , రోహిత్ మరో టీమ్‌గా విడిపోయారు. పై నుంచి పడే బ్యాగులను పట్టుకుని, బజర్ మోగే టైమ్‌కి చేతిలో ఉన్న బ్యాగ్‌లోని బాల్స్‌తో ఫ్రేమ్‌లోని డిస్కులను కింద పడేయాలి.

దీనికి వంశీ సంచాలక్‌గా వ్యవహరించాడు. ఈ గేమ్‌లో బ్యాగుల కోసం గ్రూపు సభ్యులు ఒకరిపై ఒకరు పడిపోయి, చొక్కాలు పట్టుకుని కొట్టుకునేంత రేంజ్‌లో రచ్చ చేశారు. దెబ్బలు తగిలినా కూడా అస్సలు తగ్గలేదు.

ఓడిపోవటాన్ని తట్టుకోలేక దేబ్జానీ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక రోహిత్ విపరీతంగా అలిసిపోయాడు. ఈ రచ్చ మధ్యలోనే వంశీ, రోహిత్‌ మధ్య ఫిజికల్ ఫైట్ వరకూ వెళ్లేంతగా గొడవ జరిగింది. టాస్క్ అయిపోయాక అమన్, రోహిత్‌ తమ గ్రూపిజం గేమ్ బయటపెడితే.. షాలిని, సృష్టి కూడా అగ్నిపరీక్ష గ్రూప్ తెరను బయటకు తీశారు.

అయితే ఈ గేమ్‌లో చివరి రౌండ్(Bigg Boss Captain Task) వచ్చేసరికి బాగా అలసిపోయిన రోహిత్.. అప్పటికే లీడ్‌లో ఉన్న రామ్ ప్రసాద్ టీమ్‌ని ఒక్క బ్యాగ్ వదిలేయండి బ్రో.. తాను ఆడలేననంటూ పబ్లిక్‌గానే అడుక్కున్నాడు. అంతకుముందు వేరొకరు గివ్ అప్ ఇచ్చారని రీజన్ చెబుతూ నామినేట్ చేసిన రోహిత్, ఇప్పుడు తనే గివ్ అప్ ఇచ్చి బ్యాగ్ కోసం బతిమాలుకోవడం ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచింది.

ఈ పాయింట్‌ను నెక్స్ట్ టైమ్ నామినేషన్లలో వాడకూడదనే కండిషన్ పెట్టి రామ్ ప్రసాద్, త్రిగుణ్ జాలిపడి బ్యాగ్ ఇచ్చినా.. రోహిత్ , దేబ్జానీ గెలవలేకపోయారు.చివరికి రామ్ ప్రసాద్, త్రిగుణ్ జోడీ విజయం సాధించింది.

Bigg Boss Captain Task
Bigg Boss Captain Task

టాస్క్ ముగిశాక, రోహిత్,దేబ్జానీ టీమ్ నుంచి ఒకరిని తప్పించమని బిగ్ బాస్ చెప్పడంతో.. రోహిత్ నువ్వు వీక్ దేబ్జానీ, ప్లీజ్ తప్పుకో అని అడిగాడు. కానీ దేబ్జానీ దానికి గట్టిగా నో అని తెగేసి చెప్పడంతో.. బిగ్ బాస్ ఆ నిర్ణయాన్నిరామ్ ప్రసాద్, త్రిగుణ్ చేతికి ఇచ్చాడు.వాళ్లు రోహిత్‌ను ఎలిమినేట్ చేయడంతో దేబ్జానీ కెప్టెన్సీ రేసులో నిలిచింది(Bigg Boss Captain Task).

మొత్తానికి దేబ్జానీ, త్రిగుణ్, రామ్ ప్రసాద్, ముకేశ్, ఝాన్సీ, షాలిని మాత్రమే కెప్టెన్సీ రేసులో మిగిలారు. మరి ఈ ఆరుగురి మధ్య ఎలాంటి పోరాటం ఏ రేంజ్‌లో జరగబోతోందో చూడాలి మరి .

PF Limit Increase : పీఎఫ్ లిమిట్ రూ.25 వేలకు పెంపు..ఉద్యోగులకందరికీ నిజంగా శుభవార్తేనా?

Related Articles

Back to top button