Just TechnologyLatest News

Meta Layoffs : 16 వేల మంది ఇంటికే..ఉద్యోగులకు మెటా బిగ్ షాక్

Meta Layoffs : టెక్ కంపెనీల్లో లే ఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. చాలా కంపెనీలు పోటాపోటీగా ఏఐ సామర్థ్యం పెంచుకోవడంపై దృష్టి పెట్టి అదే స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి

Meta Layoffs

టెక్ కంపెనీల్లో లే ఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. చాలా కంపెనీలు పోటాపోటీగా ఏఐ సామర్థ్యం పెంచుకోవడంపై దృష్టి పెట్టి అదే స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గూగుల్ , అమెజాన్ వంచి దిగ్గజ కంపెనీలు లే ఆఫ్స్ ఇస్తున్నాయి. 2026లో ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు దాదాపు 73 వేల మందికి పైగా ఇంటికి పంపించాయి. ఈ జాబితాలో టెక్ దిగ్గజం మెటా కూడా చేరింది.

నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడం , ఏఐ రంగంలో అగ్రస్థానం సాధించాలనే లక్ష్యంతో మెటా సంస్థ 16 వేల మందికి ఉద్వాసన పలకనుంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం మెటా లే ఆఫ్స్(Meta Layoffs) ప్రక్రియ వచ్చే నెల నుంచే మొదలుకానుంది.

దాదాపు 16 వేల మందిని తొలగించడమంటే అది గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో 10 శాతానికి సమానంగా చెబుతున్నారు. మెటా తొలగింపుల్లో (Meta Layoffs) భాగంగా మొదటి దశలో సుమారు 8 వేల మందిని ఇంటికి పంపించనున్నారు. ఈ ఏడాది చివరికి 16 వేల మందిని తొలగించాలని కంపెనీ నిర్ణయించుకుంది. గతంలోనూ మెటా భారీ ఎత్తున తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. 2022-23 మధ్య కాలంలో మెటా 21,000 మందిని తొలగించింది.

Meta Layoffs
Meta Layoffs

ఇదిలా ఉంటే ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ, పెట్టుబడుల విషయంలో మాత్రం మెటా ముందంజలోనే ఉంది. ఈ ఏడాది ఏఐ విస్తరణ కోసం సుమారు 11 లక్షల కోట్లు కేటాయించింది. జనరేటివ్ ఏఐ టూల్స్, భారీ డేటా సెంటర్ల నిర్మాణం, అధునాతన చిప్ లు,
మెషీన్ లెర్నింగ్ సిస్టమ్స్ వంటి వాటిపై ఈ నిధులను వెచ్చించనుంది.

కాగా గత రెండేళ్లుగా టెక్ కంపెనీలు పూర్తి ఏఐ ఆధారిత సామర్థ్యంపైనే ఫోకస్ పెట్టాయి.అదే సమయంలో ఏఐ నైపుణ్యం తెలిసిన నిపుణులు దొరక్కపోవడం కూడా కంపెనీలకు తలనొప్పిగా మారింది. అందుకే ఏఐ స్పెషలిస్టులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కొందరు ఏఐ కోర్సులు నేర్చుకుని ట్రెయినీలుగా జాబ్ చేస్తున్నా స్కిల్స్ విషయంలో కంపెనీలు ఆశించిన మేర వారు లేరని చెబుతున్నారు.

ఇక ప్రస్తుతం మెటా తన ఇంటర్నల్ టీమ్స్ ను ఏఐ ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్చుకుంటోంది. సాధారణ కోడింగ్ చేసే ఇంజనీర్లను పక్కన పెట్టి, క్లిష్టమైన పనులను నిర్వహించే ఏఐలతోనే ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.

Akshaya Tritiya:అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలా? అమ్మవారికి ఇష్టమైన పనులు ఇవే..

Related Articles

Back to top button