Phone Settings : ఏకాంత క్షణాల్లో ఈ సెట్టింగ్స్ ఆఫ్ చేస్తున్నారా? ..టెక్ నిపుణుల హాట్ వార్నింగ్
Phone Settings : ఫోన్ స్క్రీన్ టచ్ చేయకుండా కేవలం వాయిస్ కమాండ్‌తో పలికే గూగుల్ అసిస్టెంట్, సిరి లాంటి వాయిస్ ఫీచర్లు మన మాటలను కంటిన్యూగా వింటుంటాయి.
Phone Settings
మార్నింగ్ కళ్లు తెరిచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు మన లైఫ్ అంతా మొబైల్‌తోనే ముడిపడి ఉంటోంది. చాటింగ్, షాపింగ్, బ్యాంకింగ్, ఫోటోలు ఇలా ప్రతిదానికీ మొబైల్ స్క్రీన్‌పై డిపెండ్ అయిపోతున్నాం. అయితే, మనకు తెలీకుండానే జేబులో ఉండే ఫోన్ మన పర్సనల్ లైఫ్‌ను ట్రాక్ చేస్తూ పెద్ద ముప్పుగా మారుతోందన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నామని అంటున్నారు టెక్ నిపుణులు.
ముఖ్యంగా మీ పార్టనర్‌తో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఫోన్ లోని కొన్ని డేంజర్ సెట్టింగ్స్ ఆన్‌లో ఉంటే మీ ప్రైవసీ పూర్తిగా ప్రమాదంలో పడినట్లే అవుతుంది. అందుకే వెంటనే మీ ప్రైవేట్ విషయాలు లీక్ కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్నారు టెక్ నిపుణులు.
ఫోన్ స్క్రీన్ టచ్ చేయకుండా కేవలం వాయిస్ కమాండ్‌తో పలికే గూగుల్ అసిస్టెంట్, సిరి లాంటి వాయిస్ ఫీచర్లు మన మాటలను కంటిన్యూగా వింటుంటాయి. ఇవి మనం ఎప్పుడూ పిలిచినా పలకడానికి వీలుగా బ్యాక్‌గ్రౌండ్‌లో మైక్రోఫోన్‌ను 24 గంటలూ యాక్టివ్గానే ఉంచుతాయి. అంటే మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు మాట్లాడుకునే ప్రతి మాటను కూడా అవి రికార్డ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే ప్రైవసీ చాలా ముఖ్యం అనుకున్నవారు.. ఈ వాయిస్ అసిస్టెంట్లను వెంటనే డిసేబుల్ చేసుకోవాలి. దీనివల్ల ప్రైవసీకి భంగం కలగకుండా ఉండటంతో పాటు ఫోన్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది.
చాలా మొబైల్ యాప్స్‌కు మైక్రోఫోన్, కెమెరా యాక్సెస్ అసలు అవసరమే ఉండదు. అయినా అవి పర్మిషన్లు అడిగి మరీ మనపై నిఘా పెడుతుంటాయి. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి వెంటనే ఫోన్ సెట్టింగ్స్‌లోని(Phone Settings) పర్మిషన్ మేనేజర్ విభాగంలోకి వెళ్లి చెక్ చేయండి. ఏ ఏ యాప్స్‌కు మీ కెమెరాను, మైక్ పర్మిషన్ ఇచ్చామో చూసి, అవసరం లేని థర్డ్ పార్టీ యాప్స్ పర్మిషన్లన్నిటినీ వెంటనే ఆఫ్ చేసేయండి.
అలాగే మీరు ఎక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని కూడా లొకేషన్ ట్రాకింగ్ యాప్స్ కనిపెడుతుంటాయి. అందుకే లొకేషన్ ఆప్షన్లో ఎప్పుడూ ఆన్‌లో ఉండే మోడ్ కాకుండా యాప్ వాడుతున్నప్పుడు మాత్రమే లొకేషన్ ట్రాక్ చేయడానికి అనుమతించేలా సెట్టింగ్స్(Phone Settings) మార్చుకోవాలి.

ఇక మీ పర్సనల్ ఫోటోల సేఫ్టీ విషయానికి వస్తే, ఏదైనా యాప్‌లో ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు మొత్తం గ్యాలరీ యాక్సెస్‌ను ఇవ్వకుండా కేవలం సెలెక్టెడ్ ఫోటోస్ అనే ఆప్షన్ మాత్రమే ఎంచుకోవాలి. దీనివల్ల మీ ప్రైవేట్ ఫోటోలన్నీ సేఫ్‌గా ఉంటాయి. దీంతో పాటు ఉపయోగంలో లేనప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ మీ డేటాను షేర్ చేసే అనవసరమైన యాప్స్ ఉంటే వాటిని పూర్తిగా డిలీట్ లేదా డిసేబుల్ చేయడం చాలా ఇంపార్టెంట్.
ముఖ్యంగా హోటళ్లు, రైల్వే స్టేషన్లు లేదా ఇతర పబ్లిక్ ప్లేసులలో దొరికే ఉచిత వైఫై (Free Wi-Fi)కు కనెక్ట్ అవ్వకూడదు. ఇలాంటి ఓపెన్ నెట్‌వర్క్‌ల ద్వారా మీ ఫోన్‌ను హ్యాక్ చేసి దానిలో ఉన్న మీ పర్సనల్ డేటాను, ప్రయివేట్ క్షణాల ఇన్ఫోను చోరీ చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.అందుకే బయటకు వెళ్లినపుడు ఎంత అవసరమైనా మీ సొంత మొబైల్ డేటానే వాడుకోవాలి కానీ ఫ్రీ వైఫైలు వాడొద్దు. మీ డిజిటల్ భద్రత మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఫోన్ సెట్టింగ్స్ మార్చుకోవాలి.
Rashi Phalalu : ఈరోజు గ్రహాల అనుకూలత ఎవరికి కలిసొస్తుంది?..ఎవరికి ఇబ్బందులు పొంచి ఉన్నాయి?





