Just TelanganaLatest News

Formula E race case:ఫార్ములా ఈ రేస్ కేసు..కేటీఆర్‌పై ఏసీబీ ఫైనల్ రిపోర్ట్‌లో సంచలన అభియోగాలు

Formula E race case: కేటీఆర్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని సొంత నిర్ణయాలు తీసుకున్నారని, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ పద్ధతుల్లో అనుమతులు ఇచ్చారని ఏసీబీ పేర్కొంది.

Formula E race case

తెలంగాణలో ఫార్ములా ఈ రేస్ (Formula E race case)నిర్వహణకు సంబంధించి నమోదైన కేసులో, అవినీతి నిరోధక శాఖ (ACB) తన తుది నివేదికను (Final Report) సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి సమర్పించింది. తాజాగా ఈ రిపోర్ట్‌లోని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏసీబీ ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌తో సహా పలువురిపై తీవ్రమైన అభియోగాలను మోపింది.

ఏసీబీ తుది నివేదికలోని కీలక అభియోగాలు..ఈ వ్యవహారంలో ఏసీబీ పలువురిని నిందితులుగా పేర్కొంది.

నిందితుల వివరాలు..ఏ1: కేటీఆర్ (మాజీ మంత్రి),ఏ2: అరవింద్ కుమార్ (ఐఏఎస్ అధికారి),ఏ3: బీఎల్ఎన్ రెడ్డి, ఏ4, ఏ5: ఎఫ్ఈవో (Formula E Organization) ప్రతినిధులు

కేటీఆర్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని సొంత నిర్ణయాలు తీసుకున్నారని, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ పద్ధతుల్లో అనుమతులు ఇచ్చారని ఏసీబీ పేర్కొంది. అంతేకాకుండా, ఆయన దీని ద్వారా లాభం పొందారని , రాజకీయ లబ్ధి కోసం ఈ వ్యవహారాన్ని వినియోగించుకున్నారని ఏసీబీ అభియోగాలు మోపింది.

Formula E race case (2)
Formula E race case (2)

ప్రభుత్వ అనుమతులు లేకుండానే, ప్రైవేట్ డిస్కషన్లతో ఈ రేస్‌(Formula E race case)ను నిర్వహించారని ఏసీబీ నివేదికలో స్పష్టం చేసింది. కాంపిటీటివ్ అథారిటీ అనుమతి కూడా తీసుకోకుండానే ఐఏఎస్ అరవింద్ కుమార్ కాంట్రాక్ట్‌లను ఎగ్జిక్యూట్ చేశారని ఏసీబీ తెలిపింది.

రాజ్యాంగంలోని నిబంధనలను ఉల్లంఘించారని ఏసీబీ ఆరోపించింది. గవర్నర్ సంతకంతో ఎగ్జిక్యూట్ చేయాల్సిన కాంట్రాక్ట్‌లు రెండు, గవర్నర్ నోటీసులో లేవని ఏసీబీ తేల్చింది.

రూ. 10 కోట్ల కంటే ఎక్కువ నిధులు చెల్లించాల్సి వస్తే ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ, ఈ నిబంధనను అతిక్రమించారని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. అప్పటి సీఎస్ , అప్పటి ఆర్థిక శాఖ మంత్రికి సైతం ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నారు.

హెచ్‌ఎండీఏ (HMDA) ప్రమోటర్‌గా ఉండేందుకు ఆ సంస్థ యొక్క నిధులను ఉపయోగించారని కూడా ఏసీబీ అధికారులు రిపోర్టులో ప్రస్తావించారు.

Formula E race case (2)
Formula E race case (2)

ఈ కేసులో అత్యంత సంచలనాత్మక అంశం క్విడ్ ప్రో కో (Quid Pro Quo) ఆరోపణలు.. బీఆర్‌ఎస్ పార్టీకి 44 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ చెల్లించినట్లు ఏసీబీ అధికారులు రిపోర్టులో ప్రస్తావించారు.

ఏసీబీ అధికారులు గుర్తించిన దాని ప్రకారం, ట్రై పార్టీ అగ్రిమెంట్‌కు ముందే ఈ ఎలక్టోరల్ బాండ్స్ చెల్లించినట్లు తేలింది. ఈ చెల్లింపులు అనుమతులు ఇవ్వడానికి ప్రతిఫలంగా జరిగాయని ఏసీబీ అనుమానిస్తోంది.

ఏసీబీ సమర్పించిన ఈ తుది నివేదిక ఆధారంగా, ప్రభుత్వం తదుపరి ప్రాసిక్యూషన్ అనుమతులు ఇవ్వడం, ఈ కేసులో కీలకంగా మారనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button