Just TelanganaJust EntertainmentLatest News

Ticket Pricing : ఇకపై 5 షోలు, చిన్న సినిమాలకు భారీ ఆఫర్..మల్టీప్లెక్స్ నుంచి సింగిల్ స్క్రీన్ల వరకు రేట్స్ ఫిక్స్

Ticket Pricing : సింగిల్ స్క్రీన్స్ నుంచి హై-ఎండ్ మల్టీప్లెక్స్‌ల వరకు ఎక్కడా, ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా లేకుండా తెలంగాణ గవర్నమెంట్ మినిమమ్, మ్యాక్సిమమ్ రేట్లను లాక్ చేసేసింది.

Ticket Pricing

మూవీ లవర్స్‌కు, టాలీవుడ్ ఇండస్ట్రీకి రేవంత్ సర్కార్ మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ ఇచ్చింది. స్పెషల్ షో పేరుతో ఎప్పటికప్పుడు ఆకాశాన్ని తాకుతున్న సినిమా టికెట్ల రేట్లకు చెక్ పెట్టేలా, థియేటర్ల రన్ అండ్ టికెట్ ప్రైసింగ్‌పై క్లియర్ కట్ జీఓ జారీ చేసింది.

సింగిల్ స్క్రీన్స్ నుంచి హై-ఎండ్ మల్టీప్లెక్స్‌ల వరకు ఎక్కడా, ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా లేకుండా మినిమమ్, మ్యాక్సిమమ్ రేట్లను లాక్ చేసేసింది. కేవలం ధరలు మాత్రమే కాకుండా రోజుకి 5 షోలు వేసుకునే అవకాశమివ్వడం, ప్రైమ్ టైమ్‌లో చిన్న మూవీలకు స్పెషల్ ప్రయారిటీ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది.

తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్ చేసిన కొత్త టికెట్ ప్రైస్ చార్ట్ చూస్తే.. నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ మినిమమ్ రూ.30 కాగా మ్యాక్సిమమ్ రూ.70గా ఫిక్స్ అయింది. నాన్ ఏసీ ప్రీమియంలో రూ.50 నుంచి రూ.100 వరకు ఉంటుంది. ఇక ఏసీ థియేటర్ల విషయానికి కనుక వస్తే నాన్ ప్రీమియంలో రూ.50 నుంచి రూ.150, అదే ప్రీమియంలో అయితే మాత్రం రూ.100 నుంచి రూ.200 వరకు ఛార్జ్ చేయొచ్చు.

Ticket Pricing
Ticket Pricing

స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియం మినిమమ్ రూ.100 నుంచి మ్యాక్సిమమ్ రూ.250, రెక్లైనర్ సీట్లకు రూ.200 నుంచి రూ.300 వరకు ఉంది. మల్టీప్లెక్స్‌లలో రెగ్యులర్ సీట్ ధర రూ.100 నుంచి రూ.250 ఉండగా, లగ్జరీ రెక్లైనర్‌లకు రూ.200 నుంచి రూ.300 గా తెలంగాణ గవర్నమెంట్ లిమిట్ విధించింది.

ఇక షోల టైమింగ్స్‌లోనూ కీలక మార్పులు చేశారు. ఉదయం 8 గంటల నుంచి అర్థరాత్రి 1 గంట మధ్యలో రోజూ 5 షోలు వేసుకోవడానికి తెలంగాణ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. అయితే ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ప్రైమ్ స్లాట్‌లో చిన్న సినిమాలకు కంపల్సరీగా థియేటర్లు కేటాయించాలని ఆదేశించింది. అంతేకాదు ఈ కండీషన్ పండుగ సీజన్లలో కూడా అమలు చేయాలని చెప్పడం విశేషం.

Samantha : బేబీ బంప్‌తో సమంత క్యూట్ పిక్స్ ..కౌంట్‌డౌన్ స్టార్ట్ అంటూ క్రేజీ కామెంట్..

Related Articles

Back to top button