Just TelanganaLatest News

TG Employees : వారానికి 2 రోజలు సెలవు కావాలి.. తెలంగాణ సర్కార్‌ ముందుకు జేఏసీ ప్రపోజల్

TG Employees : తెలంగాణ గవర్నమెంట్ ఆఫీసుల్లో వారానికి 5 రోజుల వర్కింగ్ విధానాన్ని అమలు చేయాలని జేఏసీ సీఎస్ సంజయ్ జాజును కోరింది.

TG Employees

తెలంగాణలోని గవర్నమెంట్ ఉద్యోగులకు త్వరలోనే తీపి కబురు అందే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ శాఖలలో ప్రజెంట్ నడుస్తున్న విధానంలోనే, తెలంగాణ గవర్నమెంట్ ఆఫీసులలోనూ కేవలం 5 రోజులు మాత్రమే పనిదినాలు ఉండేలా మార్పులు చేయాలని ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేస్తోంది.

దీనిపై తెలంగాణ ఉద్యోగులు(TG Employees), గెజిటెడ్‌ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు , పెన్షనర్ల ఉమ్మడి జేఏసీ ఛైర్మన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు తదితరులు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజును కలిసి ఈ ప్రతిపాదనలతో కూడిన తమ వినతిపత్రాన్ని సమర్పించారు.

ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రూల్స్ ప్రకారం ఆఫీసు టైమింగ్స్ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడుస్తున్నాయి. అయితే కొత్త ప్రపోజల్ ప్రకారం డ్యూటీ టైమింగ్స్‌ను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పొడిగిస్తే.. ప్రతిరోజూ ఏడున్నర గంటల వర్కింగ్ హవర్స్ అందుబాటులోకి వస్తాయని జేఏసీ తెలిపింది. రెండో శనివారం సాధారణ సెలవును కూడా పరిగణనలోకి తీసుకుంటే వీక్‌కి పక్కాగా 37.5 గంటల టార్గెట్ పూర్తవుతుందని క్లియర్‌గా వివరించారు. దీనివల్ల ఎంప్లాయిస్ శ్రమ తగ్గడమే కాకుండా, వర్క్‌లో పారదర్శకత, వేగం కూడా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.

రానున్న రోజుల్లో ఎల్‌నినో ఎఫెక్ట్ కారణంగా తీవ్రమైన నీటి కొరత, విద్యుత్, ఇంధన సంక్షోభం ఎదురయ్యే ముప్పుందని జేఏసీ తమ వినతిపత్రంలో హెచ్చరించింది. వీక్‌కి ఐదు రోజుల విధానం అమల్లోకి వస్తే గవర్నమెంట్ ఆఫీస్‌లో ఎలక్ట్రిక్ లైటింగ్ ,కరెంటు, వాటర్ వినియోగం భారీగా తగ్గుతుందని వివరించింది.

అంతేకాకుండా సెక్రటేరియట్, ఇతర డిపార్ట్‌మెంట్లకు వచ్చే వెహికల్స్ రాకపోకలు తగ్గి ప్యూయల్ పొదుపు అవ్వడంతో పాటు హైదరాబాద్ వంటి సిటీల్లో ఎయిర్ పొల్యూషన్‌కు కూడా అడ్డుకట్ట వేయొచ్చని స్పష్టం చేశారు. ఉద్యోగులకు(TG Employees) వరుసగా 2 రోజుల రెస్ట్ దొరకడం వల్ల వర్క్ ప్రెజర్ నుంచి రిలీఫ్ లభించి మరింత సామర్థ్యంతో పనిచేస్తారని, దీనివల్ల గవర్నమెంట్ ఖజానాపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడదని జేఏసీ సీఎస్‌కు వివరించింది. ఈ విషయమై వెంటనే సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి త్వరితగతిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

Passive Resistance : చెప్పినవన్నీ చేస్తామంటారు..కానీ నచ్చిందే చేస్తారు.. మీరూ అదే టైపా?

Related Articles

Back to top button