Just LifestyleLatest News

egg:గుడ్డుతో వీటిని కలిపి తినొద్దు..ఆరోగ్య నిపుణుల హెచ్చరిక

egg:గుడ్డులో శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే చాలా మంది తమ రోజువారీ ఆహారంలో గుడ్డు తప్పక ఉండేలా చూసుకుంటారు.

egg:గుడ్డులో శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే చాలా మంది తమ రోజువారీ ఆహారంలో గుడ్డు తప్పక ఉండేలా చూసుకుంటారు. మరికొందరైతే ప్రతి వంటకంలో గుడ్డును చేర్చుకుని తింటుంటారు. అయితే ఇలా తినే వారు డేంజర్‌లో పడినట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

egg:

కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిసి గుడ్డును తీసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు. మరి గుడ్డుతో పాటు తినకూడని ఆ ఆహారపదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దామా..

1. చేపలు: గుడ్లను, చేపలను కలిపి తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా ఉడకబెట్టిన గుడ్లతో చేపలను తినకూడదు. దీని వల్ల చర్మ అలెర్జీలు (స్కిన్ అలర్జీలు) వచ్చే అవకాశాలు ఉంటాయి.

2. జున్ను: సాధారణంగా గుడ్డు, జున్నులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అలాగని ఈ రెండిటినీ ఒకేసారి కలిపి తినవద్దు. ప్రోటీన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఈ రెండిటినీ కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

3. అరటిపండ్లు: అరటిపండ్లను గుడ్లతో లేదా గుడ్లు తిన్న తరువాత ఎప్పుడూ తినకూడదు. ఒకవేళ తింటే మలబద్ధకం, గ్యాస్, ప్రేగు సంబంధిత సమస్యలు వస్తాయి.

4. నిమ్మకాయ: కొంతమంది ఉడకబెట్టిన గుడ్లపై లేదా ఆమ్లెట్‌లపై నిమ్మరసం, ఉల్లిపాయలు వేసుకుని తింటూ ఉంటారు. అయితే గుడ్లతో నిమ్మకాయను తింటే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల గుండెపోటులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని అంటున్నారు.

5. చక్కెర: గుడ్లను చక్కెరతో కలిపి తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. చక్కెర, గుడ్ల నుంచి వెలువడే అమైనో ఆమ్లాలు మన శరీరానికి విషపూరితమైనవిగా మారతాయి. ఇవి మన శరీరంలో రక్తం గడ్డకట్టేలా చేస్తాయి. కాబట్టి గుడ్లతో చేసిన తీపి ఫ్రెంచ్ టోస్ట్‌ను తినడం ఇష్టమైతే ఆ అలవాటును వెంటనే మానుకోవడం మంచిది.

6. టీ: ఉదయం పూట చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది. పనిలో పనిగా టీతో పాటుగా బ్రేక్ ఫాస్ట్ కూడా అయిపోతుందన్న ఉద్దేశంతో గుడ్లను తీసుకుంటారు. అయితే ఇలా తీసుకోవద్దని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button