Just TelanganaLatest News

Konda Surekha: అప్పుడు తిట్టి.. ఇప్పుడు సారీ.. హాట్ టాపిక్ గా కొండా సురేఖ ట్వీట్

Konda Surekha: మరోవైపు కొండా సురేఖ ట్వీట్ వెనుక వెనుక కచ్చితంగా సీఎం ఆఫీస్ జోక్యం ఉండి ఉంటుందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

Konda Surekha

మంత్రి కొండా సురేఖ (Konda Surekha)మరోసారి సారీ చెప్పారు. ఈసారి ఏకంగా హీరో నాగార్జునని క్షమించమని వేడుకున్నారు. పరువు నష్టం దావా కేసు ఫైనల్ స్టేజ్ కి చేరుకోవడంతో…. ఆ కేసులో ఓటమి తప్పదని తెలిసి… నాగార్జున కాళ్లు పట్టుకున్నారు. కొండా సురేఖ సారీ చెప్పడం కొత్త ఏమి కాదు.నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం ఏ మాట పడితే ఆ మాట మాట్లాడటం ఆ తర్వాత ఎదురు దెబ్బలు తగిలితే వెంటనే కాళ్ళు పట్టుకోవడం కొండా సురేఖ కి అలవాటైపోయింది. కొండా సురేఖ గతంలో సమంత.

కేటీఆర్ ల గురించి మాట్లాడుతూ… నాగార్జున కుటుంబం పై కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.అది అప్పట్లో పెను సంచలనం సృష్టించాయి . కేటీఆర్.. మహిళా మంత్రులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా.. కొండా సురేఖ సీరియస్ గానే కామెంట్స్ చేశారు.

గతంలోనే సినిమా ఇండస్ట్రీ పెద్దలు అంతా కొండా సురేఖ(Konda Surekha) చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు నాగార్జున నాంపల్లి కోర్టులో క్రిమినల్ డెఫినేషన్ పిటిషన్ వేశారు. ఆధారాలతో సహా కొండా సురేఖ మాటలను కోర్టు ముందు ఉంచారు.

Konda Surekha
Konda Surekha

ఈ పరువు నష్టం కేసులో ఓటమి తప్పదని కొండా సురేఖ తెలిసింది. అయితే ఈ వివాదం రేగినప్పుడే కాంగ్రెస్ హైకమాండ్ కూడా.. సీరియస్ గా రియాక్ట్ కావడం తో… అప్పట్లో ఒకసారి నాగార్జున కుటుంబానికి… కొండ సురేఖ క్షమాపణ చెప్పారు. సాటి మహిళ సమంత ను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని మనసు నోచుకుని ఉంటే క్షమాపణ చెప్పడం తో పాటు..తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.

మరోవైపు కొండా సురేఖ ట్వీట్ వెనుక వెనుక కచ్చితంగా సీఎం ఆఫీస్ జోక్యం ఉండి ఉంటుందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. పరువు నష్టం కేసులో ఓటమి తప్పదనే భయంతో మంత్రి కొండా సురేఖ ఇలాంటి ట్వీట్ చేశారని టాక్. కేసు ట్రయల్ లో ఉండగా.. ఇలాంటి దిద్దుబాటు చర్యలు అందులో భాగమే . అయితే ఇప్పటి వరకూ నాగార్జున నుండి రియాక్షన్ రాలేదు.

నిజానికి నోరు జారి వివాదాల్లో చిక్కుకోవడం కొండా సురేఖకు కొత్తేమీ కాదు. వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో ఇప్పటికే పలుమార్లు ఇలాంటి పరిస్థితే వచ్చింది.. ఇటీవల కొండా సురేఖ ఓ ఎస్ డి ఒక సిమెంట్ కంపెనీ ప్రతినిధులను తుపాకీతో బెదిరించిన వివాదంలో సురేఖ కూతురు ఏకంగా ముఖ్యమంత్రి ఏకంగా రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.

ఆ వివాదం రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనం సృష్టించింది. ఇదంతా హై హాయ్ కమాండ్ దృష్టికి వెళ్లి సురేఖకు చివాట్లు పడ్డంతో…. మీడియా ముఖంగా సీఎంకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు నాగార్జునకు కూడా సారీ చెప్పారు. దీంతో అప్పుడు తిట్టడం ఎందుకు.. ఇప్పుడు సారీ చెప్పడం ఎందుకు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

Trump: ట్రంప్ మనసు మారిందా? అమెరికన్ ఎకానమీకి విదేశీ టాలెంట్ అత్యవసరమని తెలుసుకున్నారా?

Related Articles

Back to top button