TVK Vijay : నటుడు విజయ్ కు బిగ్ షాక్..విడాకులు కోరిన భార్య సంగీత
TVK Vijay : విజయ్ నుంచి విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.చెన్నై సిటీలోని చెంగల్ పట్టు ఫ్యామిలీ కోర్టులో ఆమె విడాకుల పిటిషన్ వేశారు.
TVK Vijay
పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తమిళ హీరో విజయ్(TVK Vijay) ను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది టీవీకే పార్టీ మీటింగ్ తొక్కిసలాట ఘటన దగ్గర నుంచీ విజయ్ కు ఏదీ కలిసిరావడం లేదు. తన చివరి సినిమా కూడా విడుదలకు నోచుకోలేని పరిస్థితి.. ఇప్పుడు పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టిన విజయ్ ను ఇప్పుడు అతని భార్య సంగీత కోర్టుకు లాగింది.
విజయ్ నుంచి విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.చెన్నై సిటీలోని చెంగల్ పట్టు ఫ్యామిలీ కోర్టులో ఆమె విడాకుల పిటిషన్ వేశారు. పిటీషన్ ను స్వీకరించిన కోర్టు.. ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాలని విజయ్(TVK Vijay) కు నోటీసులు పంపించింది. కొన్నాళ్లుగా వీళ్లిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విడాకులు తీసుకోబోతున్నట్టు కూడా ప్రచారం జరిగింది.
దీనిపై విజయ్ ఇప్పటి వరకూ స్పందించలేదు. నటుడిగా నిలదొక్కుకున్న ఆరంభంలోనే 1999లో విజయ్, సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే 2021 నుంచీ విజయ్ , సంగీతకు మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఓ నటితో విజయ్ సన్నిహితంగా ఉండడంతోనే గొడవలు మొదలైనట్టు తెలుస్తోంది. తాజాగా సంగీత దాఖలు చేసిన పిటిషన్ లో సైతం ఆ నటితో వివాహేతర సంబంధం కారణంగానే విడాకులు కోరుతున్నట్టు పేర్కొన్నారు.
ఈ క్రమంలో పలు సంచలన ఆరోపణలు కూడా చేశారు. ఆ నటితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ తనను దూరం పెట్టారని విడాకుల పిటీషన్ లో పేర్కొన్నారు. అది ప్రశ్నించినందుకు తనను మానసికంగా వేధిస్తూ మాటలతో అవమానించారని ఆరోపించారు. అలాగే ఆర్థికపరిమిత ఆంక్షలు విధిస్తూ తీవ్రంగా వేధించారని సంగీత తన పిటిషన్ లో పేర్కొనడం సంచలనంగా మారింది.

అంతేకాకుండా సదరు నటితో విజయ్ కు ఉన్న వివాహేతర సంబంధం ఆధారాలు తన దగ్గరున్నాయని, న్యాయస్థానానికి అందజేస్తానని తెలిపారు. ఇటీవల తమిళనాడు బీజేపీ నేత నాగేంద్రన్ విజయ్ ను ఉద్దేశిస్తూ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ అయ్యాయి. విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు ఆరోపిస్తున్న ఆమె నటి త్రిషనే కావొచ్చని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా తమిళ వెట్రిగల్ కజగం పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన విజయ్ ప్రస్తుతం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాలకు కూడా వీడ్కోలు పలికారు. విజయ్ చేసిన చివరి సినిమా జన నాయగన్ కూడా సెన్సార్ వివాదాలతో విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్ కు ఈ విడాకుల వ్యవహారం, వివాహేతర సంబంధం అంశం తలనొప్పిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.



