Weight: చలికాలంలో బరువు పెరుగుతున్నారా? అయితే ఈ చిట్కాలతో వెయిట్ తగ్గండి
Weight: రోజుకు కనీసం ఒక కప్పు వేడి సూప్ తాగడం వల్ల కడుపు నిండి, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనే కోరిక తగ్గుతుంది.
Weight
ప్రస్తుతం కొనసాగుతున్న చలికాలం (Winter Season) ప్రతి ఒక్కరినీ గజగజ వణికిస్తోంది. ఈ కాలంలో ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండటం, వేడి వేడిగా ఏదైనా తినాలనే కోరిక పెరగడం, ఎక్సర్‌సైజులకు దూరంగా ఉండటం వల్ల చాలామంది బరువు(gain weight) పెరుగుతారు. చలిని తట్టుకోవడానికి శరీరం కొవ్వును నిల్వ చేసుకునే ధోరణి కూడా దీనికి ఒక కారణం. అయితే, కొన్ని సులభమైన జీవనశైలి చిట్కాలను పాటిస్తే, ఈ వింటర్ సీజన్‌లో కూడా బరువు(Weight)ను నియంత్రణలో ఉంచుకోవచ్చు, పైగా ఆరోగ్యంగానూ ఉండవచ్చు.
ఉదయం వేళ అద్భుత పానీయం- జీరా,వాము మిశ్రమం.. చలికాలంలో బరువు(Weight) తగ్గడానికి, జీర్ణక్రియ (Digestion)ను మెరుగుపరచడానికి వైద్యులు సూచించే ఒక దివ్య ఔషధం ఉంది. అదే జీలకర్ర (Jeera) , వాము (Ajwain) కలిపిన నీరు. వారానికి కనీసం మూడు నుంచి నాలుగు రోజులు ఉదయం ఖాళీ కడుపుతో ఈ మిశ్రమాన్ని తీసుకోవడం చాలా మంచిది. జీలకర్ర జీవక్రియ రేటును (Metabolic Rate) పెంచుతుంది, వాము పేగుల్లోని వాయువును తగ్గించి, గ్యాస్ సమస్యలను నివారిస్తుంది. ఈ రెండిటినీ నీటిలో మరిగించి, గోరువెచ్చగా వడగట్టి తాగడం వల్ల శరీరం లోపల వేడి పుట్టి, కొవ్వు కరగడానికి సహకరిస్తుంది.
శక్తినిచ్చే సంప్రదాయ ఆహారం- తృణధాన్యాలు.. చలికాలంలో మన ఆహారంలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. ఈ సీజన్‌లో గోధుమలు, మైదా వంటి వాటి కంటే జొన్నలు (Jowar), రాగులు (Ragi) వంటి తృణధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. జొన్నలతో చేసిన రొట్టెలు, ఉప్మా, అంబలి లేదా దోశలు వంటివి తినడం వల్ల శరీరానికి అధిక మొత్తంలో ఫైబర్ (Fiber) లభిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. తద్వారా అతిగా తినడం తగ్గుతుంది. అంతేకాకుండా, జొన్నలు మన శరీరానికి అవసరమైన శక్తిని (Energy) నిదానంగా విడుదల చేస్తాయి, ఇది చలికాలంలో చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది.

శరీర ఉష్ణోగ్రత పెంచే డ్రై ఫ్రూట్స్ (Dry Fruits).. చలికాలంలో క్యాలరీలు (Calories) ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలనిపిస్తుంది. అటువంటి సమయంలో అనవసరమైన స్నాక్స్‌కు బదులుగా డ్రై ఫ్రూట్స్ (Dry Fruits)ను తీసుకోవడం చాలా మంచిది. బాదం, వాల్‌నట్స్, ఎండు ఖర్జూరం వంటివి తీసుకోవడం ద్వారా మెటబాలిక్ రేటు దాదాపు 10% వరకు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ముఖ్యంగా విటమిన్-ఈ (Vitamin E), శరీరానికి పోషణ ఇవ్వడంతో పాటు, బరువును నియంత్రణలో ఉంచుతాయి. ఇవి చలిని తట్టుకునే శక్తిని కూడా ఇస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు (Soups).. చలికాలం అంటే జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే కాలం. బరువు నియంత్రణతో పాటు, రోగనిరోధక శక్తిని పెంచడం కూడా చాలా ముఖ్యం. అందుకోసం పాలకూర (Spinach), క్యారెట్ (Carrot) వంటి ఆకుకూరలు, కూరగాయలతో చేసిన వెజిటబుల్ సూప్‌లను (Vegetable Soups) ఎక్కువగా తాగాలి.
ఈ సూప్‌లు తక్కువ క్యాలరీలతో, అధిక పోషకాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా, వీటిలో ఉండే విటమిన్-సి (Vitamin C) శరీరానికి బాగా అంది, రోగనిరోధక శక్తిని విపరీతంగా పెంచుతుంది. రోజుకు కనీసం ఒక కప్పు వేడి సూప్ తాగడం వల్ల కడుపు నిండి, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనే కోరిక తగ్గుతుంది.
ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే, చలికాలంలోనే కాకుండా వేరే సీజన్లో కూడా మీ బరువును ఈజీగా తగ్గించుకుని..దృఢంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు.



