Rangoli: సంక్రాంతికి ముగ్గులు వేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి!
Rangoli: ఉదాహరణకు పసుపు కోసం పసుపు పొడిని,ఎరుపు కోసం కుంకుమను, ఆకుపచ్చ రంగు కోసం ఎండిన ఆకుల పొడిని ముగ్గులో కలిపి వాడొచ్చు.
Rangoli
జనవరి నెల రాగానే తెలుగువారి ఇళ్లన్నీ రంగురంగుల రంగవల్లుల(Rangoli)తో కళకళలాడుతుంటాయి. ధనుర్మాసం ముగింపునకు వస్తుండటంతో గొబ్బెమ్మలు, ముగ్గుల పోటీలు ఊపందుకుంటాయి.
అయితే ముగ్గులు(Rangoli) వేయడం అనేది కేవలం ఒక సంప్రదాయం, ఆచారం మాత్రమే కాదు, అది ఒక చక్కని కళ. ఈ పండుగ సీజన్ లో మీ ఇంటి ముందు ముగ్గులు అందంగా, స్పష్టంగా కనిపించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ముందుగా ముగ్గు వేసే ప్రదేశాన్ని శుభ్రం చేసి, ఆరబెట్టాలి. తడి ఉంటే ముగ్గు పిండి ముద్దగా మారి ముగ్గు సరిగ్గా రాదు.
ముగ్గు పిండిలో కొంచెం బియ్యం పిండిని కలిపి ముగ్గులు వేయాలి. దీనివల్ల ముగ్గు తెల్లగా, అందంగా క్లియర్‌గా కనిపిస్తుంది. అలాగే ముగ్గు వేసేటప్పుడు చుక్కల మధ్య దూరం సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మార్కెట్లో రంగురంగుల ముగ్గు పొడులు అమ్ముతున్నారు.
అయితే రసాయన రంగుల వాడటం కంటే సహజమైన రంగులు వాడటమే మంచిది. ఉదాహరణకు పసుపు కోసం పసుపు పొడిని,ఎరుపు కోసం కుంకుమను, ఆకుపచ్చ రంగు కోసం ఎండిన ఆకుల పొడిని ముగ్గులో కలిపి వాడొచ్చు.

ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టేటప్పుడు వాటిని పసుపు, కుంకుమ , పూలతో అలంకరిస్తే ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్లు ఉంటుంది.
ముగ్గులు(Rangoli) వేయడం వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయట. ముగ్గు వేయడం వల్ల మనస్సు ఏకాగ్రత పెరుగుతుంది. శరీరానికి ఒక రకమైన వ్యాయామం కూడా దొరుకుతుంది. అందుకే వీలయితే ఈ సంక్రాంతికి మీ వీధిలో లేదా అపార్ట్‌మెంట్ లో జరిగే ముగ్గుల పోటీల్లో పాల్గొనండి.
కొత్త రకం డిజైన్లు నేర్చుకోవడానికి ఇంటర్నెట్ లో దొరికే ఈజీగా ఉండే చుక్కల ముగ్గుల వీడియోలు చూడవచ్చు. మీ ఇంటి ముగ్గు పది మందిని ఆకర్షించాలంటే సంప్రదాయానికి కొంచెం ఆధునికతను కూడా అద్ది రంగులతో నింపండి. అప్పుడు మీ ముగ్గే సంక్రాంతి శోభను తెచ్చిపెడుతుంది.




One Comment