Just LifestyleHealthLatest News

Millet Dosa :ఆరోగ్యకరమే కాదు..అద్భుతమైన రుచి.. మిల్లెట్ దోశలు ఇలా ట్రై చేయండి

Millet Dosa : మిల్లెట్స్ తో చేసిన వంటలు రుచిగా ఉండవని చాలామంది వాటిని దూరం పెడతారు.

Millet Dosa

ఆరోగ్య స్పృహ పెరుగుతున్న ఈ కాలంలో అందరూ మిల్లెట్స్ (Millets) వైపు మొగ్గు చూపుతున్నారు. బియ్యం, గోధుమల కంటే చిరుధాన్యాల్లో పోషక విలువలు చాలా ఎక్కువ అని నిపుణులు చెప్పడంతో చాలామంది వాటిని తమ డైలీ మెనూలో యాడ్ చేసుకుంటున్నారు.

ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ వ్యాధి ఉన్నవారికి మిల్లెట్స్ ఒక వరం వంటివి. అయితే మిల్లెట్స్ తో చేసిన వంటలు రుచిగా ఉండవని చాలామంది వాటిని దూరం పెడతారు. కానీ వాటిని సరైన పద్ధతిలో చేస్తే ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి. కేవలం మిల్లెట్ దోశ(Millet Dosa )లే కాకుండా చిరుధాన్యాలతో ఉప్మా, పొంగల్ , కిచిడి కూడా చేసుకోవచ్చు.

Millet Dosa
Millet Dosa

ఇప్పుడు మనం రాగులు కానీ, జొన్నలతో కానీ దోశలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. సాధారణ దోశ లాగే దీనిని కూడా తయారు చేయొచ్చు. కాకపోతే బియ్యం పిండికి బదులుగా రాగి పిండి , జొన్న పిండిని కలిపి దోశెల పిండిగా చేసుకోవాలి. లేదంటే రాగులు, జొన్నలు నానబెట్టి మినప్పప్పుతో కలిపి రుబ్బుకుని దోశల పిండిగా వాడుకోవాలి.

ఈ మిల్లెట్ దోశ(Millet Dosa )లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వీటికి తోడుగా పల్లీల చట్నీ లేదా అల్లం చట్నీ కలిపి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. పిల్లలకు ఇవి పెట్టడం వల్ల వారిలో కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

బయట దొరికే జంక్ ఫుడ్ కంటే.. ఇంట్లో చేసుకునే ఇలాంటి సాంప్రదాయ వంటలు ఇంటిల్లిపాది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాత్రి పూట తేలికపాటి ఆహారం తీసుకోవాలనుకునే వారికి ఈ మిల్లెట్ వంటలు చాలా మంచివి.

మన పూర్వీకులంతా ఇలాంటి ఆహారం తినడం వల్లే ఎంతో బలంగా ఉండేవారు. అందుకే మనం కూడా తిరిగి ఆ ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాల్సిన సమయం వచ్చిందని అంతా గుర్తించాలి.

America:అమెరికాలో తెలుగు యువతి హత్య.. నిందితుడు ఎక్కడ దొరికాడంటే.. ?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button