Just SpiritualJust Lifestyle

stairs:మెట్ల కింద బీరువా లేదా పూజ గది ఉందా? వాస్తు ఏం చెబుతోంది?

stairs: మెట్ల కింద కేవలం క్లీనింగ్ వస్తువులు, చెప్పుల స్టాండ్, స్టోర్ రూమ్ లేదా ఇన్వర్టర్ వంటివి ఉంచుకోవచ్చు.

stairs

సొంతిల్లు కట్టుకునేటప్పుడు చాలా మంది స్థలాన్ని ఆదా చేయడానికి మెట్ల కింద ఉన్న ఖాళీ ప్రదేశాన్ని (Under Staircase Space) రకరకాలుగా వాడుతూ ఉంటారు.ముఖ్యంగా డూప్లెక్స్ ఇల్లు, ఇండివిడ్యువల్ ఇల్లు కట్టుకునేటప్పుడు.. కొందరు అక్కడ చిన్న పూజ గదిని నిర్మిస్తే, మరికొందరు విలువైన వస్తువులు దాచుకునే బీరువాలను కూడా పెడుతుంటారు.

కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అత్యంత ప్రమాదకరమైన దోషమని అంటున్నారు వాస్తు నిపుణులు. మెట్లు (stairs)అనేవి భారీ తనానికి , రాకపోకలకు సంకేతం. అటువంటి భారం కింద దేవుడి మందిరం, లేదా డబ్బులు ఉంచడం వల్ల ఆ ఇంట్లో ప్రతికూల ఫలితాలు వస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Stairs
Stairs

మొదటగా మెట్ల(stairs) కింద పూజ రూమ్ ఉండటం వల్ల, ఆ ఇంట్లో వాళ్లు మెట్లు ఎక్కినప్పుడల్లా దేవుడి తలపై అడుగులు వేస్తున్నట్లు అవుతుంది. ఇది ఆధ్యాత్మికంగా తీవ్ర దోషం మాత్రమే కాదు, ఆ ఇంట్లోని వ్యక్తులపై మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది.ఆ ఇంటివాళ్లు ఎంత సంపాదించినా ఇంట్లో అశాంతి రాజ్యమేలుతుందట.

ఇక మెట్ల కింద డబ్బులు దాచుకునే బీరువాలను ఉంచితే, ఆ లక్ష్మీదేవి ఎప్పుడూ ఒత్తిడిలోనే ఉంటుంది. దీనివల్ల అనవసరపు ఖర్చులు పెరగడం, అప్పుల పాలవ్వడం వంటివి జరుగుతాయి.

మెట్ల కింద కేవలం క్లీనింగ్ వస్తువులు, చెప్పుల స్టాండ్, స్టోర్ రూమ్ లేదా ఇన్వర్టర్ వంటివి ఉంచుకోవచ్చు. వీలైతే ఆ ప్రదేశంలో చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ పెంచడం వల్ల అక్కడి నెగటివ్ ఎనర్జీ తగ్గుతుందట. అలాగే మెట్ల కింద ఎప్పుడూ వెలుతురు ఉండేలా చూసుకోవడం కూడా శుభప్రదం అని వాస్తు నిపుణులు చెబుతున్నారు .

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Back to top button