Sankranthi travelers:సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ రూట్‌లో 8 ప్రత్యేక రైళ్లు.. ఫుల్ షెడ్యూల్ ఇదే
Sankranthi travelers: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
Sankranthi travelers
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెగ్యులర్ రైళ్లన్నీ వెయిటింగ్ లిస్ట్‌తో నిండిపోయాయి.దీంతో, ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి విజయవాడ , సిర్పూర్ కాగజ్ నగర్ మార్గాల్లో 8 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తాజాగా ప్రకటించింది.
ముఖ్యమైన తేదీలు , సమయాలు– ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 9, 10 , 18వ తేదీల్లో అందుబాటులో ఉంటాయి.
హైదరాబాద్ – విజయవాడ (07471).. ఈ రైలు జనవరి 9, 10 తేదీల్లో ఉదయం 6:10 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి మధ్యాహ్నం 1:40కి విజయవాడ చేరుకుంటుంది.
విజయవాడ – హైదరాబాద్ (07472).. జనవరి 9, 18 తేదీల్లో మధ్యాహ్నం 2:40 కి విజయవాడలో బయల్దేరి రాత్రి 10:35కి హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైళ్లు సికింద్రాబాద్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం వంటి కీలక స్టేషన్లలో ఆగుతాయి.

సిర్పూర్ కాగజ్ నగర్ రూట్.. హైదరాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య నడిచే రైళ్లు (07469/07470) కూడా జనవరి 9, 10, 18 తేదీల్లోనే అందుబాటులో ఉంటాయి. ఉదయం 7:55కి బయల్దేరి మధ్యాహ్నం 2:15కి గమ్యస్థానానికి చేరుకుంటాయి.
ఈ ప్రత్యేక రైళ్ల వల్ల సంక్రాంతికి చివరి నిమిషంలో టికెట్లు దొరక్క ఇబ్బంది పడే సంక్రాంతి ప్రయాణికుల(Sankranthi travelers)కు పెద్ద ఊరట లభించబోతోంది.




2 Comments