Just NationalLatest News

Linefit:ఎయిర్ ఇండియా ఫ్లీట్‌లో ఎనిమిదేళ్ల తర్వాత తొలి లైన్‌ఫిట్ విమానం..ఏంటి దీని స్పెషల్?

Linefit:సాధారణంగా విమానాలను కొన్న తర్వాత మనకు నచ్చినట్లుగా సీట్లు, ఇంటీరియర్స్ మార్చుకోవాల్సి ఉంటుంది.

Linefit

టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియా తన పూర్వ వైభవాన్ని పొందే దిశలో భాగంగా.. మరో భారీ అడుగు వేసింది. సుమారు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఎయిర్ ఇండియా తన మొట్టమొదటి లైన్‌ఫిట్ డ్రీమ్‌లైనర్ (Boeing 787-9) విమానాన్ని అందుకుంది. నిన్న అంటే జనవరి 7న అమెరికాలోని బోయింగ్ ఫ్యాక్టరీలో ..దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ పూర్తయింది. 2022లో ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ జరిగాక.. టాటా గ్రూప్ అందుకున్న తొలి వైడ్ బాడీ బోయింగ్ విమానం ఇదే కావడం విశేషం.

లైన్‌ఫిట్ (Linefit) అంటే ఏంటి? దీని ప్రత్యేకతలేంటి?..సాధారణంగా విమానాలను కొన్న తర్వాత మనకు నచ్చినట్లుగా సీట్లు, ఇంటీరియర్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. కానీ లైన్‌ఫిట్‌(Linefit)లో ఏం జరుగుతుందంటే.. విమానం తయారీ దశలోనే ఎయిర్ ఇండియా తన ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా డిజైన్, సీటింగ్ , ఇతర సదుపాయాలను బోయింగ్ సంస్థతో చేయించుకుంది.

త్రీ క్లాస్ సీటింగ్.. ఈ విమానంలో ఎకానమీ, ప్రీమియం ఎకానమీ మరియు బిజినెస్ క్లాస్ అనే మూడు విభాగాలు ఉంటాయి.
అత్యాధునిక ఇంటీరియర్స్.. ప్రయాణికులకు విమానంలోనే వినోదం అందించే కొత్త ఇన్-ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్స్, మరింత సౌకర్యవంతమైన బెర్త్ లాంటి సీట్లు ఇందులో ఉన్నాయి.
పాత విమానాలతో పోలిస్తే ఈ డ్రీమ్‌లైనర్ 20 నుంచి 25 శాతం తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తుంది, దీనివల్ల కాలుష్యం కూడా తగ్గుతుంది.

Linefit
Linefit

 

ఈ కొత్త విమానం రాకతో ఎయిర్ ఇండియాకు వ్యాపార పరంగా , బ్రాండ్ పరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

అంతర్జాతీయ సర్వీసుల విస్తరణ.. అమెరికా, యూరోప్ వంటి దేశాలకు ప్రయాణించే వారు ఫ్లైట్ పాతగా ఉందని ఫిర్యాదు చేసేవారు. ఇప్పుడు ఈ కొత్త డ్రీమ్‌లైనర్‌తో అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించొచ్చు.
ఆదాయం పెంపు..ప్రీమియం ఎకానమీ క్లాస్ ఉండటం వల్ల, బిజినెస్ క్లాస్ అంత ఖర్చు పెట్టలేకపోయినా, సౌకర్యవంతమైన జర్నీ కోరుకునే వారి నుంచి అదనపు ఆదాయం లభిస్తుంది.
నిర్వహణ ఖర్చుల తగ్గింపు.. పాత విమానాలకు రిపేర్లు ఎక్కువ అవుతుంటాయి. కొత్త ఫ్లైట్ వల్ల మెయింటెనెన్స్ ఖర్చు తగ్గుతుంది , ఇంధనం ఆదా అవుతుంది.
అంతేకాదు ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్‌వేస్ వంటి విదేశీ ఎయిర్‌లైన్స్‌కు గట్టి పోటీ ఇచ్చేలా ఎయిర్ ఇండియా తన ఫ్లీట్‌ను ఆధునీకరిస్తోంది.

ప్రస్తుతం ఎయిర్ ఇండియా గ్రూప్ వద్ద 300కు పైగా విమానాలు ఉన్నాయి. 2026 నాటికి మరికొన్ని పాత డ్రీమ్‌లైనర్ విమానాలను కూడా కొత్త ఇంటీరియర్స్ తో మార్చాలని టాటా గ్రూప్ నిర్ణయం తీసుకుంది. ఆకాశంలో మళ్లీ మహారాజా తన రాజ్యస్థాపన చేయడానికి ఈ కొత్త విమానాల రాక.. ఎంతో కీలకం కానుంది.

Budget :చరిత్రలో రెండోసారి ఆదివారం రోజే బడ్జెట్ ప్రవేశం..మరి ఫస్ట్ బడ్జెట్ ఎప్పుడు? ఏంటా స్పెషల్?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button