Dream:మీ కలలకు మీరే బాస్..అవును మీ డ్రీమ్‌ను మీరు డిసైడ్ చేయొచ్చట..
Dream : కలలో మీ వేళ్లు వింతగా కనిపించినా, గడియారంలో సమయం మారిపోతున్నా వెంటనే అది మీకు కల అని అర్థమైపోతుంది.
Dream
మనం రకరకాల కలలు కంటుంటాం. కానీ, ఆ కలలో ఉన్నప్పుడు ..నేను ఇప్పుడు కలలో ఉన్నాననే స్పృహ మనకు ఉంటే? దానినే లూసిడ్ డ్రీమింగ్ అంటారు. అంటే మన కలకు మనమే దర్శకులం, మనమే హీరోలం అన్నమాట. కలలను మనకు నచ్చినట్టుగా మార్చుకోవడమే కాదు.. అందులో మనం గాల్లో ఎగరొచ్చు, నచ్చిన వ్యక్తులను కలవొచ్చు కూడా.
దీని వెనుక ఉన్న సైకాలజీ ఏంటనే దానిపై మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం.. మన నిద్రలో రెమ్ (Rapid Eye Movement) అనే ఒక ప్రత్యేక దశ ఉంటుంది. ఈ సమయంలోనే మన మెదడు చాలా చురుగ్గా ఉంటుందట.
సాధారణంగా మనం డ్రీమ్స్‌లో ఉన్నప్పుడు మన మెదడులోని ‘ప్రీఫ్రంటల్ కార్టెక్స్’ (తర్కానికి సంబంధించిన భాగం) నిద్రపోతుంది. కానీ లూసిడ్ డ్రీమింగ్‌లో ఈ భాగం మాత్రం మేల్కొంటుంది. దీంతో మనం కలలో ఉన్నామనే స్పృహ మనకు కలుగుతుంది. ఇది ఒక అద్భుతమైన మానసిక స్థితి అంటారు నిపుణులు.
కలలను నియంత్రించడానికి ‘రియాలిటీ చెక్ (Reality Check) అనే పద్ధతిని వాడుతుంటారు. ఉదాహరణకు, డైలీ లైఫ్‌లో మీరు రోజుకు నాలుగైదు సార్లు మీ చేతి వేళ్లను లెక్కపెట్టుకోవడం కానీ గడియారం వైపు చూడటం కానీ అలవాటు చేసుకుంటే, అదే అలవాటు కలలో కూడా వస్తుంది. కలలో మీ వేళ్లు వింతగా కనిపించినా, గడియారంలో సమయం మారిపోతున్నా వెంటనే అది మీకు కల అని అర్థమైపోతుంది. ఆ క్షణం నుంచి మీరు ఆ కలను మీకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చట.

అందుకే లూసిడ్ డ్రీమింగ్ అనేది కేవలం సరదా కోసం మాత్రమే కాదు..ఇది మెదడుకు ఒక పవర్‌ఫుల్ ట్రైనింగ్ లాంటిది అంటారు నిపుణులు.
మనో నిబ్బరం.. కలలోనే మనం కొత్త నైపుణ్యాలను ఉదాహరణకు డ్రైవింగ్ లేదా స్పీచ్ ఇవ్వడం వంటివి ప్రాక్టీస్ చేస్తే, మన మెదడులోని న్యూరాన్లు నిజంగా ప్రాక్టీస్ చేస్తున్నట్టే భావిస్తాయి. దీనివల్ల నేర్చుకునే కెపాసిటీ పెరుగుతుంది.
డేటా ఆర్గనైజేషన్.. లూసిడ్ డ్రీమింగ్ అలవాటు ఉన్నవారిలో మెటాకాగ్నిషన్ అంటే మన ఆలోచనలను మనమే గమనించడం పెరుగుతుంది. దీనివల్ల మెదడు అనవసరమైన విషయాలను తొలగించి, ముఖ్యమైన సమాచారాన్నిమాత్రమే భద్రపరుస్తుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి గణనీయంగా మెరుగుపడుతుంది.
క్రియేటివ్‌గా ఆలోచించడం, కొత్త ఆలోచనలు, క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో లూసిడ్ డ్రీమర్స్ ముందుంటారు.అయితే ఇది నేర్చుకోవడానికి కొంత సమయం, సాధన అవసరం. ప్రతిరోజూ నిద్రలేవగానే మీ కలలను ఒక డైరీలో రాసుకోవడం (Dream Journaling) మొదలుపెడితే, లూసిడ్ డ్రీమింగ్ వరల్డ్‌లోకి మీరు త్వరగా ప్రవేశించొచ్చు అంటున్నారు నిపుణులు.
Virat Kohli : విరాట్ కోహ్లీ దూకుడు..తొలి వన్డేలో భారత్ గెలుపు




2 Comments