Just InternationalJust PoliticalLatest News

Iran:ఇరాన్‌కు ట్రంప్ డెడ్లీ వార్నింగ్..వార్‌కు స్కెచ్ వేసేసినట్టేనా ?

Iran: అమెరికా దగ్గర ఉన్న విధ్వంసక ఆయుధాలు ఇరాన్ మొత్తాన్ని సర్వనాశనం చేయగలదని రక్షణ నిపుణులు భావిస్తున్నారు.

Iran

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ ల్యాండ్ పై కన్నేసిన వేళ ఇరాన్(Iran) కు కూడా వార్నింగ్ ఇచ్చారు. అతిపెద్ద నౌకాదళం ఇరాన్ దిశగా వెళుతోందని ప్రకటించారు. ఏమీ జరగకూడదనే కోరుకుంటున్నా అంటూనే ఇలా హెచ్చరించడం హాట్ టాపిక్ గా మారింది. ఇరాన్ ఊహించని దారుణమైన దెబ్బ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ స్థాయిలో వార్నింగ్ ఇవ్వడానికి అందుకు పెద్ద కారణమే ఉంది. ఇరాన్ 837 మందిని ఉరి తీయబోతోందని సమాచారం, ఆ పని చేస్తే.. తమ నేవీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుందని ఇరాన్‌పై దాడికి ప్లాన్ చేసిన తర్వాతే ఈ కామెంట్స్ చేశాడు.

ఈ దాడి కోసం ట్రంప్ తమ అమ్ములపొదిలో అప్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను రెడీ చేసారని వార్తలు వస్తున్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కు ఇరాన్ సైన్యాన్ని ఒక దెబ్బకు నాశనం చేయగల సత్తా ఉంది. యూఎస్ ఎస్ అబ్రహం లింకన్‌ నౌకలో డెడ్లీ ఫైటర్ జెట్స్ ఉంటాయి. అవి యుద్ధానికి దిగితే భూమి నుంచి.. సముద్రం నుంచి.. ఆకాశం నుంచి ఎక్కడి నుంచైనా శత్రువును దెబ్బ కొట్టగల సామర్థ్యం ఉంటుంది.

తనకేమైనా జరిగితే ఈ భూమ్మీద ఇరాన్‌(Iran) ను లేకుండా చేస్తానని ట్రంప్ బెదిరించడానికి కారణం ఈ నౌకను ఇరాన్ వైపు పంపడమే. అమెరికా దగ్గర ఉన్న విధ్వంసక ఆయుధాలు ఇరాన్ మొత్తాన్ని సర్వనాశనం చేయగలదని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి స్థావరాలు, ప్రమాదకర లక్ష్యాలను నిమిషాల్లోనే లక్ష్యం చేసుకోగల శక్తి ప్రస్తుతం అమెరికా దగ్గర ఉంది. దీంతో ట్రంప్ చెప్పినట్టు ఇరాన్‌పై దాడి జరిగితే ఆ దాడిని అడ్డుకోవడం వారికి అసాధ్యం.

Iran
Iran

వెనెజువెలాపై సైనిక దాడి జరపడానికి ముందు అమెరికా ఇదే రకమైన పంథాను ఎంచుకుంది. ఇప్పుడు ఇరాన్ విషయంలో అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. కాగా ఇజ్రాయెల్ టాప్ డిఫెన్స్ అఫీషియల్స్ కొద్ది గంటలుగా వార్‌రూమ్‌‌లోనే ఉన్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. ఎందుకంటే, అమెరికా కనుక ఇరాన్‌పై దాడికి దిగితే టెహ్రాన్ నుంచి డేంజర్ క్షిపణులు ఇజ్రాయెల్‌వైపే దూసుకెళతాయి. ఇంతకు ముందు చెప్పినట్టు తాము ట్రిగ్గర్‌లోనే ఉన్నామనీ, అన్నింటికీ సిద్ధమని ఇరాన్ ప్రకటించింది.

Changur Baba :ఎవరీ చంగూర్ బాబా .. కులాన్ని బట్టి రేటు, విదేశీ ఫండింగ్ ఏంటీ కథ..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button