Just Literature

Literature : యుద్ధం మాటున..

Literature : దేశాల సరిహద్దుల పోరులో దేహాలు చిద్రమవుతుంటే శాంతి సిద్ధాంతాలు పుస్తకాలు దాటలేదు ..

Literature

ఈ ప్రపంచమేమంత
అభివృధ్ధి చెందలేదు..
అనాగరికమైన ఆధిపత్య పోరు
ఇంకా అంతమవ్వలేదు…

అంతరిక్షంలోకి పంపే ఉపగ్రహాలు
ఆకాశాన్ని తాకే హర్మ్యాలు
అణు‌బాంబుల నిల్వలు
అతి వేగపు రైలులు
ఇవేనా అభివృద్ధి చిహ్నాలు?
ఇవేనా నాగరిక ఆనవాలు?

గాజాలో బిడ్డల ఆకలి కేకలు
ఈ ప్రపంచపు యుద్ధోన్మాదాన్ని
వదిలించలేకుంది…
కలలను పండించాల్సిన చిట్టిచేతులు
రొట్టెలకై చేయి చాస్తుంటే
శిబిరం సాయం కోసం
శూన్యంలోకి చూస్తుంది..

యుద్ధం..
ఇక్కడ రెండు రకాలు
బాహ్యంగా బాంబుల దాడులు
అంతరంగా ఆకలి హింస..
రెండూ చంపేస్తున్నా
మానవత్వం సంక్షోభంతో
కొట్టుమిట్టాడుతుంది..

నిలిచే నేల వణుకుతుంది
పీల్చే గాలి ధూళయ్యింది
ఉండే ఆవాసం ఒరిగిపోయింది
చదివే పాఠశాల మూసుకుంది
ప్రాణం విలువ లెక్క తప్పింది
కరువు కోరలు తెరుచుకుంది

దేశాల సరిహద్దుల పోరులో
దేహాలు చిద్రమవుతుంటే
శాంతి సిద్ధాంతాలు
పుస్తకాలు దాటలేదు ..
శాంతి సమావేశాలు
గది తలుపులు తెరవలేదు..

ఆకలి‌ కంటే ద్వేషం గొప్పదైనప్పుడు
సంపద సృజన కంటే నాశనం వైపే
తరలిపోతుంది..
కరెన్సీ విలువతో పాటు
మానవత్వం విలువ
దిగజారిపోతుంది..

అభివృద్ధి అంటే అణుశక్తి కాదు
అణువణువున ప్రేమ కావాలి
ప్రగతి సాంకేతికంగానే చాలదు
ప్రజలు సామాజికంగానూ మెరుగవ్వాలి
అందుకే అంటున్నా
ఈ ప్రపంచమేమంత
అభివృధ్ధి చెందలేదు..

ఒక ఉనికి కోసం, ఒక గోడ కోసం
ఏమిటి ఈ అంతులేని తర్పణ?
మనిషి కన్నీటి విలువ కన్నా
అధికమా మట్టికి గీసిన గీత?
అందుకే అంటున్నా
ఈ ప్రపంచమేమంత
అభివృధ్ధి చెందలేదు..
ఎందుకంటే మనిషి
ఇంకా మనిషిని చంపుతున్నాడు..

— ఫణి మండల

 

Related Articles

22 Comments

  1. నిజమే మనిషి ఏమీ మారలేదు, ఆటవిక యుగం లో ఆహారకోసం నీటి ఆధునికయుగం లో అహం శాంతికోసం నిరంతరం రాక్షసుడిగా రూపాంతరం చెందుతూనే ఉన్నాడు. అభివృద్ధి ,మానవీయత,అంతా ఒక భూటకం మన ఆత్మసంతృప్తి చెప్పే గొప్ప అబద్దం. మీ కవిత సూటిగా, స్పష్టంగా ఉంది మనసుకు హత్తుకుని,వాస్తవ ప్రపంచం కళ్ళముందు సాక్షాత్కరించింది. చాలా బాగుంది.

  2. ఫణి మండల గారు అద్భుతంగా రాశారు యుద్ధం మాటున అనే కవిత. చదివాక చాల బాధ కలిగింది. ఇలాంటి పనికిమాలిన యుద్ధాలు ఆగాలి . ఇలాంటి మానవత్వం లేని సమాజం లో బ్రతుకుతున్నాము అని స్పష్టంగా చెప్పారు.నేను మీతో ఏకీభవిస్తున్నాను. మంచి కవితలు మీ నుంచి మరెన్నో రావాలని కోరుకుంటూ

  3. Superb poetry
    Please translate in English send it to English websites.👏👏🙏🙏🙏🪴🪴

  4. Nice phani, ప్రేమతత్వం అందరిలోనూ ఉన్నట్లయితే ఈ యుద్ధాలన్నవి చాలావరకు తగ్గుతుందేమో, అందరిలోనూ ఇది జాగృతం కావాలి.. దుర్గాప్రసాద్ చెప్పినట్లు పనికిమాలిన యుద్ధాలు ఆగాలంటే ప్రతి ఒక్కరిలోను కూడా ప్రేమ తత్వం ప్రేమ జ్యోతిని వెలిగించుకోవాలి తద్వారా మనలో ఉన్న అంతర్గత యుద్ధాలు తగ్గించుకున్నట్లయితే మన కుటుంబ సభ్యులతో శత్రువులతో కూడా ప్రేమగా ఉన్నట్లయితే ఈ యుద్ధాలున్నవి కొంతవరకు తగ్గుతాయేమో….. ఏది ఏమైనా పని మండల వారి నుంచి మంచి మంచి కవితలు ఎలా జాలువారుతూ కలకాలం ఉన్న స్థితిలో ఉండాలని మన మిత్రుడు నీ కోరుకుంటున్నాను

  5. చాలా చాలా ఆలోచించేదిగా ఉంది. ఇది ఎక్కువ మంది చదివేలా అన్ని మాధ్యమాల్లో పోస్ట్ చేయాలి

  6. బాగుంది ఫణి
    ఆధిపత్యం కోసం ఆరాటం మానవత్వం చూడదు

  7. బాగుంది ఫణి
    ఆధిపత్యం కోసం ఆరాటం మానవత్వం చూడదు

  8. మనిషి మారవలసినంత మారలేదు. మానవ అభివృద్ధి సాధించలేదు మానవతా విలువలు ఇంకా దిగజారిపోతున్నాయి. ఫణి, నీ కవితలు చాలా బాగున్నాయి. దానిలో చాలా డెప్త్ ఉంటుంది. ఇంత టాలెంటెడ్ వ్యక్తి నాకు స్నేహితుడు గా ఉన్నందుకు నాకు గర్వంగా ఉంది మిత్రమా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button