Just InternationalLatest News

Trump : పాక్‌తో డీల్, భారత్‌పై డ్యామేజ్.. ట్రంప్ ప్లాన్ ఏంటి?

Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతపై తీసుకుంటున్న వ్యతిరేక చర్యలు, పాకిస్తాన్‌తో వ్యాపార ఒప్పందం, మరియు మోదీ ప్రభుత్వంపై ఆయన చూపుతున్న విమర్శలు వివాదాస్పదంగా మారాయి. ఈ రివర్స్ పొలిటికల్ ఫ్లిప్ ప్రపంచం ఎలా అర్థం చేసుకుంటుందో చూడాలి.

Trump

అసలే కోతి ఆపై కల్లు తాగింది అన్నట్లుగా ఉంది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం. పైకి భారత్ మిత్ర దేశం అని చెబుతున్నా..లోలోన ఎంత మంట ఉంటుందో అందరికీ తెలిసిందే. కొద్ది రోజులుగా మోదీ ప్రభుత్వ తీరుతో మండిపోతున్న ట్రంప్ (Trump) ఇప్పుడు వరుసగా భారత్‌కు వ్యతిరేక పనులు చేస్తూ పైశాచికానందం పొందుతున్నట్లు కనిపిస్తోంది.

అమెరికా ఫస్ట్ అన్న మాటను నినాదంగా మలచుకున్న ట్రంప్(Trump), ఈసారి మిత్ర దేశాలనే గాలికొదిలేశారన్నంత పని చేస్తున్నారు. ఇండియాతో బంధం బలంగా ఉండాల్సిన సమయంలో… ట్రంప్ పాలన హఠాత్తుగా వ్యాపార యుద్ధపు మార్గాన్ని ఎంచుకోవడం విశ్లేషకులను కూడా ఆశ్చర్యంలో పడేస్తోంది.

నిజానికి 25 శాతం టారిఫ్‌లు విధిస్తూ ట్రంప్ చేసిన ప్రకటన మామూలు అంశం కాదు. ఇది వాణిజ్య సంబంధాలపై పిడుగు వేసే చర్య. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే .. భారత్‌పై అమెరికా వ్యతిరేక వైఖరికి మారిందని చెప్పడానికి పంపిన అసలు సిసలైన సంకేతం ఇది.

అంతేకాదు తాజాగా పాకిస్తాన్‌(Pakistan)తో చమురు నిల్వల అభివృద్ధికి ఒప్పందం కుదుర్చుకున్న ట్రంప్ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది. ఒకవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకుంటూనే మరోవైపు దాన్ని వ్యతిరేకించే భారత్‌(India)పై ఆంక్షలు విధిస్తున్నారు. మరి ఈ పొలిటికల్ ఫ్లిప్‌ ఫ్లాప్‌ను ప్రపంచం ఎలా అర్థం చేసుకుంటుందో చూడాలి.

రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్.. మొదట్లో మోదీ(modi) పట్ల స్నేహభావంతో మాట్లాడినా ఇప్పుడు విముఖత చూపుతున్నారు. ప్రధాని మోదీ ఇటీవల పార్లమెంటులో ఆపరేషన్ సిందూర్‌ను పాక్ అభ్యర్థన మేరకు ఆపాం అని చెప్పిన తర్వాత… ట్రంప్ చేసిన చర్యలు అంతకుమించిన ప్రతీకారం అన్నట్లుగా మారిన విషయం తెలిసిందే.

Trump
Trump

మరోవైపు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌తో వైట్‌హౌస్ సమావేశం, ట్రంప్ (Trump) కుటుంబానికి అనుబంధంగా ఉన్న సంస్థలతో ఒప్పందాలు, ఇవన్నీ అమెరికా విదేశాంగ విధానంలో వ్యూహాత్మక నష్టానికి ట్రంప్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

వీటన్నింటిపై నిపుణులు ఘాటు వ్యాఖ్యలే చెబుతున్నారు. అమెరికా ఒక వైపు భారత్‌తో వ్యూహాత్మక బంధం మాట్లాడుతుంటే, మరోవైపు పాకిస్తాన్‌ను ప్రోత్సహించడం ‘సెల్ఫ్‌ గోల్’ గా అభివర్ణిస్తున్నారు. ట్రంప్ దృష్టిలో భద్రత కన్నా వ్యాపారమే ముఖ్యం అనే భావనే ఎక్కువవుతోందని విమర్శిస్తున్నారు

ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, క్రిప్టో రంగంలో ట్రంప్ వ్యక్తిగత ఆసక్తులు ఇవన్నీ ముడిపడిన చర్యలే. ఈ పరిణామాలన్నీ దక్షిణాసియాలో శక్తుల సమతుల్యతను దెబ్బతీయే ప్రమాదం కలిగి ఉన్నాయి. ఇప్పటికే భారత్ , పాక్ సంబంధాలు హీటును పుట్టిస్తుంటే.. అమెరికా పాక్ వైపు మరింతగా మొగ్గడం… భారత్‌ను కావాలని రెచ్చగొట్టినట్లు చేయడమే. మొత్తంగా ట్రంప్ చర్యలకు భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also read: Bill Gates : అప్పుడు కోట్లు కుమ్మరించారు..ఇప్పుడు అమ్మేస్తున్నారు ..బిల్ గేట్స్ నిర్ణయం వెనుక ?

 

Related Articles

Back to top button