Just SpiritualJust TechnologyLatest News

Nuclear Energy : పురాణ కాలంలోనే అణుశక్తి ఉందా? మన అస్త్రాల వెనుకున్న అద్భుత సైన్స్ ఏంటి?

Nuclear Energy : మహాభారతం, రామాయణంలో యుద్ధాల గురించి చదువుతున్నప్పుడు, లేదా సినిమాలలో చూస్తున్నపుడు మనకు వేల సంఖ్యలో బాణాలు ప్రయోగించినట్లు కనిపిస్తుంది

Nuclear Energy

మహాభారతం, రామాయణంలో యుద్ధాల గురించి చదువుతున్నప్పుడు, లేదా సినిమాలలో చూస్తున్నపుడు మనకు వేల సంఖ్యలో బాణాలు ప్రయోగించినట్లు కనిపిస్తుంది. అయితే అవి కేవలం బాణాలు మాత్రమే కాదు.. నేటి ఆధునిక క్షిపణి టెక్నాలజీ (Missile Technology)కి అవి ప్రాథమిక రూపాలుగా భావించొచ్చు. పురాణాల్లో వర్ణించిన అస్త్రాల పనితీరును ఇప్పటి సైన్స్‌తో పోల్చి చూస్తే మన పూర్వీకుల మేధస్సు ఎంతటిదో అర్థమవుతుంది.

వీటిలో మొదటగా బ్రహ్మాస్త్రం గురించి చెప్పుకోవాలి. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు వెయ్యి సూర్యుల కాంతి ఉద్భవించి, భూమి కంపించిపోతుందని, గాలిలో రేడియేషన్ వంటి వేడి వ్యాపిస్తుందని రామాయణ,మహాభారతంలో వర్ణించారు. ఇది అచ్చం నేటి అణ్వాయుధాల పని తీరునే పోలి ఉంటుంది.

అప్పట్లో ఒక అస్త్రాన్ని ప్రయోగించడానికి మంత్రాన్ని.. కీ (Key) లాగా వాడేవారు. అప్పటి కాలం ప్రకారం చెప్పాలంటే శబ్దాన్ని ఒక సంకేతంగా మార్చి, అస్త్రాన్ని యాక్టివేట్ చేసే ప్రక్రియ అది. నేటి కంప్యూటర్ కోడింగ్ ద్వారా క్షిపణులను కంట్రోల్ చేసినట్లు, అప్పట్లో మంత్ర బలం ఆ పని చేసేది.

Nuclear Energy
Nuclear Energy

అలాగే మరో అద్భుత ఆయుధం సుదర్శన చక్రం. దీనిని ఇప్పటి కాలంలో గైడెడ్ మిస్సైల్ లేదా స్మార్ట్ వెపన్ అని పిలుస్తారు. లక్ష్యం ఎంత దూరంలో ఉన్నా, ఎంత వేగంగా కదులుతున్నా దానిని ఛేదించి, మళ్లీ ప్రయోగించిన వారి వద్దకే తిరిగి రావడం దీని స్పెషాలిటీ.

నేటి క్షిపణులు లక్ష్యాన్ని కొట్టాక నాశనమైపోతాయి. కానీ సుదర్శన చక్రం తిరిగి రావడమనేది అత్యున్నతమైన రీ-యూజబుల్ టెక్నాలజీకి(Nuclear Energy) నిదర్శనం. అలాగే పాశుపతాస్త్రం వంటివి శత్రువుల ఆలోచనలను బట్టే పని చేస్తాయని చెప్పబడింది. ఇది నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బేస్‌డ్ వెపన్స్‌కు ఏమాత్రం తీసిపోదు. ఒకే బాణం నుంచి వేల బాణాలు రావడమనేది ఇప్పటి మల్టీపుల్ వార్‌హెడ్ టెక్నాలజీని గుర్తు చేస్తుంది.

Yoga: యోగా అంటే కేవలం ఎక్సర్‌సైజ్ మాత్రమే కాదు.. పరిపూర్ణ జీవితానికి అష్టాంగ మార్గం

Related Articles

Back to top button