Just InternationalJust PoliticalLatest News

Donald Trump : రాజకీయ మూల్యం చెల్లించేందుకైనా సిద్ధమే..ఇరాన్‌పై దాడికి ట్రంప్ మళ్లీ స్కెచ్..

Donald Trump : ఇరాన్‌పై మరిన్ని సైనిక దాడులు చేయడానికి రెడీగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. ఎన్నికలపై దీని ప్రభావంపైన కామెంట్లు, యుఎన్ఓ సెక్రటరీ జనరల్ హెచ్చరికలపై వివరాలు చూద్దాం.

Donald Trump

ప్రపంచ దేశాలను వణికిస్తున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరో తీవ్ర స్థాయికి చేరుకున్నాయి . ఇరాన్‌పై మరోసారి ఊహించని రేంజ్‌లో సైనిక చర్యలు చేపట్టే అవకాశాలున్నాయన్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సమర్థించుకున్నారు. అవసరమైతే ఇరాన్ భూభాగంపై మరిన్ని దాడులను చేయడానికి వెనుకాడేది లేదని ట్రంప్(Donald Trump) గట్టి సంకేతాలిచ్చారు. అయితే ఈ యుద్ధం వల్ల రాబోయే కాంగ్రెస్ ఎన్నికల్లో తమ రిపబ్లికన్ పార్టీకి పొలిటికల్‌గా కొంత నష్టం జరిగే అవకాశం ఉందని ఆయనే స్వయంగా అంగీకరించారు

ఇరాన్‌పై సైనిక చర్యలు ఎలక్షన్ క్యాంపెయిన్‌ను ఎలా ప్రభావితం చేస్తున్నాయని మీడియా ప్రశ్నించినప్పుడు ట్రంప్ ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు. ఈ విషయంలో యూఎస్ ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఆయన ఒప్పుకున్నారు. కొంతమంది తమ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తుంటే, మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.

ఈ యుద్ధం వల్ల రాజకీయంగా తాము మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ముందే ఊహించామని, కానీ ఏది ఏమైనా ఇరాన్ చేతికి అణ్వాయుధం చిక్కకుండా అడ్డుకోవడమే తమ ఫస్ట్ ప్రయారిటీ అని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఇరాన్‌పై భారీ దాడులు చేశామని, ముందు ముందు కూడా సైనిక చర్యలు ఉంటాయని చెప్పారు కానీ.. కొత్తగా ఎప్పుడు, ఏ లక్ష్యాలపై దాడి చేస్తారనే విషయాలను మాత్రం సస్పెన్స్‌లోనే ఉంచారు.

మరోవైపు అమెరికా, ఇరాన్ యుద్ధ వాతావరణంపై ఐక్యరాజ్యసమితి (UN) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాల ఎఫెక్ట్ కేవలం పోరాటం జరుగుతున్న సరిహద్దులకే పరిమితం కాదని.. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిలో జరుగుతున్న పరిణామాల వల్ల వరల్డ్ వైడ్‌గా ఇంధన ధరలు మరింతగా మండే ప్రమాదం ఉందన్నారు.

నౌకాయానం, గ్లోబల్ సప్లై చైన్ సిస్టమ్స్ దెబ్బతిని సామాన్య కుటుంబాల బతుకులన్నీ భారంగా మారిపోతాయని ఆయన హెచ్చరించారు. ఈ యుద్ధాలకు ముగింపు పలికి, పౌరుల ప్రాణాలను రక్షించాలని చెబుతూ వెంటనే చర్చలకు మార్గం సుగమం  చేయాలని ఆంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చారు. అమెరికా,ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈజిప్టులో అక్టోబర్ 23న పర్యటించనున్నట్లు ప్రకటించారు.

FAHR-Face : ఫోటోతో ఆయుష్షు లెక్క చెప్పేస్తున్న ఏఐ..క్యాన్సర్ ముప్పునూ ముందే పసిగట్టేస్తున్న టెక్నాలజీ..

Related Articles

Back to top button