Just LifestyleLatest News

Children:తల్లిదండ్రులు,బంధువుల ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుంది? వారి ఫ్యూచర్‌ను డిసైడ్ చేసేది ఎవరు?

Children: ఇంట్లో అమ్మానాన్నల మధ్య నిత్యం గొడవలు , మాటలు లేని నిశ్శబ్ద యుద్ధం జరుగుతుంటే అది చిన్న పిల్లల(Children) మనసును చిన్నాభిన్నం చేస్తుంది.

Children

మనిషి జీవితం ఒక మహా వృక్షం అయితే, బాల్యం అనేది ఆ చెట్టుకు ప్రాణం పోసే వేరు వంటిదంటారు మానసిక నిపుణులు. ఊహ తెలియని వయసులో చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా చూసింది, ఎలాంటి అనుభవాలను ఇచ్చిందనేదే పెద్దయ్యాక ఎలాంటి వ్యక్తులుగా మారుతామో నిర్ణయిస్తుందని అంటారు.

చాలా మంది పిల్లలే కదా.. వాళ్లకేం తెలుస్తుందని వారిని తేలికగా తీసుకుంటారు. కానీ, ఒక పసి మనసు రికార్డింగ్ స్టూడియో వంటిది. అందులో పేరెంట్స్ గొడవలు, బంధువుల వెటకారపు మాటలు, స్నేహితుల చిన్నచూపు అన్నీ రికార్డ్ అయి.. పెద్దయ్యాక వారి వ్యక్తిత్వంలో రీప్లే అవుతుంటాయి.

పిల్లలకు తమ ప్రపంచం అంటే ముందుగా వాళ్ల తల్లిదండ్రుల గురించే చెప్పుకోవాలి. ఇంట్లో అమ్మానాన్నల మధ్య నిత్యం గొడవలు , మాటలు లేని నిశ్శబ్ద యుద్ధం జరుగుతుంటే అది చిన్న పిల్లల(Children) మనసును చిన్నాభిన్నం చేస్తుంది. దీనివల్ల వారు పెద్దయ్యాక కాన్‌ఫ్లిక్ట్ అవాయిడెన్స్ (Conflict Avoidance) అనే లక్షణాన్ని పెంచుకుంటారు.

అంటే, ఏదైనా సమస్య వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి బదులు భయంతో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే వణికిపోతుంటారు. అంతేకాదు పెళ్లిపై నిరాసక్తిని పెంచుకుంటారు. అలాగే అందరినీ సంతోష పెట్టాలని చూసే పీపుల్ ప్లీజింగ్ లక్షణం వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఈజీగా చెడు అలవాట్లకు బానిసయ్యే లక్షణాలు వీరిలో కనిపిస్తాయి.

మరోవైపు చిన్నతనంలో బంధువుల నుంచి వచ్చే కామెంట్స్ పిల్లల మీద చాలా ఎక్కువ ముద్ర వేస్తాయి. చూడు మా అబ్బాయి ఎంత తెలివైనవాడో, నువ్వేంటి ఇలా ఉన్నావని.. మీ అన్నయ్యకి అన్ని మార్కులు వచ్చాయి, నీకేంటి ఇన్ని తక్కువ వచ్చాయని పోల్చడం (Comparison) వల్ల..చిన్న పిల్లల్లో ఇన్‌ఫిరియారిటీ కాంప్లెక్స్ (Inferiority Complex) ఏర్పడుతుంది. ఇలాంటి వారు పెద్దయ్యాక నలుగురిలోకి వెళ్లడానికి భయపడతారు. ఎవరైనా తనను గమనిస్తున్నారని తెలిస్తే విపరీతమైన టెన్షన్ పడతారు. తమ ప్రతిభను చాటుకోవడంలో వీళ్లు ఎప్పుడూ వెనుకే ఉంటారు.

అలాగే చిన్న పిల్లల(Children)కు స్నేహితులే ప్రపంచం.కానీ ఒకవేళ చిన్నప్పుడు ఆ స్నేహితుల గుంపులో ఒకరిని దూరం పెట్టినా (Rejection) , ఆటల్లో ఎగతాళి చేసినా, ఆ గాయం మానసికంగా వారిలో చాలా కాలం ఉంటుంది. నేను ఎవరికీ నచ్చను” అనే ఫీలింగ్ వారిలో నాటుకుపోతుంది. ఇలాంటి అనుభవాలున్నవారు పెద్దయ్యాక కొత్త వారితో స్నేహం చేయడానికి ఇష్టపడరు. ఎవరితోనైనా క్లోజ్‌గా ఉంటే వాళ్లెక్కడ తనను వదిలేసి వెళ్లిపోతారోనని ‘అభద్రతా భావం’ (Fear of Abandonment)ను పెంచుకుంటారు.

Children
Children

అలాగే చిన్నప్పుడు వాళ్లు పెరిగే ఆర్థిక , సామాజిక పరిస్థితులు పెద్దయ్యాక వారి ఆలోచనా ధోరణిని మారుస్తాయి. చిన్నప్పుడు ఇంట్లో డబ్బుల కోసం గొడవలు, అభద్రత ఉన్న వాతావరణంలో పెరిగిన పిల్లల మెదడు ఎప్పుడూ సర్వైవల్ మోడ్‌లోనే ఉండిపోతుంది. వీరు పెద్దయ్యాక చేతినిండా డబ్బు సంపాదించినా కూడా ప్రశాంతంగా ఉండలేరు. ప్రతి చిన్న సమస్యను ఒక పెద్ద విపత్తుగా చూస్తారు ఎందుకంటే వారి నాడీ వ్యవస్థ ఎప్పుడూ ఒత్తిడిలోనే ఉంటుంది.

అందుకే మనిషి ప్రవర్తన అనేది హఠాత్తుగా పుట్టుకొచ్చేది కాదని.. అది గతంలోని అనుభవాల సమాహారం అని సైకాలజిస్టులు అంటారు. అందుకే మన మాట, మన ప్రవర్తన ఒక చిన్న ప్రాణం యొక్క ఫ్యూచర్‌ను డిసైడ్ చేస్తుందని గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రులుగా, బంధువులుగా, స్నేహితులుగా చిన్న పిల్లలకు మనం ఇచ్చే అతిపెద్ద ఆస్తి ఒకటే.. అది ఒక ప్రశాంతమైన, గౌరవప్రదమైన వాతావరణం ఇవ్వడం మాత్రమే అని తెలుసుకోవాలి.

Mango: మీరు మామిడి పండ్ల ప్రియులా? అయితే మ్యాంగోను తినడానికి కూడా ఓ లెక్క ఉందని తెలుసుకోండి..

Related Articles

Back to top button