Just LifestyleLatest News

Sign of death: వాసన కోల్పోతే మరణానికి సంకేతమా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?

Sign of death: మరణానికి ముందే ముక్కు హెచ్చరిస్తుందట.

Sign of death

ఒక మనిషి జీవితం ముగిసే ముందు అంటే మరణానికి కొంతకాలం ముందు శరీరం కొన్ని సంకేతాలు(Sign of death) పంపిస్తుందని వైద్యశాస్త్రం చెబుతోంది. వాటిలో ముక్కు నుంచి వచ్చే సూచనలు ఎంతో ముఖ్యమైనవి. మనం సాధారణంగా దీనిని చిన్న విషయంగా తీసుకున్నా, నాకొద్దిగా వాసన తక్కువైందేమో అనుకుంటున్నా… దీని వెనుక చాలా పెద్ద సంకేతం దాగి ఉండొచ్చు. ముఖ్యంగా వృద్ధుల్లో ముక్కు పనిచేయకపోవడం అంటే..ఘ్రాణశక్తి క్రమంగా తగ్గిపోవడం—శరీరంలో పెరుగుతున్న ప్రమాదాలను స్పష్టంగా చూపే సూచికగా పరిశోధకులు గుర్తించారు.

తాజాగా అమెరికాలో జరిగిన పరిశోధనల్లో ఒకటి ప్రకారం, వృద్ధుల్లో ముక్కు నుంచి వాసనలను గుర్తించే శక్తి తగ్గిపోతే… వచ్చే ఐదేళ్లలో వారు మరణించే అవకాశం (sign of death) సాధారణ జనాభాతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందట. అంతే కాదు, ఇది ఏదో ఒక ప్రత్యేక వ్యాధి లక్షణం మాత్రమే కాకుండా శారీరక క్షీణతకు నిదర్శనంగా కూడా భావిస్తున్నారు.

ఘ్రాణశక్తి అంటే కేవలం వాసన గుర్తించడమే కాదు. ఇది మన మెదడుతో నేరుగా అనుసంధానమై ఉంటుంది. వాసన గుర్తించలేకపోవడం అనేది నాడీ వ్యవస్థలో ఏర్పడుతున్న సమస్యకు తొలితెరగా కనిపించవచ్చు. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ఆరంభ లక్షణమే ఇది కావచ్చు. ఇదే సమయంలో, వాసనల పట్ల స్పందన తగ్గిపోవడం శరీరం తనలో తానే పోరాడలేకపోతున్న సంకేతం కూడా. ముఖ్యంగా వయసుతో శరీరం కణజాలాన్ని పునరుత్పత్తి చేయలేకపోతే, ముక్కు ద్వారా సంకేతాల వ్యవస్థ కూడా క్రమంగా చీరిపోతుంది.

ఒక వృద్ధుడు వాసనలు గమనించలేకపోతున్నాడంటే అది తక్కువ శరీర సామర్థ్యానికి, తగ్గిన జీవసత్త్వానికి, వచ్చే పెద్ద ఆరోగ్య సమస్యల నిదర్శనంగా పరిగణించాలి. అంతేగాక, ఘ్రాణశక్తి కోల్పోవడం డిప్రెషన్, ఆహారంలో ఆసక్తి తగ్గిపోవడం, మలినాలు గుర్తించలేకపోవడం వంటి సమస్యలకూ తలుపుతీస్తుంది. ఈ లక్షణాలు కలిగిన వారు ఒక వైద్యులను సంప్రదించడం అత్యంత అవసరం.పర్యావరణ కాలుష్యం, మొండి జ్వరం, తల గాయాలు, ముక్కులో నల్లదనం వంటి అంశాలు కూడా ఘ్రాణశక్తి కోల్పోవడానికి దోహదపడతాయి. అయితే ఇవన్నీ కాకపోయినా, వాసనలు గుర్తించలేకపోవడం ఒకపెద్ద సంకేతం.

Sign of death
Sign of death

ఇలాంటి పరిస్థితుల్లో వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం. ముక్కులోని నాడీ వ్యవస్థ, మెదడు వాసనల ప్రక్రియకు ఎలా స్పందిస్తుందో పరిశీలించాలి. దాన్ని బేస్ చేసుకుని ఏవైనా లోపాలు ఉన్నాయా లేదా అన్నది గుర్తించవచ్చు. అలాగే కొన్ని వాసనలను మనం నిరంతరం గుర్తించేలా చేసే సాధనలతో కూడా ఈ శక్తిని కొంతవరకూ మెరుగుపరచవచ్చు. పువ్వులు, పచ్చి వాసనలు, తీపి పరిమళాలు వంటి వాటిని ప్రతిరోజూ ఓ రెండు నిమిషాలపాటు శ్వాసించటం ద్వారా మెదడు వాసనల గుర్తింపు పట్ల మరింత క్రియాశీలంగా మారుతుంది.

మొత్తానికి చెప్పాలంటే, మనం ముక్కు ద్వారా గుర్తించలేకపోతున్న గంధాలు మనకు కనిపించని ముప్పుల సంకేతాలుగా మారుతున్నాయి. శరీరంలో చనిపోయే ముందు కొన్ని అలజడులు, కొన్ని హెచ్చరికలు వస్తాయి. వాటిలో మొదటిది ఘ్రాణశక్తి కోల్పోవడమైతే… దీన్ని చిన్న సమస్యగా కాకుండా, నిశ్శబ్దంగా దగ్గరపడుతున్న ముప్పు అని గుర్తించి ముందే చికిత్సలు ప్రారంభించడం చాలా అవసరం.

Also Read: Kavitha: ఒకే పార్టీ..ఇద్దరు నేతలు..మాటల యుద్ధం..కేసీఆర్ మౌనం ఎందుకు?

Related Articles

Back to top button