Relatives:శత్రువులకు సపోర్ట్ చేసే ఆప్తులు.. ఈ మైండ్సెట్ వెనుకున్న 3 నిజాలు
Relatives : సొంత వాళ్లయినా సరే తాను తప్పును తప్పు అనే చెప్తానని సొసైటీకి చూపించుకోవడం కోసం, కావాలనే మనల్ని కాదని అవతలి వ్యక్తి వైపు నిలబడుతుంటారు.
Relatives
మన వ్యక్తిత్వం ఏంటో,మనం ఎలాంటి వాళ్లమో చుట్టాలు, క్లోజ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటారు. అయినా సరే మనపై ఎవరైనా అపవాదు వేసినప్పుడు మనకు సపోర్ట్ చేయకుండా శత్రువులకు రహస్యంగా మద్దతు ఇస్తుంటారు. అయితే ఇలాంటి మైండ్సెట్ కలిగినవారి వెనుక ఒక విచిత్రమైన మనస్తత్వం దాగి ఉంటుంది. సైకాలజీ ప్రకారం దీనిని అసోసియేషన్ బయాస్ లేదా సోషల్ కన్ఫార్మిటీ అని పిలుస్తారు.
అంటే, సొసైటీలో నలుగురిలో తమ పేరు చెడిపోకూడదనే స్వార్థం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. నిందలు వేసిన వ్యక్తి సొసైటీలో కాస్త బలమైనవాడైనా లేక ఎక్కువ మంది అతడి వైపే ఉన్నా.. మన గురించి నిజం తెలిసి కూడా ..మెజారిటీ చుట్టాలు(Relatives), ఫ్రెండ్స్ మన శత్రువుల వైపే నిలబడటానికి మొగ్గు చూపిస్తారు.
ఇది నేటి రాజకీయాలలో కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. తప్పు ఎవరిదైనా సరే, గెలిచే వాడి పక్కన ఉంటేనే తమకు సేఫ్ అనే ఒక పిరికితనం , స్వార్థపూరిత ఆలోచన వల్ల మనవాళ్లు.. అవతలి వ్యక్తికి సపోర్ట్ ఇస్తుంటారు.
దీనికి మరో ముఖ్యమైన సైకలాజికల్ కారణం.. వారి మనసులో దాగే అణచివేసిన అసూయ. చిన్నప్పటి నుంచి మన ఎదుగుదలను చూస్తూ లోలోపల కుళ్లుకునే మైండ్సెట్ ఉన్నవాళ్లు.. మనపై ఏదైనా నింద లేదా నేరారోపణ పడగానే దాన్ని ఒక అవకాశంగా మార్చుకుంటారు. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్లు పైకి ఎంతో మంచిగా నటిస్తూనే, లోపల మన ఇమేజ్ ఎప్పుడు డ్యామేజ్ అవుతుందా అని ఎదురుచూసే టైప్ కాబట్టి..వాళ్లు దానిని ఏ మాత్రం మిస్ చేసుకోరు.
ఇలాంటివారు ఎవరైనా మనపై నేరం మోపినప్పుడు బంధువులు(Relatives), స్నేహితులు దీనిని ఖండించాల్సింది పోయి.. అవును వాడు అలాంటి వాడే అంటూ అవతలి వాళ్ల మాటలకు సపోర్ట్ చేస్తూ మనల్ని మరింత కిందకు లాగడానికే చూస్తారు. చిన్నప్పటి నుంచి మనతో ఉన్నా సరే వారి మనసులో మనపై ఎలాంటి నిజమైన ప్రేమ లేదా గౌరవం ఉండవు.

అలాగే మరికొంతమందికి అందరి దృష్టిలో తాము చాలా నిష్పాక్షికంగా ఉన్నామని ప్రూవ్ చేసుకోవాలనే ఒక పిచ్చి కోరిక ఉంటుంది. దీనిని సైకాలజీలో వర్చ్యూ సిగ్నలింగ్ అంటారు. అంటే, సొంత వాళ్లయినా సరే తాను తప్పును తప్పు అనే చెప్తానని సొసైటీకి చూపించుకోవడం కోసం, కావాలనే మనల్ని కాదని అవతలి వ్యక్తి వైపు నిలబడుతుంటారు.
ఇలా చేయడం వల్ల తాము చాలా గొప్ప వాళ్లమని, న్యాయబద్ధంగా ప్రవర్తిస్తున్నామని ఇతరుల ముందు డబ్బా కొట్టుకోవచ్చనే మైండ్ సెట్ వీరిది. ఏది ఏమైనా సరే, మన గురించి పూర్తిగా తెలిసి కూడా.. పరాయి వాళ్ల మాటలు నమ్ముతూ మనల్ని ఒంటరిని చేసే ఇలాంటి నకిలీ బంధాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
Passport : 3 రోజుల్లోనే పాస్పోర్ట్..అప్లై చేయడానికి కావలసిన 4 ఈజీ స్టెప్స్ ఇవే





