Temple Gadapa : గుడి గడపను తొక్కకూడదా? దీని వెనుకున్న అసలు రహస్యమేంటి?
Temple Gadapa : గుడి ప్రధాన ద్వారానికి ఉండే ఆ గడపను కేవలం ఒక చెక్క ముక్కలాగానో లేదా రాతి కట్టడంలాగానో చూడకూడదని పెద్దలు చెబుతారు.
Temple Gadapa
హిందూ సంప్రదాయంలో గుడికి వెళ్లినప్పుడు మనం చేసే ప్రతి చిన్న పని వెనుక కూడా ఒక బలమైన నమ్మకం, చక్కటి సైన్స్ దాగి ఉంటాయి. దీనిలో భాగంగానే గుడి గోపురం కనిపించగానే నమస్కారం చేసుకోవడం , దేవాలయంలోకి అడుగుపెట్టేటప్పుడు ఉండే ప్రధాన ద్వారపు గడపను(Temple Gadapa) గౌరవించడం కూడా చేస్తుంటాం.
అయితే చాలామంది తెలియక దేవాలయంలోకి అడుగుపెట్టినప్పుడు ప్రధాన గడపను(Temple Gadapa) తొక్కుతూ లోపలికి వెళ్తుంటారు. కానీ పెద్దలు మాత్రం ఆ గడపను అస్సలు తొక్కకూడదని, దానికి నమస్కరించి దాటాలని చెబుతుంటారు.
గుడి ప్రధాన ద్వారానికి ఉండే ఆ గడపను కేవలం ఒక చెక్క ముక్కలాగానో లేదా రాతి కట్టడంలాగానో చూడకూడదని పెద్దలు చెబుతారు. ఎందుకంటే ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్న దాని ప్రకారం గుడి గడప అనేది సాక్షాత్తూ లక్ష్మీదేవికి , పవిత్రమైన శక్తులకు నిలయంగా భావిస్తారు. అందుకే గడపను లక్ష్మీ స్వరూపంగా అనుకుని పూజిస్తుంటారు.
అటువంటప్పుడు ఆ గడపపై కాలు వేసి తొక్కడమంటే ఆ లక్ష్మీదేవిని, అక్కడ ఉండే పవిత్ర శక్తిని అగౌరవపరిచినట్లే అవుతుందని నమ్మకం.
అంతేకాదు ఆలయం గడప వద్ద అపారమైన ఆధ్యాత్మిక శక్తులు, ఎనర్జీ తరంగాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. గడప కింద ఉండే విద్యాయంత్రాలు, అక్కడ తిరిగే సానుకూల తరంగాలను మన పాదాలతో తొక్కి అడ్డుకోకుండా ఉండటానికే గడపను కాలితో తాకకుండా దాటాలనే నియమం పెట్టారు.
అయితే దీని వెనుక ఒక చక్కటి ప్రాక్టికల్ , ఆరోగ్య కారణం కూడా ఉంది. పూర్వం గుడి కట్టేటప్పుడు గడపలను(Temple Gadapa) గట్టి రాళ్లతో కానీ ప్రత్యేకమైన లోహాలతో కానీ తయారు చేసేవారు.
రోజూ దేవుడి దర్శనానికి వేల సంఖ్యలో వచ్చే భక్తులు ఆ గడపను తొక్కుతూ వెళ్తే, కాలక్రమేణా ఆ గడప అరిగిపోయి పాడైపోయే అవకాశం ఉంది. అందుకే ఆ నిర్మాణం దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో దానికి నమస్కరించి, తొక్కకుండా దాటాలనే ఒక చక్కటి పద్ధతిని మన పూర్వీకులు అలవాటు చేశారు.

కాబట్టి ఎప్పుడైనా గుడిలోకి వెళ్లేటప్పుడు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న గడపకు నమస్కరించి, గడపపై అస్సలు కాలు పెట్టకుండా దాటుకుంటూ లోపలికి వెళ్లాలి.
అలాగే దేవాలయానికి వెళ్లినప్పుడు కొంతమంది చేసే ఇంకొక పొరపాటు ఏంటంటే.. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆలయం వెనుక భాగాన్ని చేతులతో తాకుతుంటారు.
కానీ గుడి వెనుక భాగాన్ని రాక్షస స్థానంగా పరిగణిస్తారు, కాబట్టి ప్రదక్షిణలు చేసినపుడు వెనుక వైపు గోడలను అస్సలు తాకకూడదని పండితులు చెబుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించినప్పుడే గుడికి వెళ్లినందుకు పూర్తిగా ఫలితం దక్కుతుంది.
Suryakumar Yadav : సూర్యా భాయ్…ఇక బై బై..మళ్లీ బ్లూ జెర్సీలో కష్టమే ?





