Sleep : నిద్ర తక్కువైతేనే కాదు.. ఎక్కువైనా ప్రమాదమే..డాక్టర్లు ఏం చెబుతున్నారు?
Sleep : ఎక్కువ సమయం పడుకోవడం వల్ల శరీరంలో మెటబాలిజం పూర్తిగా మందగిస్తుంది. దీనివల్ల తిన్న ఆహారం సరిగ్గా అరగకపోవడం, క్యాలరీలు కరగకపోవడం వంటివి జరిగి చాలా ఈజీగా బరువు పెరిగిపోతారు
Sleep
రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోతే హెల్త్ పాడవుతుందని, రోజంతా నీరసంగా ఉంటుందని మనందరికీ తెలుసు. అయితే దీనికోసం చాలామంది వీలు కుదిరినప్పుడల్లా, సెలవు దొరికినప్పుడల్లా గంటల తరబడి పడుకోవడానికి ఇష్టపడుతుంటారు. కానీ, నిద్ర(Sleep) తక్కువైతే ఎంత ప్రమాదమో.. అవసరానికి మించి ఎక్కువ నిద్రపోవడం కూడా అంతే ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఏ పనైనా సరే హద్దుల్లో ఉన్నప్పుడే అందం, ఆరోగ్యం అని తెలిసిందే. అలాగే నిద్ర కూడా బాడీకి ఎంత అవసరమో.. అంతే మోతాదులోనే నిద్రపోవాలి. సాధారణంగా ఒక వ్యక్తికి రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర సరిపోతుంది. కానీ కొంతమంది ప్రతిరోజూ తొమ్మిది నుంచి పది గంటల కంటే ఎక్కువ సమయం బెడ్ పైనే గడుపుతుంటారు.
ఇలా ఎక్కువ సమయం పడుకోవడం వల్ల శరీరంలో మెటబాలిజం పూర్తిగా మందగిస్తుంది. దీనివల్ల తిన్న ఆహారం సరిగ్గా అరగకపోవడం, క్యాలరీలు కరగకపోవడం వంటివి జరిగి చాలా ఈజీగా బరువు పెరిగిపోతారు. బాడీలో కదలికలు తగ్గిపోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిలో తేడాలు వస్తాయి. దీంతో టైప్-2 డయాబెటిస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి.
ఎక్కువ నిద్ర(Sleep) ఎఫెక్ట్ కేవలం బరువు మీదే కాదు, గుండె ఆరోగ్యం మీద కూడా పడుతుంది. ఎక్కువ గంటలు అలాగే పడుకుని ఉండటం వల్ల రక్తప్రసరణలో ఇబ్బందులు తలెత్తుతాయని….దీనివల్ల గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది.
అలాగే, ఎక్కువ నిద్రపోయి లేచిన తర్వాత హెడేక్ రావడం గమనించే ఉంటారు. మెదడులోని నరాల ప్రసారకాలు అంటే న్యూరోట్రాన్స్మిటర్స్ అయిన సెరటోనిన్ లెవెల్స్‌లో వచ్చే మార్పుల వల్ల ఇలా తలనొప్పి వస్తుంది. దీనివల్ల రోజంతా బద్ధకం, తల భారంగా అనిపించడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
ఇక మానసిక ఆరోగ్య విషయానికి వస్తే, ఎక్కువ నిద్రపోవడమనేది డిప్రెషన్ యొక్క ప్రాథమిక లక్షణం కావొచ్చు లేదా దానివల్ల డిప్రెషన్ మరింత ఎక్కువ అవ్వొచ్చు. ఎక్కువ సమయం పడక గదికే పరిమితం అవ్వడం వల్ల నలుగురితో మాట్లాడటం తగ్గుతుంది.
అంతేకాదు ఎక్కువ నిద్రపోవడం వల్ల జ్ఞాపకశక్తి మందగించడం, మెదడు పనితీరు నెమ్మదించడం వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.శారీరక శ్రమ కూడా శూన్యమవుతుంది.

కాబట్టి, నిద్రను కేవలం ఒక విశ్రాంతిగా, బాడీని ) రీఫ్రెష్ చేసేదిగా మాత్రమే చూడాలి కానీ దాన్నే ఒక అలవాటుగా మార్చుకోకూడదు. ఒకవేళ రాత్రి 8 గంటలు నిద్ర(Sleep)పోయినా సరే, పగలు మళ్లీ నిద్ర వస్తోందంటే అది శరీరంలో ఏదైనా అంతర్గత ఆరోగ్య సమస్యకు సిగ్నల్ కావచ్చు.
అందుకే ఎప్పుడూ సరైన సమయానికి పడుకుని, ఒకే సమయానికి లేచేలా ఒక పక్కా స్లీప్ షెడ్యూల్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. రోజూ కాస్త ఫిజికల్ యాక్టివిటీ , మంచి ఫుడ్ తీసుకుంటే నిద్ర కంట్రోల్లోకి వస్తుంది.
Laser Hair Removal : లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ వస్తుందా? నల్లగా ఉన్న వారికి ఇది సేఫేనా?





