Just TelanganaLatest News

Hyderabad : డేంజర్‌ జోన్‌లో హైదరాబాద్‌..ప్రపంచంలోని హాటెస్ట్ నగరాల జాబితాలో చోటు

Hyderabad : ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన వేడి వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే టాప్ 30 హై రిస్క్ నగరాల లిస్ట్‌ను ఆక్స్‌ఫర్డ్ తయారు చేయగా.. ఆ లిస్టులో హైదరాబాద్‌కు స్థానం దక్కడం నిజంగా షాకింగ్ విషయమే

Hyderabad

హైదరాబాద్ వాసులకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ఒక షాకింగ్ వార్నింగ్‌ను జారీ చేసింది. భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపుపొందిన హైదరాబాద్, ఇప్పుడు తీవ్రమైన ఎండలు ,వేడి వల్ల వచ్చే అనారోగ్య సమస్యల ముప్పులో పడిపోయింది.

మూవింగ్ బియాండ్ ఎక్స్‌పోజర్.. ఎ గ్లోబల్లీ కంపేరబుల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ హీట్ రిస్క్ అసెస్‌మెంట్ ఇన్ సిటీస్ పేరుతో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలోని 205 మెయిన్ సిటీలపై ఒక స్పెషల్ రీసెర్చ్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన వేడి వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే టాప్ 30 హై రిస్క్ నగరాల లిస్ట్‌ను ఆక్స్‌ఫర్డ్ తయారు చేయగా.. ఆ లిస్టులో హైదరాబాద్‌(Hyderabad కు స్థానం దక్కడం నిజంగా షాకింగ్ విషయమే. ఈ హీట్ వల్నరబిలిటీ ఇండెక్స్‌లో హైదరాబాద్ సిటీ మొత్తం 0.68 వేడి ప్రమాద స్కోరును నమోదు చేసింది.

ఇది కైరో, మనీలా వంటి సిటీల డేంజర్ జోన్ కంటే కొద్దిగా బెటర్‌గా ఉన్నా కూడా.. బ్యాంకాక్, హనోయ్ వంటి సిటీల కంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఈ ఇండెక్స్ అనేది కేవలం ఎండ తీవ్రతనే కాకుండా.. సిటీలో ఉన్న పచ్చదనం, ఏసీ లేదా కూలింగ్ సదుపాయాలు, ప్రజల జీవన విధానాన్ని బట్టి లెక్కగడతారు.

హైదరాబాద్‌(Hyderabad)లో చాలా మందికి సరైన గ్రీనరీ, కూలింగ్ మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్లే వేడి సంబంధిత అనారోగ్యాలు వేగంగా పెరుగుతున్నాయని రిపోర్ట్ స్పష్టం చేసింది. దీనికి తగ్గట్లే ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 5 వరకు సిటీలో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైన రోజులు ఏకంగా 47 ఉన్నాయి, ఇది గత పదేళ్లలోనే అత్యధిక రికార్డ్ అని తేలింది.

ఇక ఈ ఆక్స్‌ఫర్డ్ రిపోర్ట్‌లో భారత్‌లోని అహ్మదాబాద్, నాగ్‌పూర్, మదురై సిటీలు టాప్ లిస్ట్‌లో ఉండగా.. ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

అసలు ఈ హీట్ వల్నరబిలిటీ ఇండెక్స్ అంటే ఒక ప్రాంతంలోని ప్రజలు తీవ్రమైన వేడిని ఎంత వరకు తట్టుకోగలరో, ఎంత ప్రమాదంలో ఉన్నారో అంచనా వేసే ఒక ముఖ్యమైన ఇండెక్స్.

Hyderabad
Hyderabad

ఈ సూచికలో కేవలం బయట నమోదయ్యే టెంపరేచర్లు మాత్రమే కాకుండా.. ఒక నగరంలో అక్కడి ప్రజలకు అందుబాటులో ఉన్న పచ్చదనం ఎంత, ఎండ నుంచి తట్టుకోవడానికి ఏసీ వంటి కూలింగ్ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయని చూస్తారు.

అంతేకాకుండా అక్కడి ప్రజల జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాలను కూడా దీనిలో పరిగణనలోకి తీసుకుంటారు. అయితే దురదృష్టవశాత్తూ హైదరాబాద్‌లో ఎక్కువ శాతం ప్రజలకు పచ్చదనం, శీతలీకరణ సదుపాయాలు చాలా తక్కువగా ఉండటంతో వేడి సంబంధిత ఆరోగ్య సమస్యల ముప్పు రోజురోజుకూ పెరుగుతోందని ఆక్స్‌ఫర్డ్ అధ్యయనం హెచ్చరించింది

Hair Care : పొడవైన జుట్టు కోసం నేచురల్ టిప్స్.. పూలతోనే హెయిర్ కేర్

Related Articles

Back to top button