HealthLatest News

Hair Care : పొడవైన జుట్టు కోసం నేచురల్ టిప్స్.. పూలతోనే హెయిర్ కేర్

Hair Care : జుట్టు సంరక్షణ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది మందార పువ్వు. దీనిలోని పోషకాలు, అమైనో యాసిడ్స్ వెంట్రుకలన్నీ ఒత్తుగా ఎదగడానికి తోడ్పడతాయి

Hair Care

జుట్టు అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి అమ్మాయిలు రకరకాల పూలతో జడను అలంకరించుకోవడం మన సంప్రదాయం. అయితే కేవలం అలంకరణకే కాకుండా, తలవెంట్రుకలు పెరగడానికి కూడా ఈ పూలు అద్భుత ఔషధాలుగా పనిచేస్తాయని హెయిర్ కేర్(Hair Care) ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. వీటితో సిద్ధం చేసే ప్యాక్స్, ఆయిల్స్ కేశాలకు అమోఘమైన బలాన్ని ఇచ్చి సిల్కీగా మారుస్తాయి.

జుట్టు సంరక్షణ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది మందార పువ్వు. దీనిలోని పోషకాలు, అమైనో యాసిడ్స్ వెంట్రుకలన్నీ ఒత్తుగా ఎదగడానికి తోడ్పడతాయి. మందార రేకులను పేస్ట్‌లా చేసి, కొద్దిగా పెరుగు, కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి తలకు ప్యాక్‌లా వేసుకోవచ్చు. లేదా ఈ రేకులను నూనెలో మరిగించి రెగ్యులర్‌గా వాడినా కుదుళ్లు స్ట్రాంగ్ అవుతాయి.

మందార పువ్వులలో ఉండే ఒక రకమైన జిగురు గుణం జుట్టుకు నేచురల్ కండిషనర్‌లా ఉపయోగపడుతుందని కొన్ని సైన్స్ జర్నల్స్ కూడా చెబుతున్నాయి. అలాగే మార్కెట్లో ఎప్పుడూ దొరికే బంతిపూలు కూడా స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫీచర్స్ వల్ల చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. బంతిపూల నూనెను క్యారియర్ ఆయిల్స్‌తో కలిపి సీరంలా వాడుకుంటే స్కాల్ప్ హెల్దీ ఉంటుంది.

రోడ్డు పక్కన కనిపించే  బిళ్ల గన్నేరు పూలను చాలామంది లైట్ తీసుకుంటారు కానీ.. ఇవి హెయిర్ ఫాల్ ఆపడానికి బాగా పనిచేస్తాయి. ఈ రేకులను కొబ్బరి నూనెలో కానీ ఆముదంతో కానీ మరిగించి వాడటం వల్ల రూట్స్ బలాన్ని పుంజుకుంటాయి.

మందార, బిళ్ల గన్నేరు, పెరుగు, అలోవెరా కలిపి వీక్లీ వన్స్ మాస్క్ వేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది. ఈ పూల వాటర్ కూడా మంచి కండిషనర్‌లా పనిచేస్తుంది.

మరోవైపు చామొమైల్ పూల రసం లేదా టీని హెడ్ బాత్‌ తర్వాత హెయిర్ వాష్‌కు ఉపయోగిస్తే స్కాల్ప్‌పై వచ్చే మంట, దురద వంటి సమస్యలు తగ్గి, చుండ్రు మాయమవుతుంది.

Hair Care
Hair Care

ఇక మల్లెపూల విషయానికొస్తే, ఇవి జుట్టుకు నేచురల్ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి. మల్లెపూల ఆయిల్ వాడటం వల్ల డ్రై హెయిర్ సమస్య తగ్గి కేశాలు సాఫ్ట్‌గా మారతాయి.

అలాగే మంచి సువాసన ఇచ్చే లిల్లీ పూలు కూడా జుట్టును ఒత్తుగా మార్చడానికి దోహదపడతాయి.

అయితే ఈ ఫ్లవర్స్ అన్నీ ఆర్గానిక్ అయినా, కొందరి బాడీ తత్వానికి ఇవి పడకపోవచ్చు. అందుకే హెయిర్(Hair Care) ప్రొడక్ట్స్ వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం లేదా స్కిన్ డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

Mega House : మెగా రాయల్ హౌస్ ఇంటీరియర్స్ చూస్తే మైండ్ బ్లాకే ..జూబ్లీహిల్స్ ఇంద్రభవనం విశేషాలు

Related Articles

Back to top button