Just InternationalJust PoliticalLatest News

Pakistan : సింధు నది బిడ్డలమంటూ పాక్ సరికొత్త రాగం.. ఆ 3 కారణాలతోనే రూట్ మార్చిందా?

Pakistan : ఇన్నాళ్లూ భారత్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము అరబ్బులు, టర్కీ లేదా పర్షియా ముస్లింల వారసులమని చెప్పుకుంటూ వస్తున్న పాక్.. ఇప్పుడు అకస్మాత్తుగా రూట్ మార్చేసింది.

Pakistan

పాకిస్తాన్ ఇప్పుడు ఒక విచిత్రమైన అస్తిత్వ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్నట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ భారత్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము అరబ్బులు, టర్కీ లేదా పర్షియా ముస్లింల వారసులమని చెప్పుకుంటూ వస్తున్న పాక్.. ఇప్పుడు అకస్మాత్తుగా రూట్ మార్చేసింది.

ఒకప్పుడు తాము చెప్పడానికి కూడా ఇష్టపడని ప్రాచీన భారతీయ హిస్టరీని, సింధు లోయ నాగరికతను పాకిస్తాన్‌కు చెందిన చరిత్రగా చూపించుకోవడానికి తెగ తాపత్రయపడుతోంది. అప్పుడు ఇస్లాం పునాదులపై ఏర్పడిన ఆ దేశానికి అంతర్జాతీయంగా చట్టబద్ధత కల్పించుకోవడంతో పాటు.. ఇప్పుడు అంతరించిపోయిన పురాతన కల్చర్‌ను తమ నేషనల్ ఐడెండిటీగా మార్చుకునే ప్రయత్నాలను మొదలుపెట్టింది.

గతంలో జనరల్ జియా ఉల్ హక్ పగ్గాలు చేపట్టిన సమయంలో పాకిస్తాన్‌(Pakistan)లో హిస్టరీని పూర్తిగా మార్చేశారు. పాఠశాలల పుస్తకాలలో కూడా బలవంతంగా అరబ్ సంస్కృతిని దట్టించి, అక్కడి ముస్లింల పూర్వీకులంతా కూడా ఒకప్పుడు హిందువులేననే నిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నాన్ని చేశారు.

కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏకంగా హరప్పా, మొహెంజో-దారో, తక్షశిల వంటి ప్రాచీన నగరాలతో పాటు, సంస్కృత భాష, చాణక్యుడు, వ్యాకరణ కర్త పాణిని, పురుషోత్తముడు (పోరస్) అందరూ కూడా తమ పూర్వీకులేనంటూ సరికొత్త కథలను తెరమీదకు తెస్తున్నారు. అసలు సంస్కృతం భారతదేశానిదే కాదని, అది పాకిస్తాన్ ప్రాంతానికి చెందిన భాష అని కూడా వాదిస్తున్నారు.

పాక్ అకస్మాత్తుగా ఎందుకు ఈ కొత్త రాగం అందుకుందనే దానికి బలమైన కారణాలున్నాయి. మొదటిది.. అరబ్ దేశాలు అంటే సౌదీ, యూఏఈ వంటివి ఇప్పుడు పాకిస్తాన్‌ను తమతో సమానంగా చూడటం కాదు కదా కనీసం పట్టించుకోవడం లేదు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన దేశంగా కూడా పాక్‌ను దూరం పెడుతున్నాయి. దీంతో తాము అరబ్బులం అనే పాకిస్తాన్ భ్రమలు తొలిగిపోయినట్లు అయింది.

రెండోది ప్రపంచవ్యాప్తంగా తాము టెర్రరిస్ట్ దేశంగా ముద్రపడటంతో, తమ ఇమేజ్‌ను మార్చుకోవడానికి తమది పురాతన శాంతియుత సింధు నాగరికత అంటూ ప్రపంచానికి చెప్పుకోవాలని చూస్తోంది.

మూడోది మాత్రం అతి ముఖ్యమైనది. సింధు నది నీళ్ల కోసం భారతదేశంతో వివాదాలు పెరుగుతున్న సమయంలో, ఆ నది ప్రవహించే ప్రాంతం తమదే కాబట్టి సింధు బిడ్డలం అయిన తమకే ఆ నీటిపై పూర్తి హక్కు ఉందనే వాదనను అంతర్జాతీయ తెర మీదకు తెస్తూ భయంకరమైన ప్లాన్ వేసింది.

ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా తమ పూర్వీకులు హిందువులేనని ఇటీవల బహిరంగంగానే ఒప్పుకోగా, సమాచార మంత్రి అత్తావుల్లా తరార్.. తామంతా కూడా సింధు నది బిడ్డలం అంటూ వరుస ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.

Pakistan
Pakistan

ముస్లింలు, హిందువులు వేర్వేరు అంటూ ద్విజాతి సిద్ధాంతంతో పుట్టిన పాకిస్తాన్(Pakistan).. ఇప్పుడు లాహోర్‌లోని యూనివర్సిటీల్లో సంస్కృత కోర్సులను పెట్టడం, వసంత పంచమి వేడుకలను జరుపుకోవడం అంతెందుకు చివరకు కథక్ నృత్యాలను కూడా ఆదరించడం చూస్తుంటే వారి వైఖరి అందరికీ క్లియర్‌గా అర్థమవుతోంది.

తమ అసలైన మూలాలను దాచిపెడుతూ ఇన్నాళ్లూ.. అరబ్ గుర్తింపు కోసం ఆరాటపడి విఫలమైన పాకిస్తాన్(Pakistan).. ఇప్పుడు అందరి ముందు ఒక నకిలీ ప్రాచీన అస్తిత్వాన్ని సృష్టించుకోవడానికి నానా తంటాలు పడటం చూసి యావత్ ప్రపంచం విస్తుపోతోంది.

Salman Khan : సల్మాన్ కేసులో బిగ్ ట్విస్ట్..అప్రూవర్‌గా మారతానంటున్న బిష్ణోయ్

Related Articles

Back to top button