Just TelanganaLatest News

IPS Uday Krishna : ఉదయ్ కృష్ణారెడ్డిది డ్రామానా? ఉన్నత హోదాకి చేరి నైతిక విలువలు మరచిపోతే ఇలాగే ఉంటుందా?

IPS Uday Krishna : ఎవరైనా సరే కష్టపడి ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకోవడం ఎంత ముఖ్యమో, అక్కడకు వెళ్లాక ఆ హోదాకు తగ్గట్లుగా నడుచుకోవడం, అలాగే దానిని కాపాడుకోవడం అంతే ముఖ్యం అని తెలుసుకోవాలి.

IPS Uday Krishna

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా ఉత్కంఠ రేపుతున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి(IPS Uday Krishna) వ్యవహారంలో.. ఈరోజు మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను లైంగికంగా వేధించడంతో పాటు ఆమె ప్రైవేట్ వీడియోలను ఆమె భర్తకు పంపించి ఆమెను తీవ్రంగా బెదిరించినట్లు కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ తీవ్రమైన ఆరోపణలతో ఉదయ్ సస్పెన్షన్‌కు గురికావడం, ఆ తర్వాత తాను ఏ తప్పూ చేయలేదని చెబుతూ సోమవారం ఆత్మహత్యాయత్నం చేయడంతో ఒక్కసారిగా ఈ కేసు యూ టర్న్ తిరిగినట్లు అయింది.

అయితే, ఆయన సూసైడ్ ఎటెంప్ట్ వెనుక ఉన్న అసలు నిజాలను వైద్య పరీక్షలు బయటపెట్టాయి. సోమవారం ఉదయం ఆత్మహత్యాయత్నం చేశారనే ప్రచారంతో కుటుంబ సభ్యులు ఆయనను ఎస్‌ఆర్‌ నగర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ, ఆయన బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షించిన డాక్టర్లు, బ్లడ్‌లో ఎలాంటి విషపదార్థాలు లేవని క్లారిటీ ఇచ్చారు.

కేవలం పోలీస్ వర్గాలలోనూ, ప్రజలలోనూ సానుభూతి పొందడం కోసమే ఫుల్‌గా లిక్కర్ తాగేసి ఈ డ్రామాకు తెరలేపినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అలా ఆల్కహాల్ మత్తులోనే సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. తోటి మహిళా ఐపీఎస్‌తో తనకు ఏడాదిగా సంబంధం ఉందని, కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై లేనిపోని ఆరోపణలు చేశారంటూ ఉదయ్ నిన్న తన లెటర్‌లో చెప్పుకొచ్చారు.

మరోవైపు పోలీసులు ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ప్రస్తుతం జాతీయ పోలీస్ అకాడమీ అధికారులు దీనిపై ఇంటర్నల్‌గా ఎంక్వైరీ జరుపుతుండగా, అత్తాపూర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు కృష్ణారెడ్డి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని టెక్నికల్‌గా కూడా లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

కాగా ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో కానిస్టేబుల్‌గా పనిచేసి, కష్టపడి చదివి ఐపీఎస్‌గా సెలక్ట్ అయి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎంతో కష్టపడి.. దేశంలోనే అత్యున్నతమైన ఐపీఎస్ హోదాకు ఉదయ్ చేరుకోవడం నిజంగా ప్రశంసనీయమైన విషయమే.

కానీ,ఎవరైనా సరే.. ఎలాంటి వ్యక్తి అయినా సరే కష్టపడి ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకోవడం ఎంత ముఖ్యమో, అక్కడకు వెళ్లాక ఆ హోదాకు తగ్గట్లుగా నడుచుకోవడం, అలాగే దానిని కాపాడుకోవడం అంతకంటే వెయ్యి రెట్లు ముఖ్యం అనేదానికి ఈ సంఘటన ఎంతోమందికి ఉదాహరణగా నిలుస్తోంది.

సింపుల్‌గా చెప్పాలి అంటే తను అనుకున్న లక్ష్యం కోసం ఎన్ని కష్టాలైనా అనుభవించి గోల్‌కు రీచవ్వడం ఎలా అనే విషయంలో మొన్నటి వరకూ ఒక రోల్ మోడల్‌గా అందరి ముందు నిలబడ్డ ఉదయ్..ఇప్పుడు తాను సాధించుకున్న స్థానాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఎలా ఉంటుందో చూపించడానికి ఒక ఎగ్జాంపుల్‌గా మారిపోయారు.

IPS Uday Krishna
IPS Uday Krishna

ఇక సొసైటీ పరంగా చూస్తే ఒక ట్రైనీ ఐపీఎస్ ఇలాంటి తీవ్రమైన నేరారోపణల్లో చిక్కుకోవడం నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. చట్టాన్ని రక్షించాల్సిన అధికారి స్థానంలో ఉంటూ కూడా, తోటి మహిళా అధికారి పట్ల వేధింపులకు పాల్పడటం, ఆపై సింపతీ కోసం డ్రామాలకు తెరలేపడం వల్ల సివిల్ సర్వీసెస్ వ్యవస్థపై ప్రజలకు ఉన్న గౌరవం కూడా సన్నగిల్లే ప్రమాదం ఉంది.

మొత్తంగా ఎంత గొప్ప గొప్ప విజయాలు సాధించినా వారిలో క్రమశిక్షణ, నైతిక విలువలు లేకపోతే ఆ సాధించిన విజయం ..క్షణాల్లో బూడిదలో పోసిన పన్నీరుగా అవుతుందని ఉదయ్ ఉదంతం నేటి తరానికి ఒక హెచ్చరికను పంపినట్లు అయింది.

LemonGrass Tea : లెమన్‌గ్రాస్ హెర్బల్ టీ వల్ల ఇన్ని ప్రయోజనాలా? మరి ఎవరెవరు దీనికి దూరంగా ఉండాలి?

Related Articles

Back to top button