Thalliki Vandanam : నేటి నుంచే అకౌంట్లలోకి తల్లికి వందనం డబ్బులు.. కొత్త అడ్మిషన్లు ఉన్నవారికి ఎప్పుడు వస్తాయ్?
Thalliki Vandanam : గతంలో కేవలం సిటీల్లో పనిచేసే అంగన్వాడీ వర్కర్ల పిల్లలకు మాత్రమే ఈ పథకం ఇచ్చేవారు. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి పల్లెల్లో పనిచేసే అంగన్వాడీల పిల్లలకు కూడా దీనిని వర్తింపజేస్తున్నారు.
Thalliki Vandanam
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తల్లికి వందనం(Thalliki Vandanam) పథకం డబ్బులు ఈ రోజు నుంచే లబ్ధిదారుల అకౌంట్లలో పడబోతున్నాయి. బడికి వెళ్లేవారి నుంచి ఇంటర్ చదివే స్టూడెంట్స్ వరకు, అర్హులైన తల్లుల బ్యాంక్ అకౌంట్లలో రూ. 13 వేల చొప్పున వేస్తున్నారు.
ఈ రోజు నుంచి మొదలవుతున్న ఈ ప్రాసెస్ జూలై 24 వరకు విడతల వారీగా సాగుతుంది. ఒకేసారి కాకుండా కేటగిరీల వారీగా ఈ డబ్బులను బ్యాంకుల్లో వేస్తారు. అయితే ఇదే టైమ్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి, వారి వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ వ్యాప్తంగా సుమారు 67 లక్షల 47 వేల మందికి ఈ పథకం వర్తిస్తోంది. దీనివల్ల 42 లక్షల 70 వేల మందికి పైగా తల్లులకు లబ్ధి చేకూరబోతోంది. దీనిలో భాగంగా మొదటి దఫా కింద అన్ని వివరాలు సరిగ్గా ఉన్న 64 లక్షల కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్‌కు సంబంధించి, 41 లక్షల మందికి పైగా తల్లుల ఖాతాలో ఈరోజు డబ్బులు జమ కాబోతున్నాయి.
ఈ పథకం కోసం కూటమి ప్రభుత్వం ఏకంగా రూ. 10,120 కోట్ల భారీ మొత్తాన్ని కేటాయించింది. అయితే మీ పథకం స్టేటస్ ఏంటి అని తెలుసుకోవడానికి లబ్ధిదారులు మన మిత్ర వాట్సాప్ లేదా లీప్ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఇక కొత్తగా బడుల్లో చేరిన పిల్లలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయడానికి ఏపీ ప్రభుత్వం డేట్లు ఫిక్స్ చేసింది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో కొత్తగా చేరిన విద్యార్థులకు ఆగస్టు 30వ తేదీ నాటికి డబ్బులు వేస్తారు. ఈ కొత్త అడ్మిషన్ల ప్రక్రియ అంతా ఆగస్టు 25 లోపు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ పథకానికి సంబంధించి ఏమైనా అనుమానాలు, అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 3 వరకు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లొచ్చు. దరఖాస్తులన్నీ చెక్ చేసి ఆగస్టు 10వ తేదీన సప్లిమెంటరీ జాబితాను బయటకు తీస్తారు. ఆ తర్వాత అర్హులైన వారందరికీ కూడా ఆగస్టు 30వ తేదీన డబ్బులు వేస్తారు. ఇంకో మంచి విషయం ఏంటంటే.. గతంలో కేవలం సిటీల్లో పనిచేసే అంగన్వాడీ వర్కర్ల పిల్లలకు మాత్రమే ఈ పథకం ఇచ్చేవారు. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి పల్లెల్లో పనిచేసే అంగన్వాడీల పిల్లలకు కూడా దీనిని వర్తింపజేస్తున్నారు.

ప్రస్తుతం అర్హులైన వారి అకౌంట్లలో డబ్బులు పడుతున్న సమయం కాబట్టి సైబర్ నేరగాళ్లు జనాలను బురిడీ కొట్టించే ప్రమాదం ఉందని అధికారులు అలర్ట్ చేస్తున్నారు. మీ అకౌంట్‌లో తల్లికి వందనం(Thalliki Vandanam) డబ్బులు పడ్డాయనో, కేవైసీ అప్‌డేట్ చేయాలనో, లేదా ఆధార్ కార్డు లింక్ అవ్వలేదనో చెబుతూ ఫోన్లకు వచ్చే ఫేక్ మెసేజ్‌లను, అనుమానాస్పద లింకులను ఎవరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదు.
డబ్బులు పడటంలో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే కంగారు పడకుండా డైరెక్టుగా మీ ఊరిలోని గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లాలి. లేదంటే మీ పిల్లలు చదివే స్కూలులో హెచ్‌ఎమ్‌ని గానీ, సిబ్బందిని గానీ కలవాలి. అలాగే తెలీని వ్యక్తులకు ఫోన్ నంబర్లు, ఓటీపీలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇస్తే మోసపోతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Mentality : ఎదిగేవారిని తొక్కే మనస్తత్వం.. అలాంటివారికి మీరిచ్చే సమాధానం ఇలా ఉండాలి..





