Family Register Certificate : త్వరలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్.. ఇది ఎందుకు? ఎవరికి ఉపయోగం?
Family Register Certificate : ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ ఎవరికైనా అవసరమైనప్పుడు మీ సేవ కేంద్రాలు, మొబైల్ యాప్, వాట్సప్ ద్వారా కొంత ఫీజు చెల్లించి అప్లై చేసుకోవచ్చు.
Family Register Certificate
గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కోసం లబ్ధిదారుల ఎంపిక, ఫ్యామిలీ వివరాల అథారిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త డెసిషన్ తీసుకుంది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అఫీషియల్‌గా ఫ్యామిలీ రిజిస్టర్ తయారు చేసి, మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు వారి కుటుంబ రిజిస్టర్ సర్టిఫికెట్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
ఇప్పటి వరకు స్కీమ్స్ అమలు చేసే సమయంలో అలాగే ఇతర ప్రభుత్వ అవసరాల కోసం ఫ్యామిలీలో ఎంతమంది సభ్యులు ఉన్నారనే దానికి ప్రోపర్ అఫీషియల్ సర్టిఫికేషన్ డాక్యుమెంట్స్ లేక ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యకు పర్మినెంట్‌గా పరిష్కారం చూపిస్తూ.. తమ కుటుంబ సభ్యుల వివరాలతో అధికారిక సర్టిఫికెట్ పొందే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.
ఈ ఫ్యామిలీ రిజిస్టర్ నిర్వహణ, సర్టిఫికెట్ల జారీ వంటి బాధ్యతలను రేవంత్ సర్కార్.. రెవెన్యూ శాఖకు అప్పగించింది. పౌర సరఫరాల శాఖ వద్ద ఉన్న రేషన్ కార్డుల డేటాను ప్రామాణికంగా తీసుకుని ఈ డిజిటల్ రిజిస్టర్‌ను తయారు చేస్తారు. ప్రతీ కుటుంబానికి స్పెషల్‌గా ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్(Family Register Certificate) నంబర్ (FRIN-ఫ్రిన్) ఇస్తారు.
దీని కోసం ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు నెంబరునే ఫ్రిన్ నెంబరుగా కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ రూపంలో ఉండే ఈ రిజిస్టర్లో కుటుంబ పెద్ద పేరు, సభ్యులందరి పేర్లు, వారి ఏజ్, యజమానితో ఉన్న రిలేషన్, ఆధార్ నెంబర్ , చిరునామా వంటి పూర్తి ఇన్ఫర్మేషన్ పొందుపరిచి ఉంటుంది.
ఈ సర్టిఫికెట్ ఎవరికైనా అవసరమైనప్పుడు మీ సేవ కేంద్రాలు, మొబైల్ యాప్, వాట్సప్ ద్వారా కొంత ఫీజు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన రెండు రోజుల్లోనే సంబంధిత మండల తహసీల్దార్ డిజిటల్ సైన్‌తో మీ సేవ ద్వారా సర్టిఫికెట్ జారీ అవుతుంది.
అయితే ఈ సర్టిఫికెట్ కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఫ్యామిలీ మెంబర్స్ వివరాల నిర్ధారణకు మాత్రమే ఉపయోగపడుతుందని, దీనిని ఆస్తులపై హక్కులు పొందడానికి లేదా లీగల్ హెయర్ (వారసత్వ) ధ్రువీకరణకు ఉపయోగించడానికి వీలుపడదని గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది.

ఇప్పటికే ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలలో ఇది అమలులో ఉండగా.. తెలంగాణ కూడా ఈ డిజిటల్ ఫ్యామిలీ డేటాబేస్‌ను రెడీ చేస్తోంది. ఈ సర్వీసును మీ సేవ రెవెన్యూ విభాగంలో చేర్చడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రెడీ చేయాలని రేవంత్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
మొత్తంగా భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల అమలులో ఈ సర్టిఫికెట్ చాలా కీలకంగా మారనుందని తెలుస్తుంది. అంతేకాకుండా, ప్రభుత్వం నిర్దేశించిన వివిధ రకాల అఫీషియల్ సర్టిఫికేషన్ ప్రాసెస్‌లో ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్(Family Register Certificate) నిరుపేదలకు, సామాన్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.





