Just LifestyleLatest News

Bad Smell From Kitchen : కిచెన్ బ్యాడ్ స్మెల్‌కి పర్ఫెక్ట్ చెక్ మేట్..వంటగదిని రిఫ్రెషింగ్‌గా మార్చే చిట్కాలు..

Bad Smell From Kitchen : కిచెన్‌లో గాలి వెలుతురు సరిగ్గా వచ్చేలా మంచి వెంటిలేషన్ ఏర్పాటు చేసుకోవడం, ఎప్పటికప్పుడు శుభ్రత పాటించడం ముఖ్యం.

Bad Smell From Kitchen

రకరకాల వంటలు చేయడం, అవీ ఇవీ కట్ చేయడం వల్ల చాలామంది కిచెన్‌లో ముఖ్యంగా సింక్ దగ్గర కొంచెం స్మెల్ వస్తుంటుంది. దీనికి తోడు అక్కడే డస్ట్ బిన్ పెడుతుండటం వల్ల వన్ డే ఉన్నా కూడా దుర్వాసన వస్తుంటుంది. మన ఇంట్లోనే ఉండే కొన్ని నేచురల్ వస్తువులతో ఈ వాసనలను ఎలా తరిమికొట్టవచ్చో చూద్దాం.

కిచెన్‌లో ఉండే బేకింగ్ సోడా కేవలం వంటలకే కాకుండా ఇతర చెడు వాసనలను పీల్చుకోవడానికి బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా వంట చేసేటప్పుడు కూర మాడిపోయినా , ఘాటైన వాసనలు వచ్చినా సరే బేకింగ్ సోడాను ఒక చిన్న గిన్నెలో పోసి కిచెన్ ప్లాట్‌ఫామ్‌పైన కానీ స్టవ్ పక్కన కానీ ఉంచాలి. ఇది గాలిలో వ్యాపించే ఎలాంటి దుర్వాసనను అయినా సరే క్షణాల్లో పీల్చేసుకుంటుంది.

నాన్ వెజ్ కడిగినపుడు, వండినపుడు సింక్ దగ్గర, స్టౌ దగ్గర నీచు వాసన అంత త్వరగా పోదు. అటువంటప్పుడు మూడు చిన్న గిన్నెల్లో వెనిగర్ పోసి వంటగదిలో మూడు వేర్వేరు మూలల్లో 10 – 15 నిమిషాల పాటు ఉంచితే ఆ వాసన తగ్గిపోతుంది.

ఒకవేళ ఆ నీచు వాసన మరీ ఎక్కువగా ఉంటే కనుక, ఒక వెడల్పాటి పాత్రలో నీళ్లు, వెనిగర్, కొన్ని నిమ్మతొక్కలు వేసి సన్నని సెగపై వేడి చేయాలి. అలా మరిగినపుడు నుంచి వచ్చే ఆవిర్లు కిచెన్‌లోని దుర్వాసనను పూర్తిగా తుడిచిపెట్టేస్తాయి.

వంటగదిలో వర్క్ పూర్తయ్యాక సింక్ క్లీన్ చేశాక కూడా అలాగే చెత్త పారబోసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ అలాగే ఉండిపోతుంది. దీనికోసం ఒక గిన్నె నీటిలో కమలా తొక్కలు, దాల్చినచెక్క ముక్కలు వేసి సిమ్‌లో ఐదు నిమిషాలు మరిగించాలి. ఆ స్మెల్‌కు కిచెన్ అంతా ఒక రిఫ్రెషింగ్ సువాసనతో నిండిపోతుంది.

Bad Smell From Kitchen
Bad Smell From Kitchen

అలాగే నిమ్మకాయతో మనమే హోమ్‌మేడ్ స్ప్రే తయారు చేసుకోవచ్చు. ఒక పాత్రలో వేడి నీళ్లు తీసుకుని దానిలో నిమ్మరసం పిండి, ఆ తొక్కలను కూడా దానిలోనే వేశాక కాసేపు అలాగే ఉంచి చల్లారనివ్వాలి. ఈ నీటిని ఒక స్ప్రే బాటిల్‌లో పోసి కిచెన్ అంతా స్ప్రే చేస్తే కిచెన్ అంతా ఫ్రెష్‌గా మారుతుంది.

ఇవే కాకుండా యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క వంటి మసాలా దినుసులను నీటిలో వేసి బాగా బాయిల్ చేసి చల్లార్చాలి. ఈ నీటిని స్ప్రే బాటిల్‌లో పోసి నేచురల్ రూమ్ ఫ్రెష్‌నర్ లాగా వాడుకోవచ్చు. వీటితో పాటు కిచెన్‌లో గాలి వెలుతురు సరిగ్గా వచ్చేలా మంచి వెంటిలేషన్ ఏర్పాటు చేసుకోవడం, ఎప్పటికప్పుడు శుభ్రత పాటించడం చాలా ముఖ్యమని గుర్తించాలి.

Egg Freezing : పెళ్లి లేట్ అయినా నో టెన్షన్.. ఎగ్ ఫ్రీజింగ్‌కు క్రేజ్ ఎందుకు పెరుగుతుంది?

Related Articles

Back to top button