Philosophy : పుస్తకాల్లో చదివితే సరిపోదు.. లైఫ్‌స్టైల్‌నే మార్చేసే 10 సూత్రాలు
Philosophy : ఒక గొప్ప థాట్‌ను అర్థం చేసుకోవడానికి, దాన్ని మన నిజ జీవితంలో అప్లై చేస్తూ బతకడానికి మధ్య చాలా పెద్ద తేడా ఉంది.
Philosophy
ఫిలాసఫీ లేదా తత్వశాస్త్రం అనగానే చాలామంది అబ్బా.. అదొక పెద్ద బోరింగ్ సబ్జెక్ట్, క్లాస్‌రూమ్‌లలో లెక్చర్లు వినడానికి మాత్రమే బాగుంటుందనే ఒక ఆలోచన ఉంటుంది. పెద్ద పెద్ద బుక్స్ చదివి, ఫ్రెండ్స్‌తో కూర్చుని గంటల తరబడి డిస్కస్ చేశాక, ఆ తర్వాత ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయి మళ్లీ రొటీన్ లైఫ్‌లోకి వెళ్లిపోవడం చాలామందికి అలవాటు.
అయితే ఒక గొప్ప థాట్‌ను అర్థం చేసుకోవడానికి, దాన్ని మన నిజ జీవితంలో అప్లై చేస్తూ బతకడానికి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. ఫిలాసఫీ అనేది కేవలం వారి ఆలోచనలను మైండ్‌లో మాత్రమే పెట్టుకోవడానికి కాదు..మనం ఎలాంటి మనిషిగా మారాలనే దానికి పర్ఫెక్ట్ ఆకారమిచ్చే సాధనంగా పనికొస్తుంది. డైలీ లైఫ్‌ను మార్చే, మెంటల్‌గా స్ట్రాంగ్ చేసే ఆ 10 అద్భుతమైన జీవన సూత్రాలు తెలుసుకోవాలని సైకాలజిస్టులు చెబుతున్నారు.
మొదటిది మెమెంటో మోరి (Memento Mori)అంటే మరణాన్ని గుర్తుంచుకోవడం అన్నమాట. మనం ఎల్లకాలం ఈ భూమి మీద ఉండిపోం. మనం జీవించే టైమ్ చాలా తక్కువ అనే కఠినమైన నిజం మనకు గుర్తొచ్చినప్పుడు.. పనికిరాని విషయాలపై సమయాన్ని వేస్ట్ చేయడాన్ని ఆపేస్తాం. రేపు చేద్దాంలే అని పోస్ట్‌పోన్ చేసే అలవాటును పక్కన పెట్టి, ఈ రోజే, ఇప్పుడే ప్రెజెంట్ మూమెంట్లో జీవించడం స్టార్ట్ చేస్తాం.
రెండవది అమోర్ ఫాటి ( Amor Fati) నీ తలరాతను ప్రేమించుకోవడం . మన లైఫ్‌లో ఏదైనా నష్టం, తీవ్రమైన నిరాశ ఎదురైనప్పుడు.. నాకే ఎందుకిలా జరిగిందని బాధపడటం కంటే జరిగిపోయిన దాన్ని ఒక పాఠంగా అనుకుని దాని నుంచి కొత్తగా ఏం నేర్చుకోవచ్చని ఆలోచించడమే దీని అసలైన కాన్సెప్ట్. కష్టమైన అనుభవాలే ఎప్పుడూ కూడా కొత్త జీవితానికి పునాది అవుతాయన్నది తెలుసుకోవాలి.
మూడవది కంట్రోల్ డైకోటమీ (Control dichotomy)నీ చేతుల్లో ఉన్న వాటి పైనే ఫోకస్ చేయాలని అనుకోవడం. మెంటల్ టెన్షన్‌కు మెయిన్ రీజన్ మన చేతుల్లో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడమే. మనం దేనిని కంట్రోల్ చేయగలమో, దేనిని కంట్రోల్ చేయలేమో స్పష్టంగా తెలుసుకున్నప్పుడు అనవసరమైన ఒత్తిడి మాయమవుతుంది. ఎప్పుడూ కూడా రిజల్ట్ ఎలా ఉంటుందో అనే భయాన్ని పక్కన పెట్టి, కేవలం మన ప్రయత్నం మీద మాత్రమే ఫోకస్ చేయడం అసలైన మనశ్శాంతిగా గుర్తించాలి.
నాలుగవది నెగిటివ్ విజువలైజేషన్ (Negative visualization) అంటే భవిష్యత్తులో ఎదురయ్యే చెడు పరిస్థితులను ముందే ఊహించడం. అంటే మనకిష్టమైన వస్తువునో, మనిషినో లేదా మనకున్న సంతోషాన్ని కోల్పోయామంటే ఎలా ఉంటుందని ఓ క్షణం ఊహించుకోవడం. ఇది వినడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ప్రస్తుతం మన దగ్గర ఉన్న దాని విలువ ఏంటో మనకి స్పష్టంగా అర్ధం అవుతుంది. దీంతో మన జీవితంలో ఉన్న ప్రతి నార్మల్ డే కూడా ఒక గొప్ప గిఫ్ట్ అనే ఫీలింగ్ కలుగుతుంది.
ఐదవది ఎసెన్షియలిజం (Essentialism) అత్యవసరమైన వాటికే ఇంపార్టెన్స్, ప్రయారిటీ ఇవ్వడం. మీ సమయాన్ని దేనికి కేటాయించాలో మీరు ఎంచుకోవడంలో సెలెక్టివ్‌గా ఉండటం అలవాటు చేసుకోవాలి. మీరు ప్రతీ దానికి ఎస్ చెబుతున్నారంటే, ఇంకేదో ఇంపార్టెంట్ అయిన దానికి ఇన్‌డైరెక్టుగా నో చెబుతున్నట్లు అర్థం. అందుకే మీ లైఫ్‌లో నిజంగా ఏది ముఖ్యమో దానికే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మీ షెడ్యూల్ ప్రాపర్ ట్రాక్‌లోకి వస్తుంది.
ఆరోది స్టోయిక్ అపాతి ( Stoic apathy )ఫలితాల నుంచి వేరుపడటం అన్నమాట. మన వంతు శ్రమను ఎలాంటి స్వార్ధం లేకుండా హండ్రెడ్‌కు హండ్రెడ్ పర్సంట్ పెట్టడం, కానీ ఫలితం ఎలా వచ్చినా సరే దానికి మానసికంగా అతీతంగా ఉండటం. రిజల్ట్స్ మన ఎమోషన్స్‌ను శాసించడం ఆపినప్పుడు, ఎంత పెద్ద ఛాలెంజ్‌నైనా బ్రెయిన్ సైలెంట్‌గా ఎంతో ప్రశాంతంగా ఫేస్ చేయగలుగుతుంది.
ఏడోది వర్చ్యూ ఎథిక్స్ (Virtue Ethics) రోజువారీ వ్యక్తిత్వ నిర్మాణం చేసుకోవడం. మనం నమ్మే నమ్మకాల వల్లే కాకుండా, మనం డైలీ చేసే పనుల ద్వారా మన క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. డైలీ లైఫ్‌లో మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు, ప్రవర్తించే తీరు మన శీలాన్ని, వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి.
ఎనిమిదోది అబ్సర్డిజం (Absurdism) నీ జీవితానికి నువ్వే అర్థాన్ని వెతుక్కో అని అర్థం. ఈ ప్రపంచం కానీ, జీవితం కానీ మనకు రెడీమేడ్‌గా ఎలాంటి అర్థాన్ని ఇవ్వదు. మన లైఫ్‌కు ఏది ముఖ్యమో, ఏది ఆనందాన్ని ఇస్తుందో మనమే డిసైడ్ చేసుకుని, మన యాంబిషన్స్కు అనుగుణంగా మన జీవితాన్ని డిజైన్ చేసుకోవాలి.
తొమ్మిదోది ఎగ్జిస్టెన్షియల్ ఫ్రీడమ్ (Existential Freedom)తలరాత కాదు, నీ ఎంపికే ముఖ్యమని తెలుసుకోవడం. మనకు ఎదురయ్యే పరిస్థితులు ఎప్పుడూ కూడా మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ ఆ పరిస్థితులకు మనం ఎలా రెస్పాండ్ అవుతున్నామనేది మాత్రం పూర్తిగా మన ఛాయిస్. నా రాత ఇంతే అంటూ కాలం మీదకో , ఇతరుల మీదకో నెపం నెట్టకుండా, మన నిర్ణయాలకు మనమే పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం దీని మెయిన్ కాన్సెప్ట్.

పదవది డెలిబరేట్ ప్రాక్టీస్ (Deliberate practice) సాధనతో మాత్రమే నైపుణ్యం సాధించొచ్చు అని అర్థం. ప్రతిరోజూ రెగ్యులర్‌గా చేసే హార్డ్ ప్రాక్టీస్ వల్లే ఏ ఫీల్డ్‌లోనైనా తిరుగులేని మాస్టరీ వస్తుంది. ట్యాలెంట్, లక్ కొద్దిగా హెల్ప్ చేయొచ్చు, కానీ డైలీ చేసే చిన్న చిన్న మెరుగుదలలే లాంగ్ రన్లో మనల్ని టాప్‌లో నిలబెడతాయి.
ఈ ఫిలాసఫీ అనేది మన పర్సనల్ గ్రోత్‌కు మరియు ఆలోచనా విధానాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కోలా ,ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కోలాగ ఉంటాయి కాబట్టి, ఈ సూత్రాలు మీకు ఎంతవరకూ ఉపయోగపడతాయి అనేది మీ లైఫ్‌స్టైల్ అండ్ ఫాలో అవడం మీదనే ఆధారపడి ఉంటుంది. వీటిని చదివి పక్కన పెట్టేయకుండా ఫాలో అయినపుడే అసలైన మ్యాజిక్ మొదలవుతుందన్న విషయాన్ని మాత్రం అందరూ గుర్తు పెట్టుకోవాలి.
View this post on Instagram
Romance In Relationship : రిలేషన్షిప్లో లవ్ కనిపించడం లేదా? ఎక్కడో ఆ స్పార్క్ మిస్ అవుతుందా?





