AI Consume Water : 80s ఏఐ ఇమేజ్ వెనుకున్న చేదు నిజం.. ఒక్క ఫోటో ఏఐ సర్వర్లకు ఎంత దాహాన్ని పెంచుతోందో తెలుసా?
AI Consume Water : ఏఐ సాయంతో కేవలం 10 నుంచి 50 రకాల ఇమేజ్‌లను కానీ, ప్రశ్నలను కానీ ప్రాసెస్ చేసినప్పుడు, ఆ సర్వర్లను చల్లబరచడానికి సుమారు 500 మిల్లీలీటర్ల నీరు ఖర్చవుతుంది.
AI Consume Water
వాట్సాప్, ఇన్ స్టా, ఫేస్ బుక్ ఇలా ఏది ఓపెన్ చేసినా ఓల్డ్ రెట్రో లుక్, 80ల నాటి హెయిర్ స్టైల్, ఓల్డ్ ఫిల్మ్ క్యామెరా షేడ్స్‌తో ఉన్న ఫోటోలే దర్శనమిస్తున్నాయి. తాము 80స్ లో ఉంటే ఇలా ఉండేవాళ్లమో చూసుకోవాలన్న సరదాతోనో, ట్రెండ్ ఫాలో అవుదామనో తమ ఫోటోలను ఏఐ (AI) యాప్స్ సాయంతో కొత్త ఇమేజ్‌లను జనరేట్ చేసి షేర్ చేస్తున్నారు.
చూడటానికి ఇది చాలా సరదాగా, చిన్న విషయంగానే అనిపించొచ్చు. కానీ, మన సరదా పిక్ కోసం మనం క్లిక్ చేసే ఆ ఒక్క జనరేట్ బటన్ వల్ల వేల లీటర్ల నీళ్లు అలా ఆవిరైపోతున్నాయనే చేదు నిజం మాత్రం చాలామందికి తెలీదు. అంతెందుకు ఫోటోకి, నీటికి అసలు సంబంధం ఉంటుందని కూడా వారికి తెలీదు.
ఫోటోను అప్లోడ్ చేసి, ఏఐ ద్వారా కొత్త ఇమేజ్ పొందే ప్రాసెస్ వెనుక డేటా సెంటర్లు (Data Centers) పనిచేస్తాయి. ఇవి చిన్న చిన్న రూమ్‌లు కావు.. పెద్ద సైజ్ బిల్డింగ్‌లలో వేల సంఖ్యలో చాలా పవర్ఫుల్ అయిన కంప్యూటర్ ప్రాసెసర్లు (GPUs) రన్ అవుతుంటాయి. ఎవరైనా ఒక 80s ఇమేజ్ అడిగినా లేదంటే వేరే వారికి కావాల్సిన ఇమేజ్ అడిగినా, ఆ ఏఐ మోడల్ మిలియన్ల కొద్దీ ఓల్డ్ ఫోటోలను అనాలసిస్ చేసి, వారిచ్చిన ఫేస్‌ను ఆ రెట్రో మోడ్‌లోకి చేంజ్ చేయడానికి కొన్ని కోట్ల లెక్కింపులు (Calculations) చేస్తుంది. ఈ ప్రాసెస్‌లో ప్రాసెసర్లు విపరీతమైన హీట్‌ను ప్రొడ్యూసర్ చేస్తాయి.
దాంతోనే అసలైన నీటి కథ స్టార్టవుతుంది. ఆ కంప్యూటర్ సర్వర్లు ఓవర్ హీట్ అయి క్రాష్ అవ్వకుండా ఉండటం కోసం వాటికి కంటిన్యూగా కూలింగ్ సిస్టమ్స్ అవసరం. ఈ డేటా సెంటర్లను కూల్ చేయడానికి భారీ స్థాయిలో ఆవిరి కూలింగ్ టవర్లను (Evaporative Cooling Towers) వాడతారు. అంటే, ఈ సర్వర్ల హీటును తగ్గించడానికి కోట్లాది లీటర్ల వాటర్‌ను పైపుల ద్వారా పంపి, ఆ హీట్‌ను ఆవిరి రూపంలో బయటకు పంపిస్తారు.
మనం ఏఐ సాయంతో కేవలం 10 నుంచి 50 రకాల ఇమేజ్‌లను కానీ, ప్రశ్నలను కానీ ప్రాసెస్ చేసినప్పుడు, ఆ సర్వర్లను చల్లబరచడానికి సుమారు 500 మిల్లీలీటర్ల నీరు ఖర్చవుతుంది. ఇది వినడానికి చిన్నగానే అన్పిస్తుంది. కానీ, వరల్డ్ వైడ్‌గా లక్షలాది మంది ప్రజలు ఒకే రకమైన 80s ఇమేజ్ ట్రెండ్ కోసం కోట్లాది ఫోటోలను జనరేట్ చేయాలని ఏఐని అడిగినపుడు.. ఆ లెక్కింపు లీటర్ల నుంచి వేల, లక్షల గ్యాలన్ల వాటర్ వేస్టేజ్‌కు దారితీస్తోంది.

అంతేకాదు ఈ డేటా సెంటర్లకు అవసరమయ్యే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూసర్ చేయడానికి పవర్ ప్లాంట్లలో కూడా వేల లీటర్ల వాటర్‌ను వాడతారు. అలా మనమంతా సరదాగా ఫాలో అయ్యే డిజిటల్ ట్రెండ్లు, రియల్ వరల్డ్ నేచురల్ రీసోర్సెస్‌ను ఎంత దారుణంగా ఖాళీ చేస్తున్నాయో చెప్పడానికి ఈ 80s ఇమేజ్ ట్రెండ్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అందుకే ఇకపై అయినా టెక్నాలజీని అవసరం కోసం వాడుకోవాలి తప్ప.. సరదాల కోసం మాత్రం కాదన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి





