Just EntertainmentLatest News

ICICI Bank : ఐసీఐసీఐ కొత్త రూల్స్..డిసెంబర్ 1 నుంచి అమలు

ICICI Bank : ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్‌కు షాక్ ఇస్తూ క్యాష్ లావాదేవీల ఛార్జీలను పెంచింది. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు, ఉచిత పరిమితి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ICICI Bank

బ్యాంకు అకౌంట్ ఉంటే ఎప్పుడో ఒకసారి డబ్బులు వేయడం, తీసుకోవడం కామన్. కానీ మనం చేసే ఈ చిన్న చిన్న క్యాష్ ట్రాన్జాక్షన్లే మన జేబుకు కన్నం వేస్తున్నాయనే విషయం చాలామందికి తెలీదు. దీనిలో ఐసీఐసీఐ బ్యాంక్ తన సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు ఒక షాకింగ్ అప్‌డేట్ ఇచ్చింది.

డిసెంబర్ 1 నుంచి క్యాష్ లావాదేవీలకు సంబంధించి ఛార్జీలను భారీగా పెంచడానికి సిద్ధమైంది. అందరి మీద ఈ బాదుడు ఉంటుందా అంటే ఉండదు కానీ.. బ్యాంక్ రూల్స్(ICICI Bank) దాటి ఎక్కువ సార్లు ట్రాన్జాక్షన్లు చేస్తేనే మీ అకౌంట్ నుంచి ఈ ఎక్స్‌ట్రా డబ్బులు కట్ అవుతాయి.

బ్యాంక్(ICICI Bank) కొత్త నిబంధనల ప్రకారం.. నెలకు కేవలం మూడు సార్లు మాత్రమే ఎలాంటి ఛార్జీలు లేకుండా క్యాష్ డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే 3 సార్లు మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. దీంతో పాటు నెల మొత్తం మీద రూ.1 లక్ష వరకు నగదు లావాదేవీలకు ఎలాంటి ఛార్జీ పడదు.

ఇప్పటివరకు ఫ్రీ లిమిట్ దాటితే ప్రతి రూ. వెయ్యికి రూ. 3.50 ఛార్జీ వసూలు చేసేవారు. కానీ డిసెంబర్ 1 నుంచి ఆ రేటును రూ. 4కు పెంచుతూ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. అయితే కనీస ఛార్జీ మాత్రం రూ.150 దగ్గరే ఆగుతుంది.

ప్రతీ నెలా బ్యాంకు ఉచితంగా ఇచ్చిన మూడు సార్లు లేదంటే లక్ష రూపాయల పరిమితి దాటకుండా చూసుకోవాలి. ఒకవేళ బిజినెస్ లేదా పర్సనల్ అవసరాల కోసం తరచూ పెద్ద మొత్తంలో క్యాష్‌తో డీల్ చేసే అలవాటుంటే మాత్రం మీ అకౌంట్‌లో తెలీకుండానే అదనపు ఛార్జీలు పడిపోతుంటాయి.

FAHR-Face : ఫోటోతో ఆయుష్షు లెక్క చెప్పేస్తున్న ఏఐ..క్యాన్సర్ ముప్పునూ ముందే పసిగట్టేస్తున్న టెక్నాలజీ..

Related Articles

Back to top button