Just NationalJust BusinessLatest News

Gold Rate Down : వరుసగా పడిపోతున్న గోల్డ్ ధర..4 రోజుల్లో రూ.4 వేలు డౌన్..

Gold Rate Down : గోల్డ్ కొనాలనుకునే వారికి అదిరిపోయే అప్‌డేట్ వస్తోంది. వరుసగా తగ్గుతున్న గోల్డ్ రేట్లు, తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.

Gold Rate Down

బంగారం పేరు వింటేనే మగువల ఫేస్‌లో ఎక్కడ లేని వెలుగు వస్తుంది. అటువంటిది ఎప్పుడూ ఆకాశాన్ని తాకే బంగారం ధరలు మెల్లమెల్లగా కిందికి దిగి వస్తుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. కొద్ది రోజులుగా పుత్తడి ప్రియులకు ఊరటనిచ్చే వార్తలు వినిపిస్తున్నాయి.

వరుసగా 4 రోజులుగా గోల్డ్ ధరలు తగ్గుతూ వస్తుండటంతో మగువలు హ్యాపీగా షాపింగ్ బాట పడుతున్నారు. దసరా పండుగ సీజన్ నుంచి గోల్డ్ మార్కెట్‌లో ఈ తగ్గుదల మొదలైంది. కేవలం నాలుగు రోజుల్లోనే తులం బంగారంపై సుమారు రూ. 4 వేల వరకు ధర తగ్గడం విశేషం.

అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్న అనూహ్య పరిణామాలే ఈ రేట్ల పతనానికి అసలు కారణమని నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో ఔన్సు గోల్డ్ ధర ఏకంగా 20 డాలర్లు తగ్గి ప్రస్తుతం 4,006 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

దీని ప్రభావం మన దేశీ మార్కెట్లపైన కూడా బానే పడింది. తెలుగు రాష్ట్రాల మెయిన్ సిటీలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఈరోజు ఉదయం నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 1లక్ష42వేల480 వద్ద ఉండగా, జ్యువెలరీ కోసం వాడే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1లక్ష30వేల600 వద్ద స్థిరపడింది.

దేశ రాజధానితో పోలిస్తే హైదరాబాద్‌ దగ్గర రేట్లు సుమారు అలాగే ఉన్నాయి. ఇక వెండి విషయానికి వస్తే కిలో సిల్వర్ ధర రూ. 2లక్షల25వేల వద్దే కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో ఈ మంత్ ఎండ్‌ నాటికి గోల్డ్ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

FAHR-Face : ఫోటోతో ఆయుష్షు లెక్క చెప్పేస్తున్న ఏఐ..క్యాన్సర్ ముప్పునూ ముందే పసిగట్టేస్తున్న టెక్నాలజీ..

Related Articles

Back to top button