Gold : మనదేశంలోనే భారీగా బంగారు నిల్వలు..ఎక్కడున్నాయో తెలుసా?
Gold :ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఉన్న రామగిరి గనులు (Ramagiri mines,)కూడా చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందినవి.

Gold
భారతీయులకు బంగారం కేవలం అలంకరణ వస్తువు కాదు, అది మన సంస్కృతిలో, సంప్రదాయాల్లో ఒక భాగం. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల్లో బంగారం తప్పనిసరి. ఇలా మన జీవితాల్లో అంతర్భాగంగా మారిన బంగారం వాస్తవానికి మన దేశంలో ఎక్కడి నుంచి వస్తుంది, మన దేశంలో ఎంత బంగారం దాగి ఉందో తెలుసుకుందాం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నివేదిక ప్రకారం, 2025 మార్చి 31 నాటికి భారతదేశంలో ప్రభుత్వ మరియు రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న బంగారం నిల్వలు సుమారు 879.58 మెట్రిక్ టన్నులు. గత ఏడాదితో పోలిస్తే ఇది 7% పెరుగుదల. దీని మొత్తం విలువ ₹6.68 లక్షల కోట్లకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల, రూపాయి డాలర్ మార్పిడి లోపం ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు.
మన దేశంలో బంగారు (Gold)నిల్వలు ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. కర్ణాటకలోని హుట్టి గనులు దేశంలో ఇప్పటికీ చురుగ్గా పనిచేస్తున్న అతి పురాతన గనులుగా ఫేమస్ అయ్యాయి. ఇక్కడ ప్రతి ఏటా సుమారు 1.8 టన్నుల బంగారం(Gold) తవ్వుతున్నారు. ఇక్కడ బంగారు ఖననం మూడు వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. అలాగే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF) కూడా కర్ణాటకలోనే ఉంది, ఇది బ్రిటిష్ కాలంలో 1880లో ప్రారంభమైంది. 2001 వరకు ఇక్కడ నుంచి 800 టన్నుల బంగారం తవ్వారు, ప్రస్తుతం ఇది మూసివేయబడింది. ఉత్తరప్రదేశ్లోని సోనభద్ర ప్రాంతంలో 2020లో భారీ బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, ఉత్తరప్రదేశ్లో కొత్త ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి.

ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఉన్న రామగిరి గనులు (Ramagiri mines,)కూడా చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందినవి. ఇవి దాదాపు రెండు దశాబ్దాలుగా మూసివేయబడి ఉన్నాయి, అయితే మళ్లీ తవ్వకాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే చిత్తూరు జిల్లాలోని చిగర్ గుంట ప్రాంతంలో కూడా పెద్ద మొత్తంలో అలువియల్ బంగారు ఖనిజం గుర్తించారు. భవిష్యత్తులో ఇది తవ్వకాలకు ఒక ముఖ్య కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఇటీవల 2025లో మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా, బేలా గ్రామంలో కొత్త బంగారు నిక్షేపాలను గుర్తించారు. ఇక్కడ లక్షల టన్నుల బంగారం ఉండవచ్చని ప్రాథమిక అంచనా.

ఈ బంగారు నిల్వలు(Indian gold reserve) భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి అవకాశాలకు కొత్త మార్గాలను చూపుతాయి. మన దేశంలోని దేవాలయాలు, ప్రజల వద్ద ప్రపంచంలోనే ఎక్కువ బంగారం ఉందని అంచనా. ఈ కొత్త నిల్వలను సద్వినియోగం చేసుకుంటే, మైనింగ్, రిఫైనింగ్, జెమ్స్ & జ్యువెలరీ రంగాల్లో కొత్త ఉద్యోగాలు వస్తాయి. బంగారం (Gold)ధరలు డాలర్ మార్పిడి, ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలను బట్టి మారుతూ ఉంటాయి. భారతీయలకు బంగారంపై ఉన్న మక్కువ అంతుచిక్కనిది. ఇంట్లో నమ్మకమైన పెట్టుబడిగా, పండుగల్లో లక్ష్మీదేవి ప్రతిరూపంగా, ఆస్తిగా బంగారం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. దేశవ్యాప్తంగా కొత్త గనులు వెలుగులోకి వస్తుండటంతో, వీటిని దేశాభివృద్ధికి సరిగ్గా వినియోగిస్తే, భారతదేశ భవిష్యత్తు నిజంగా ‘బంగారు వెలుగు’తో నిండిపోతుందన్నది విశ్లేషకుల అంచనా.
One Comment