Just SportsLatest News

MS Dhoni : ఒక శకం ముగిసింది..కానీ బంధం మారలేదు..సీఎస్‌కే ప్లేయర్‌గా ధోని గుడ్‌బై..

MS Dhoni : భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించి సీఎస్‌కే మెంటార్‌గా మారారు. ఎల్లో ఆర్మీ ఫ్యాన్స్ తీవ్ర ఎమోషనల్‌కి గురి చేస్తున్న బిగ్ అప్‌డేట్..

MS Dhoni

కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ గుండె చప్పుడు, చెన్నై వీధుల్లో ..తలా అని మార్మోగే ఆ ఒకే ఒక్క పేరు మహేంద్ర సింగ్ ధోని. పిచ్‌లో ఆఖరి ఓవర్‌లో సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించినా, వికెట్ల వెనక రెప్పపాటులో స్టంపింగ్ చేసినా అది ధోనికి మాత్రమే సాధ్యం. అయితే, ఎలాంటి సుదీర్ఘమైన అద్భుత జర్నీకి అయినా  ఒక ముగింపు తప్పదు .

చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన మన క్యాప్టెన్ కూల్ ప్లేయర్‌గా ఐపీఎల్‌కు వీడ్కోలు పలికారు. ఈ న్యూస్ వినగానే ఎల్లో ఆర్మీ ఫ్యాన్స్ గుండెలు ఒక్కసారిగా బరువెక్కిపోయాయి. చెపాక్ స్టేడియంలో ధోని.. ధోని..అనే నినాదాలు ఇక ఆటగాడిగా వినిపించవనే ఫ్యాక్ట్.. ఫ్యాన్స్‌ను కన్నీళ్లు పెట్టిస్తోంది.

అయితే, ఈ ఎమోషనల్ గుడ్‌బై వెనుకే ఒక క్రేజీ ట్విస్ట్ ఉంది. మైదానంలో బ్యాట్ పట్టి బౌండరీలు బాదే ధోనిని ఇక చూడలేకపోయినా, ‘తలా’.. చెన్నై సూపర్ కింగ్స్‌ను వదిలి ఎక్కడికీ వెళ్లడం లేదు. ఐపీఎల్ 2027 సీజన్ నుంచి సీఎస్‌కే టీమ్ మెంటార్‌గా నయా అవతారంలోకి మారబోతున్నారు.

పిచ్‌లో పసుపు చొక్కా వేసుకుని మనల్ని అలరించిన ధోని(MS Dhoni), ఇకపై డగ్‌అవుట్‌లో కూర్చుని టీమ్‌ని నడిపించబోతున్నారు. ఆటగాడిగా రోల్ మారినా, సీఎస్‌కే ఫ్రాంచైజీతో ధోనికి ఉన్న బంధం ఎప్పటికీ చెక్కుచెదరదని ఈ బిగ్ డెసిషన్ ప్రూవ్ చేసింది.

ఈ మూమెంట్‌పై సీఎస్‌కే అధినేత ఎన్. శ్రీనివాసన్ ఎమోషనల్ గురయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ అంటేనే ధోని, ధోని అంటేనే సీఎస్‌కే.. ఈ రెండింటినీ విడదీయడం ఎవరి వల్ల కాదంటూ స్పష్టం చేశారు. 5 సార్లు జట్టును విజేతగా నిలిపి, ఎన్నో చిరస్మరణీయ విక్టరీలను అందించిన సీనియర్ ప్లేయర్ ఇకపై మెంటార్‌గా ఉండటం తమకు శ్రీరామరక్ష అని ఎన్. శ్రీనివాసన్ అన్నారు.

కుర్రాళ్లకు గైడెన్స్ ఇస్తూ,స్ట్రాటజీని రచిస్తూ ధోని(MS Dhoni) టీమ్‌ని ఎలా గైడ్ చేస్తారో చూడటానికి అభిమానులు ఇప్పటి నుంచే ఫుల్ క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. ఆటగాడిగా మెరుపులు ఆగిపోయినా, మెంటార్‌గా ‘తలా’ రాజసం మాత్రం సీఎస్‌కే క్యాంప్‌లో ఎప్పటికీ అలాగే కంటిన్యూ అవుతుంది.

PAN Card Name Change : పాన్ కార్డులో పేరు తప్పుగా ఉందా? ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో ఇలా మార్చుకోండి

Related Articles

Back to top button