Table Rose :నిజంగా గడ్డి గులాబీలో ఇన్ని అద్భుతాలున్నాయా?
Table Rose :చూడటానికి చిన్నగా, చాలా సులభంగా పెరిగే ఈ మొక్కలో అపారమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని మన పూర్వీకులకు తెలుసు.

Table Rose
మన చిన్ననాటి జ్ఞాపకాల్లో ఎక్కడో ఓ మూలన, రోడ్డు పక్కన కానీ, పాత గోడల సందుల్లో కానీ పలకరించే ఒక చిన్న పువ్వు ఉంటుంది. అదే… ఈ తరానికి పెద్దగా తెలియని గడ్డి గులాబీ(Table Rose)ని ఇంగ్లీషులో ‘టేబుల్ రోజ్’ అని పిలుస్తుంటారు. చూడటానికి చిన్నగా, చాలా సులభంగా పెరిగే ఈ మొక్కలో అపారమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని మన పూర్వీకులకు తెలుసు. కానీ, ఇప్పుడు దాని శక్తిని మనం పూర్తిగా మర్చిపోయాం.
అందమైన ఈ పువ్వు కేవలం మీ ఇంటికి అలంకారం మాత్రమే కాదు, మీ ఆరోగ్యానికి కూడా ఒక అద్భుతమైన వరం. దీని ఉపయోగాలు తెలిస్తే, ఇకపై ఈ మొక్కను మీరు అస్సలు వదిలిపెట్టరు.
టేబుల్ రోజ్ ఆకులు, పువ్వులలో చర్మాన్ని మెరిపించే, గాయాలను మాన్పే అద్భుతమైన గుణాలు ఉన్నాయి. దీనిని మనం కొన్నిసార్లు ‘బ్యూటీ మేజికల్ ప్లాంట్’ అని కూడా పిలవొచ్చు.
Eating disorders:ఈటింగ్ డిజార్డర్స్.. శరీరానికి, మనసుకు జరిగే హానికరమైన పోరాటం గురించి తెలుసా ?
వీటితో మచ్చలు మాయం, మొఖం గ్లో అవుతుంది. గడ్డి గులాబీ (Table Rose)పూలను మెత్తగా పేస్ట్ చేసి, కొద్దిగా తేనె కలిపి ముఖానికి ప్యాక్ లా వేయండి. ఇది చర్మంపై ఉండే నల్ల మచ్చలు, మొటిమలను తగ్గించి, మీ ముఖం కాంతివంతంగా, తాజాగా ఉండేలా చేస్తుంది. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చాలు, తేడా మీకే తెలుస్తుంది.
జుట్టు రాలే సమస్యకు బ్రేక్ పెట్టొచ్చు. ఈ మొక్క ఆకులను, కాండాన్ని బాగా ముద్దగా నూరి, అందులో కొంచెం స్వచ్ఛమైన కొబ్బరి నూనె కలిపి తలకు, జుట్టు కుదుళ్లకు పట్టించండి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి, కుదుళ్లను బలంగా మార్చి, జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.

గడ్డి గులాబీ(Table Rose ) కేవలం అందానికే కాదు, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు కూడా ఒక దివ్యౌషధం. చిన్న గాయాలకు తక్షణ సహాయం అందిస్తుంది. ఎక్కడైనా చిన్న గాయాలు అయినప్పుడు, ఈ మొక్క ఆకులను నలిపి, దాని రసాన్ని గాయంపై రాస్తే, రక్తస్రావం వెంటనే ఆగిపోతుంది. ఇది సహజసిద్ధమైన యాంటీసెప్టిక్‌లా పనిచేస్తుంది.
దగ్గుకు చెక్ పెట్టొచ్చు. ఈ మొక్క వేరుతో కషాయం తయారుచేసుకుని తాగితే, దగ్గు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది గొంతులో ఉండే కఫాన్ని తొలగించి, శ్వాసకోశాన్ని శుభ్రం చేస్తుంది.
ఎవరూ ఊహించని మరో లాభం కూడా ఉంది. ఈ మొక్క ఆకులలో విటమిన్లు, ఖనిజాలు మరియు ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు చాలా మంచివి.